
పోలవరంపై తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం
పోలవరం ప్రాజెక్ట్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్ట్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. పోలవరంపై ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ తీర్మానం పెట్టారు. ముంపు గ్రామాల బదిలీపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టం తేవాలని తీర్మానంలో పేర్కొన్నారు. పోలవరంపై తీర్మానానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. అలాగే హిమాలయాలను అధిరోహించిన తెలుగు విద్యార్థులను అభినందిస్తూ చంద్రబాబు సభలో మరో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సభ అభినందలు తెలిపింది. ఎవరెస్ట్ అవరోహించిన విద్యార్ధుల స్పూర్తి అందరికి ఆదర్శం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
Follow @sakshinews