ఎన్నారైగా హంగామా | Rams Pandaga Chesko Regular Shooting From monday | Sakshi
Sakshi News home page

ఎన్నారైగా హంగామా

Published Tue, Jun 17 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

ఎన్నారైగా హంగామా

ఎన్నారైగా హంగామా

డాలర్లలో పుట్టి పెరిగిన కుర్రాడు అతను. పిజ్జాలూ బర్గర్‌లూ, ఫ్యాషన్లూ, హైఫై, వైఫై... ఇదే అతని ప్రపంచం. అలాంటివాడు విదేశం వదిలి స్వదేశంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. ఇక్కడకు ఎందుకొచ్చాడు? ఇక్కడేం చేశాడు? రామ్ తాజా సినిమా ‘పండగ చేస్కో’ కథా కమామీషు ఇది. ఎన్నారై కుర్రాడిగా ఫుల్ జోష్‌తో రామ్ ఇందులో కనిపిస్తారని దర్శకుడు గోపీచంద్ మలినేని చెబుతున్నారు. రవితేజతో ‘బలుపు’ వంటి హిట్ సినిమా చేసిన గోపి ఈ చిత్రాన్ని రామ్ శారీరక భాషకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు.
 
 ‘సింహా’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన నిర్మాత పరుచూరి ప్రసాద్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన పాత్రలో రకరకాల డైమన్షన్లు ఉండడంలో రామ్ ఈ సినిమా విషయంలో ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. రామ్ శైలికి తగిన వినోదం, యాక్షన్ ఇందులో ఉంటాయట. ఈ చిత్రంలో రామ్‌కి జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్నారు. సోమవారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. త్వరలో విదేశాల్లో భారీ షెడ్యూలు చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement