Reddit User Discovers Only 5 Chips In INR 10 Chips Packet, Internet Reacts - Sakshi
Sakshi News home page

రూ. 10ప్యాకెట్‌లో 5 చిప్స్‌! ఇక రూ.2 చేంజ్‌కి ఒక చిప్‌ ఇస్తారా?!

Published Sat, Oct 15 2022 11:49 AM | Last Updated on Sat, Oct 15 2022 4:03 PM

Reddit User Discovers Only 5 Chips In INR 10 Chips Packe Internet Reacts - Sakshi

సాక్షి, ముంబై: చిరుతిండి,  కాలక్షేపం అనగానే దాదాపు అందరి దృష్టి  చిప్స్‌ వైపే మళ్లుతుంది.  ఎంత  పెద్ద   చిప్స్‌ ప్యాకెట్‌ కొన్నా.. అందులో గ్యాస్‌ ఎక్కువ.. చిప్స్‌  తక్కువ ఇది అందరికి తెలిసిన సంగతే.  తాజాగా మరో వింత సంగతి  ఒకటి వెలుగులోకి వచ్చింది. 10రూపాయల చిప్స్‌ ప్యాకెట్‌ కొన్న వినియోగదారుడు అందులో కేవలం చిప్స్‌ ఉండటంతో తెల్లబోయాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో నెటిజన్లు సెటైర్లతో సందడి  చేస్తున్నారు.

ఒక విద్యార్థి కాలేజీకి వెడుతూ పది రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. కట్‌ చేస్తే.. అక్షరాలా ఐదు చిప్స్ మాత్రమే ఉన్నాయి.  దీన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌లో షేర్‌‌ చేయగానే.. చిప్‌కు రెండు రూపాయలు భయ్యా.. ఇకపై రెండు రూపాయల చేంజ్  లేకపోతే ఒక చిప్‌ చేతిలో పెడతారేమో అని  ఒక యూజర్‌ కమెంట్‌ చేశాడు.  గత 27 ఏళ్లుగా టాప్‌ క్వాలీటీ మసాలా ఎయిర్‌ అమ్ముతూనే ఉన్నారు.. అది కాస్ట్‌లీ గ్యాస్‌... మనం తినే చిప్స్‌ జస్ట్‌ కాంప్లిమెంట్‌.. ఇలా రకరకాల  కామెంట్లతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement