evarest
-
ఎండీహెచ్, ఎవరెస్ట్‌లకు క్లీన్ చిట్
భారత్‌కు చెందిన ప్రముఖ మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్ సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (fssai) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ రెండు సంస్థల అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లోక్యాన్సర్‌కు కారకమయ్యే ఎథిలీన్ ఆక్సైడ్ (eto) రసాయనాలు లేవని నిర్ధారించింది.కొద్ది రోజుల క్రితం భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లో పరిమితికి మించి ఎథిలీన్ ఆక్సైడ్ అనే పురుగుల మందు ఉన్నట్లు కనుగొన్నామని హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) ఏప్రిల్ 5న ప్రకటించింది. ఈ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సీఎఫ్ఎస్ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ రీకాల్ చేసింది.అందులో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్ మిక్స్డ్ మసాలా పౌడర్ ఉన్నాయి.ఎఫ్ఎస్ఏఐ అప్రమత్తంఆ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన ఎఫ్ఎస్ఎస్ఏఐ అన్నీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ సేప్టీ కమిషనర్లు, రిజినల్ డైరెక్టర్లను అప్రమత్తం చేసింది. వెంటనే ఎవరెస్ట్, ఎమ్‌డీహెచ్ మసాల పొడుల శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిపై టెస్టులు చేయాలని ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు మహరాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్‌లలో మసాల దినుసుల శాంపిల్స్‌ను కలెక్ట్ చేశారు.ఇథిలీన్ ఆక్సైడ్ గురించి అన్వేషణపలు నివేదికల ప్రకారం.. అధికారులు మసాల దినుసుల శాంపిల్స్‌ను పరీక్షించారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో ఇథిలీన్ ఆక్సైడ్ కోసం నమూనాలను పరీక్షించారు.28 ల్యాబ్ రిపోర్టులు అయితే ఇప్పటివరకు 28 ల్యాబ్ రిపోర్టులు అందాయి. ఫుడ్ రెగ్యులేటర్ సైంటిఫిక్ ప్యానెల్ శాంపిల్స్‌ను విశ్లేషించగా వాటిలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనం లేదని తేలింది.ఆ రెండు కంపెనీలకు క్లీన్ చిట్‌అంతేకాదు ఇతర బ్రాండ్లకు చెందిన మరో 300 మసాలా శాంపిల్స్ పరీక్ష నివేదికలను కూడా విశ్లేషించింది. అయితే భారతీయ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమైనవని చూపిస్తూ క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థం ఆనవాళ్లు లేవని ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్‌లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
భారతీయ మసాల దినుసుల తయారీ సంస్థ ఎండీహెచ్, ఎవరెస్ట్ సంస్థలకు మరో ఎదురు దెబ్బ తగిలింది.ఇటీవల ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాల దినుసుల్లో క్యాన్సర్ కారక పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ అధిక స్థాయిలో ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సింగపూర్, హాంకాంగ్‌లు భారత్ మసాల దినుసుల్ని వినియోగించరాదంటూ ఆ రెండు దేశాలు అధికారంగా ప్రకటించారు.తాజాగా, నేపాల్ సైతం భారత్‌లో తయారయ్యే మసాల దినుసుల్ని వినియోగించడానికి వీలు లేదని, అందుకు నాణ్యతాపరమైన కారణాల్ని ఎత్తి చూపింది. ఇథిలీన్ ఆక్సైడ్ కారణంగానేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ప్రకారం, అనుమానాస్పద ఇథిలీన్ ఆక్సైడ్ కారణంగా ఎండీహెచ్, ఎవరెస్ట్‌కు చెందిన నాలుగు మసాలా దినుసులపై నిషేధం విధించింది. నేపాల్ నిషేధం విధించిన మసాలలలో మద్రాస్ కర్రీ పౌడర్, సాంభార్ మిక్స్డ్ మసాలా పౌడర్, నేపాల్‌లో ఎండీహెచ్ మిక్స్డ్ మసాలా కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలు ఉన్నాయి. ఇథిలీన్ ఆక్సైడ్ పరిమితిని మించిఈ నాలుగు ఉత్పత్తులలో ఇథిలీన్ ఆక్సైడ్ పరిమితిని మించి ఉన్నట్లు గుర్తించామని, ఆహార నియంత్రణ 2027 బీఎస్ ఆర్టికల్ 19 ప్రకారం ఈ ఉత్పత్తుల దిగుమతి, అమ్మకం దేశంలో నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. మసాలా ఎగుమతులు దాదాపు 40 శాతం భారత్ ప్రపంచ సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ది ఇక్కడ తయారైన 200కు పైగా మసాలాలు దాదాపు 180 దేశాలకు ఎగుమతి అన్నాయి. వీటి విలువ రూ. 33 వేల కోట్లు అని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. దేశీయ మార్కెట్ రూ. 83 వేల కోట్లకు పైమాట. కానీ ఇప్పుడు మసాల దినుసలపై వెల్లువెత్తున్న ఆరోపణలతో భారత్ మసాలా మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. భారతదేశ మసాలా ఎగుమతులు దాదాపు 40 శాతం క్షీణించవచ్చని భారత సుగంధ ద్రవ్యాల వాటాదారుల సమాఖ్య (FISS) తెలిపింది. అదే సమయంలో ఈ ప్రఖ్యాత మసాల దినుసులు ఎంత వరకు సేఫ్ అన్న అంశంపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. -
నవరత్నాల జెండాను హిమాలయాలపై ఎగురవేసిన యువకుడు
-
ఎవరెస్ట్ శిరసొంచిన వేళ..
