కిచెన్ టిప్స్
►వంకాయ ముక్కలను కోసిన వెంటనే ఉప్పు నీటిలో వేయాలి.టేబుల్ స్పూను నిమ్మరసం వేసిన నీటిలో కోసిన వంకాయ ముక్కలపై వేస్తే రంగుమారవు.
►రెండు స్పూన్ల నీటిలో స్పూను పాలు పోసి చక్కగా కలపాలి. ఈ పాల మిశ్రమాన్ని వంకాయ ముక్కలపై చల్లాలి. ముక్కలు చేదుగా మారవు.
వంకాయ ముక్కలు లేదా కూరగాయ ముక్కలు వేసే నీటిలో టేబుల్ స్పూను వెనిగర్ వేసి కలపాలి. అప్పుడు కూరగాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.
►పండిన అరటిపండు గుజ్జు, కొద్దిగా పెరుగు వేసి చపాతీపిండిని ముద్దగా కలిపితే చపాతీలు మరింత మృదువుగా మెత్తగా, రుచికరంగా ఉంటాయి.
►సమోసా పిండిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపితే సమోసాలు మరింత క్రిస్పీగా కరకరలాడతాయి.
వర్షంలోనూ క్లియర్ వ్యూ మిర్రర్
వర్షాకాలంలో కారు అద్దాలు తడిసి ఎదురుగా వస్తోన్న వాహనాలు సరిగా కనపడవు. వైప్స్, గుడ్డతో తుడిచినప్పటికీ ఇంకా మసకమసకగానే కనిపిస్తుంది. ఇలా కాకుండా అద్దం క్లియర్‌గా కనిపించాలంటే.. బంగాళ దుంపను రెండు చెక్కలు చేయాలి. ఒక చెక్కను తడిసిన అద్దంపై రుద్దాలి. అద్దం మీద ఉన్న తడిపోయి క్లియర్‌గా ఉంటుంది. మరోసారి వర్షం నీళ్లు పడినా సులభంగా జారిపోయి అద్దం స్పష్టంగా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment