విక్టరీ వెంకటేష్, ఎనర్జీటిక్ హీరో రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'మసాలా' సినిమా ఫస్ట్ లుక్ విడుదలయింది. సినిమా నిర్మాతలు అధికారికంగా దీన్ని విడుదల చేశారు. ఇంతకుముందు ఫేస్ బుక్లో వెంకటేష్, రామ్ ఫోటో పెట్టిన సంగతి తెలిసింది. చూడగానే ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు చాలా టైటిళ్లు ప్రచారంలోకి వచ్చాయి. 'మసాలా' పోస్టర్ విడుదలతో టైటిల్పై క్లారిటీ వచ్చింది.
హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’కు ఇది రీమేక్. విజయభాస్కర్ దర్శకుడు. డి.సురేష్‌బాబు సమర్పణలో ‘స్రవంతి’రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్ సరసన అంజలి, రామ్కు జోడీగా షాజన్ పదమ్ సి నటించారు.
'మసాలా' ఆడియో దసరాకు విడుదల చేయనున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అక్టోబర్ చివరి వారంలో సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. వెంకటేష్, రామ్ తొలిసారిగా కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దసరాకు 'మసాలా' ఆడియో!
Published Wed, Sep 25 2013 8:15 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
Advertisement
Advertisement