పది రోజుల్లో పండగ మొదలు
ప్రేక్షకులు పండగ చేసుకునే స్థాయిలో మా ‘పండగ చేస్కో’ ఉంటుందని నిర్మాత పరుచూరి కిరీటి అంటున్నారు. రామ్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12న మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇందులోని హీరో పాత్ర చిత్రణ రామ్ శారీరకభాషకు తగ్గట్టుగా ఉంటుంది. రామ్ అత్యంత శక్తిమంతమైన పాత్రను పోషించనున్నారు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోనవెంకట్, కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్, సంగీతం: తమన్, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: పరుచూరి ప్రసాద్.