ఖాట్మండు: నేపాల్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. భారతీయ కరెన్సీ రూ .2,000, రూ 500, రూ.200 ల నోట్లను నిషేధించింది. స్థానిక మీడియా అందించిన సమాచారం ప్రకారం రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన భారతీయ నోట్లు చలామణిని చట్టబద్దంగా రద్దు చేసింది. రూ. 100పైన విలువ ఉన్నభారతీయ కరెన్సీని తమ వద్ద ఉంచుకోవద్దని నేపాల్ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తాజా నిర్ణయం ప్రకారం 100రూపాయలు, ఆలోపు విలువగల భారతీయ నోట్లు మాత్రమే అక్కడ చలామణిలో ఉంటాయన్నమాట. భారత్ కరెన్సీ రూ.2000, రూ.500, రూ.200 నోట్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు నేపాల్ సమాచార, ప్రసార శాఖ మంత్రి, నేపాల్ ప్రభుత్వ ప్రతినిధి గోకుల్ ప్రసాద్ బస్కోట ప్రకటించారని ఖాట్మండు పోస్ట్ రిపోర్టు చేసింది.
తాజా నిర్ణయం భారతదేశంలో పనిచేసే నేపాల్ కార్మికులను భారీగా ప్రభావితం చేయనుంది. అలాగే నేపాల్‌ను సందర్శించే భారత పర్యాటకులకు కూడా ఇబ్బందులు తప్పవు. కాగా 2016లో పెద్ద నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. అయితే ఆ సమయంలో ఎటువంటి ప్రకటనా చేయని నేపాల్ ప్రభుత్వం అకస్మికంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment