మండే ఎండలనుంచి ఉపశమనం కలిగేలా వర్షం పడితే భలే హాయిగాఉంటుంది కదా. మరి ఈ చల్లని వాతావరణానికి తగ్గట్టుగా ఏ మిర్చి బజ్జీనో, వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీనో, లేదంటే కారం కారంగా మరమరాలతో చేసిన ముంత మసాలానో తింటే ఇంకా బావుంటుంది. అయితే వంకాయ ముంత మసాలా ఎపుడైనా తిన్నారా?
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది. చక్కగా నవనవలాడే వంకాయలను నూనెలో వేయించి, ఆ తరువాత ముందుగానే మెత్తగా, చేతిజారుగా కలుపుకొని ఉంచుకున్న శనగపిండలో ముంచి నూనెలో బజ్జీలా వేయించాడు. తరువాత ఆ వంకాయ బజ్జీ పొట్ట చీల్చి కొద్దిగా మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కల్ని కూరాడు. పైన నిమ్మరసం చల్లి, దాన్ని మళ్లీ ముక్కలుగా కట్ చేసి, కొత్తిమీర, వేయించిన వేరు శనగపప్పు,మిక్సర్ యాడ్ చేసి అందించాడు.
అయితే నెటిజన్లు భిన్నంగా స్పందించారు. భయ్యా, వంకాయల్లో పురుగులుంటాయిగా.. చూడకుండా వేయించేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.అన్ని వంకాయలు తినడానికి శుభ్రంగా ఉండవు, ఎప్పుడూ కట్ చేసి, పురుగులో ఉన్నాయో లేదో చెక్ చేయాలి. వంకాయ క్యాలీఫ్లవర్‌లో ఉండే కీటకాలు కొన్నిసార్లు పైకి కనిపించవు.. శభ్రంగా కడగాలి కూడా అంటూ కమెంట్ చేశారు.
నిజమే కదా... ఏ కూరలైనా వండుకునేముందుకు శభ్రంగా కడగాలి. లేదంటే పురుగు మందు అవశేషాలు మన కడుపులోకి చేరతాయి. అలాగే పురుగులను కూడా చెక్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలను పాటిస్తూ, ఈ వంకాయ ముంత మసాలాను ఒకసారి ట్రై చేయండి!
Comments
Please login to add a commentAdd a comment