asp radhika
-
అకాంకాగ్వా పర్వతాన్ని అధిరోహించిన ఏఎస్పీ
చిత్తూరు రూరల్: చిత్తూరు జిల్లా ఏఎస్పీ రాధిక దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ అకాంకాగ్వాను విజయవంతంగా అధిరోహించారు. ఈ పర్వతం అర్జెంటీనాలో ఉంది. దీని ఎత్తు 6,962 మీటర్లు. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢత్వం అవసరం. గతంలో ఈమె అనేక పర్వతాలను అధిరోహించి పోలీసు శాఖ కీర్తి ప్రతిష్టలను పెంచారు. ఈమె జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబులతో పాటు పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు అందుకున్నారు. ఏఎస్పీ అక్కడి నుంచి స్వదేశానికి ఈ నెల 6వ తేదిన తిరిగిరానున్నారు. -
ఎస్ఐ శ్రీధర్ది ఆత్మహత్యే: ఏఎస్పీ
ఆదిలాబాద్: కెరమెరిలో సబ్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ పొందిన ఎస్ఐ శ్రీధర్ది ఆత్మహత్యే' అని ఏఎస్పీ రాధిక వెల్లడించారు. మంగళవారం ఆమె ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఒత్తిడికి లోనై శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లభ్యమైందని చెప్పారు. ఇదిలా ఉండగా, తమ తమ్ముడి మృతికి అధికారుల వేధింపులే కారణమని ఎస్ఐ శ్రీధర్ అన్న శ్రీకాంత్ ఆరోపించారు. కాగా, పోలీస్ క్వార్టర్స్ రివాల్వర్ మిస్ ఫైర్ అయి ఎస్ఐ శ్రీధర్ మంగళవారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ( చదవండి: రివాల్వర్ మిస్ ఫైర్ : ఎస్ఐ మృతి) కెరమెరి పోలీస్ స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీధర్ రివాల్వర్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కెరమెరిలో చోటుచేసుకుంది. పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్న ఎస్ఐ శ్రీధర్.. తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తున్న క్రమంలో గన్ మిస్ ఫైర్ రెండు బుల్లెట్లు తలలో దూసుకెళ్లాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎస్ఐ మృతిచెందారు. -
ఏఎస్పీ రాధికకు సన్మానం
ఆదిలాబాద్ : ఇటీవల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆదిలాబాద్ ఏఎస్పీ జీఆర్ రాధికను రాష్ట్ర పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు గోపినాథ్‌రెడ్డి సన్మానించారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పోలీసు అసోసియేషన్ అధ్యక్షులు అశోక్, సురేందర్, బొర్లకుంట పోచలింగంలతో కలిసి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఏఎస్పీ జీఆర్ రాధికను కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఏఎస్పీ రాధిక ఎవరెస్టు శిఖరం అధిరోహించడంతో తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖకు ఆమె ఆణిముత్యమని కొనియాడారు. యావత్ తెలంగాణ పోలీసులు దీనిని గర్వంగా భావిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఉట్నూర్ డీఎస్పీ ఎస్.మల్లారెడ్డి, పోలీసు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మీర్ విరాసత్‌అలీ పాల్గొన్నారు. -
రికార్డు సృష్టించిన తెలంగాణ మహిళా ఏఎస్పీ
హైదరాబాద్: ఆదిలాబాద్ అదనపు ఏఎస్పీగా పనిచేస్తున్న రాధిక ఎవరెస్టు శిఖరం అధిరోహించి రికార్డు సృష్టించారు. దక్షిణ భారత దేశం నుంచి ఎవరెస్టు అధిరోహించిన మొదటి పోలీస్ అధికారిణిగా ఈమె రికార్డు నెలకొల్పారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన రాధిక ఏడాది నుంచి ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 5న రాష్ట్రం నుంచి బయలుదేరిన ఈమె శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఆరుగురు సభ్యుల బృందంలో ఈమె ఒక్కరే మహిళ. రాధిక ఇంతకుముందు 7,077 మీటర్ల ఎత్తై కూన్ పర్వతాన్ని కూడా అధిరోహించి.. ఈ పర్వతశిఖరాన్ని తాకిన ప్రపంచంలో రెండో మహిళగా రికార్డు నెలకొల్పారు. ఏపీపీఎస్సీ ద్వారా 2001లో లెక్చరర్ పోస్టు సాధించిన రాధిక 2007లో డీఎస్పీగా ఎంపికయ్యారు. మొదట గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా పనిచేశారు.