స్టయిలిష్ లుక్... | Ram's new look in Pandaga Chesko | Sakshi
Sakshi News home page

స్టయిలిష్ లుక్...

Published Sun, Sep 14 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

స్టయిలిష్ లుక్...

స్టయిలిష్ లుక్...

తొలి సినిమా ‘దేవదాస్’ నుంచి మొన్నటి ‘మసాలా’ వరకూ సినిమా సినిమాకీ తనలోని ఎనర్జీ లెవల్స్‌ని పెంచుకుంటూ వెళ్తున్నారు హీరో రామ్. ప్రస్తుతం ‘పండగచేస్కో’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారాయన. కుర్రకారు పండగ చేసుకునేలా ఈ సినిమా కథ, కథనాలుంటాయని చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని అంటున్నారు. ఈ చిత్రంలో రామ్ చాలా స్టయిలిష్ లుక్‌తో కనిపిస్తారని ఆయన పేర్కొన్నారు. పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సందర్భంగా పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘నటునిగా రామ్ సత్తా ఏంటో తెలిపే సినిమా ఇది. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా పాత్ర చిత్రణ ఉంటుంది.
 
 గత నెలలో 15 రోజుల పాటు పొల్లాచ్చిలో స్టన్ శివ నేతృత్వంలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించాం. ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకూ హైదరాబాద్‌లో కొంత టాకీతో పాటు పోరాట సన్నివేశాలు తీస్తాం. అక్టోబర్ 20 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ఉంటుంది’’ అని తెలిపారు. రకుల్ ప్రీత్‌సింగ్, సోనాలి చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, కెమెరా: ఆర్థర్ వెల్సన్, సంగీతం: తమన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement