రికార్డు సృష్టించిన తెలంగాణ మహిళా ఏఎస్పీ
హైదరాబాద్: ఆదిలాబాద్ అదనపు ఏఎస్పీగా పనిచేస్తున్న రాధిక ఎవరెస్టు శిఖరం అధిరోహించి రికార్డు సృష్టించారు. దక్షిణ భారత దేశం నుంచి ఎవరెస్టు అధిరోహించిన మొదటి పోలీస్ అధికారిణిగా ఈమె రికార్డు నెలకొల్పారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన రాధిక ఏడాది నుంచి ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు.
ఏప్రిల్ 5న రాష్ట్రం నుంచి బయలుదేరిన ఈమె శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఆరుగురు సభ్యుల బృందంలో ఈమె ఒక్కరే మహిళ. రాధిక ఇంతకుముందు 7,077 మీటర్ల ఎత్తై కూన్ పర్వతాన్ని కూడా అధిరోహించి.. ఈ పర్వతశిఖరాన్ని తాకిన ప్రపంచంలో రెండో మహిళగా రికార్డు నెలకొల్పారు. ఏపీపీఎస్సీ ద్వారా 2001లో లెక్చరర్ పోస్టు సాధించిన రాధిక 2007లో డీఎస్పీగా ఎంపికయ్యారు. మొదట గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా పనిచేశారు.