ఒంగోలు కల్చరల్: ‘లే..గమ్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించవద్దు’ స్వామి వివేకానంద మహితోక్తులు ఒంగోలుకు చెందిన డిగ్రీ విద్యార్థి షేక్ హిమాంషాపై విశేష ప్రభావం చూపాయి. ఎవరికీ అందకుండా ఠీవిగా నిలబడి అంబర చుంబనం చేస్తున్న మౌంట్ ఎవరెస్ట్ మెడలు వంచాలనే ఆలోచన ఆ నవ యువకునిలో ఉదయించింది. అందుకు ప్రభుత్వ చేయూత, జిల్లా స్టెప్ అధికారుల ప్రోత్సాహం తోడైంది. అనేక వడపోతల తరువాత 40మందినుండి ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు కేవలం అయిదుగురిని ఎంపికచేసారు. కొన్ని నెలల కఠోర శిక్షణ తరువాత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అర్ధరాత్రి ప్రపంచం గాఢ నిద్రలో జోగుతున్న వేళ హిమాంషా కన్ను పొడుచుకున్నా కానరాని నిశీధిలో జాతీయ పతాకాన్ని ఎవరెస్ట్ శిఖరంపై ఎగురవేసి భారతావని పులకించేలా, గర్వించేలా చేశాడు. దారిపొడుగునా భయపెట్టే శవాలను, అకస్మాత్తుగా సంభవించే వాతావరణ మార్పులను పట్టించుకోకుండా లక్ష్యం వైపే పురోగమించి ఆత్మ విశ్వాసంలో యువతకు ఆదర్శంగా నిలిచాడు. కరాటేతోపాటు ఇతర ఆటల్లోనూ హిమాంషాకు ఆసక్తి ఉంది. పలు అవార్డులు కూడా సాధించి తన సత్తా చాటాడు. ఒంగోలు బిడ్డ.. మస్తాన్, మస్తాన్‌బీ దంపతుల రెండో కుమారుడు హిమాంషా. మస్తాన్ తొలుత ఒంగోలుకు సమీపంలోని ఉలిచిలో నివాసం ఉంటూ బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. మరింత మేలైన ఉపాధి కోసం ఆయన తన కుటుంబంతో 1991లో ఒంగోలుకు చేరుకున్నారు. హిమాంషా 10వ తరగతి దామోదర స్కూల్లో, ఇంటర్ ఉమామహేశ్వర కళాశాలలో, స్థానిక శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదివాడు. కరాటేలో ప్రావీణ్యం చదువుతోపాటు కరాటే, కుంగ్ ఫూపై కూడా హిమాంషా దృష్టి సారించాడు. కుబియా నాయక్ వద్ద కరాటేలో శిక్షణ పొందాడు. కరాటేలో 2012లో జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించాడు. కుంగ్ ఫూలో జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2016లో ఎన్సీసీ ‘సి’ సర్టిఫికెట్ సాధించాడు. దానితోపాటు కబడ్డీ టీం కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. క్రీడాంశాలతోపాటు మనసును కదిలించే సంగీతమన్నా హిమాంషాకు మక్కువ ఎక్కువ. స్టెప్ ప్రకటనే ప్రేరేపణ ఎవరెస్ట్ శిఖరం అధిరోహణకు యువత దరఖాస్తు చేసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వ విభాగమైన స్టెప్ 2017 నవంబర్ నెలలో హిందూ దినపత్రికలో ఇచ్చిన ప్రకటన హిమాంషాను ఆకర్షించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలాగైనా అధిరోహించి తీరాలనే ఆశయంతో మాంషా దరఖాస్తు చేశాడు. రన్నింగ్, జంపింగ్, హైజంప్, లాంగ్‌జంప్ తదితర అంశాల్లో ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీల్లో ఎన్నికయ్యాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా హిమాంషా ఎంపికయ్యాడు. మొత్తం 40 మందిని అధికారులు ఎంపిక చేయగా హిమాంషా వారిలో ఒకడు. సిక్కిం, డార్జిలింగ్‌లో శిక్షణ ఇచ్చారు. శిక్షణానంతరం 40 మంది బృందంలో 20 మందికి అవకాశం కల్పించారు. ఈ ఏడాది జనవరిలో పహల్గాంలోని జవహర్లాల్ నెహ్రూ పర్వతారోహణ శిక్షణ సంస్థలో మరిన్ని మెళకువలు నేర్పించారు. శారీరక, మానసిక దారుఢ్యాన్ని ఎలా పెంచుకోవాలో, పర్వతారోహణ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలో హిమాంషా శిక్షణ పొందాడు. కఠోర శిక్షణ అనంతరం కేవలం 10మంది రంగంలో మిగిలగా వారికి ఫిబ్రవరి–మార్చి నెలలో లడఖ్‌లో 15 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. చివరకు 40 మంది బృందంలో హిమాంషాతోపాటు మరో నలుగురు మాత్రమే ఎవరెస్ట్ ఎక్కేందుకు తుది జాబితాలో స్థానం సాధించారు. ఏప్రిల్ 22న బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. చైనా వైపు నుంచి.. ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు చైనా వైపు మార్గాన్ని హిమాంషా బృందం ఎంచుకుంది. క్యాంప్ 1లో 6400 మీటర్లు, క్యాంప్ 2లో 7,900 మీటర్లు, క్యాంప్ 3లో 8,300 మీటర్ల ఎత్తుకు హిమాంషా చేరుకున్నాడు. దారిపొడవునా 22కు పైగా పర్వతారోహకుల మృతదేహాలు కనిపించినా హిమాంషా భయపడలేదు. ఫలించిన కల అంచెలంచెలుగా ఎవరెస్ట్‌ను అధిరోహించిన హిమాంషా మే 16వ తేదీ రాత్రి 1.55 నిమిషాలకు తన బృందంలోని వారి కన్నా కొన్ని గంటల ముందుగా 8848 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని చేరుకుని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. 2018 ఎవరెస్ట్ శిఖరారోహణ సీజన్లో ఆ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడుగా కూడా హిమాంషా రికార్డు సృష్టించాడు. ప్రకాశం జిల్లాలో ఈ ఖ్యాతిని సాధించిన తొలి వ్యక్తి కూడా హిమాంషానే. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విషయాన్ని చైనా ప్రభుత్వం ధ్రువీకరించి సర్టిఫికెట్ అందజేసింది. అధికారుల అభినందనలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన హిమాంషాను యూత్ సర్వీసెస్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం, కోమలి కిషోర్, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్, రాష్ట్ర అటవీ శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు, ఎంఎల్‌సి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీ హర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, ప్రిన్సిపాల్ ఆంజనేయులు, పలు సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు అభినందించారు. ఒంగోలులో హిమాంషా అభినందన ర్యాలీ కూడా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హిమాంషాను సన్మానించారు. ఆత్మవిశ్వాసం ముఖ్యం యువతకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఒకరిని గుడ్డిగా అనుసరించడం కాకుండా తాము దేనికి సరిపోతామో యువత నిర్ణయించుకోవాలి. అదే సమయంలో ప్రోత్సాహం కూడా అవసరం. యువతకు సరైన దిశలో ప్రోత్సహిస్తే వారు చాలా అద్భుతాలు సాధించి చూపగలరు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అతి ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనేది నా ఆశయం. అలాగే ఆర్మీలో పారా కమాండర్‌గా ఉద్యోగం చేయాలనేది ఆశయం. నేను ఇప్పటి వరకు సాధించినదేమైనా ఉంటే దానికి నా తల్లిదండ్రులైన మస్తాన్, మస్తాన్‌బీ, సోదరుడు అంజావలి, వదిన అనూష కారణం. వారు ప్రతి విషయంలో నన్ను వెన్నుతట్టి ఫ్రోత్సహించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. – హిమాంషా -
ఎవరెస్ట్ విజేతకు ఊరు జేజేలు
lదుర్గారావుకు స్వగ్రామంలో ఘనస్వాగతం lసన్మానించిన భద్రాచలం ఎమ్మెల్యే రాజయ్య వీఆర్‌పురం (రంపచోడవరం) : ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రెండో పర్వతారోహకుడు కుంజా దుర్గారావు శుక్రవారం సాయంత్రం స్వగ్రామం కుంజవారిగూడెం చేరుకోగా గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు. దుర్గారావు గత నెల 13న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. పలువురు దుర్గారావును కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అతడిని ఘనంగా సన్మానించారు. పేద గిరిజన కుటుంబంలో జన్మించిన దుర్గారావు అతి చిన్న వయసులో అత్యంత క్లిష్టమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి వీఆర్‌పురం మండలానికి దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చాడని కొనియాడారు. దుర్గారావుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు వెంటనే చెల్లించాలని, అతడి కుటుంబానికి పక్కా ఇంటిని నిర్మించి ఇవ్వాలని, దుర్గారావు ఉన్నత చదువులకు అవసరం అయ్యే ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించాలని కోరారు. ఎంపీపీ కారం శిరమయ్య, సీపీఎం మండల కార్యదర్శి పూనెం సత్యనారాయణ,బొప్పెన కిరణ్ పాల్గొన్నారు. అందరి ఆశీస్సుల ఫలితమే .. తల్లిదండ్రులు, గురుకుల సొసైటీ అధికారుల ఆశీస్సులతో పాటు కోచ్ భద్రయ్య కృషి ఫలితంగానే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలిగానని దుర్గారావు అన్నాడు. గత ఏప్రిల్ 8న ప్రారంభమైన ఎవరెస్ట్ పర్వతారోహణ మే 13న ముగిసిందని తెలిపాడు. ఆరోజు ఉదయం ఆరు గంటలకు ఎవరెస్ట్‌పై జాతీయ జెండా, గురుకుల జెండాలు ఎగురవేయడంతో పాటు ,అంబేడ్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించానని తెలిపాడు. తన విజయానికి కారకులందరికీ రుణపడి ఉంటానన్నాడు. -
రికార్డు సృష్టించిన తెలంగాణ మహిళా ఏఎస్పీ
హైదరాబాద్: ఆదిలాబాద్ అదనపు ఏఎస్పీగా పనిచేస్తున్న రాధిక ఎవరెస్టు శిఖరం అధిరోహించి రికార్డు సృష్టించారు. దక్షిణ భారత దేశం నుంచి ఎవరెస్టు అధిరోహించిన మొదటి పోలీస్ అధికారిణిగా ఈమె రికార్డు నెలకొల్పారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన రాధిక ఏడాది నుంచి ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 5న రాష్ట్రం నుంచి బయలుదేరిన ఈమె శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఆరుగురు సభ్యుల బృందంలో ఈమె ఒక్కరే మహిళ. రాధిక ఇంతకుముందు 7,077 మీటర్ల ఎత్తై కూన్ పర్వతాన్ని కూడా అధిరోహించి.. ఈ పర్వతశిఖరాన్ని తాకిన ప్రపంచంలో రెండో మహిళగా రికార్డు నెలకొల్పారు. ఏపీపీఎస్సీ ద్వారా 2001లో లెక్చరర్ పోస్టు సాధించిన రాధిక 2007లో డీఎస్పీగా ఎంపికయ్యారు. మొదట గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా పనిచేశారు. -
పోలవరంపై తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం
-
పోలవరంపై తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం
హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. పోలవరంపై ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ తీర్మానం పెట్టారు. ముంపు గ్రామాల బదిలీపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టం తేవాలని తీర్మానంలో పేర్కొన్నారు. పోలవరంపై తీర్మానానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. అలాగే హిమాలయాలను అధిరోహించిన తెలుగు విద్యార్థులను అభినందిస్తూ చంద్రబాబు సభలో మరో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సభ అభినందలు తెలిపింది. ఎవరెస్ట్ అవరోహించిన విద్యార్ధుల స్పూర్తి అందరికి ఆదర్శం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. Follow @sakshinews