ఎస్ఐ శ్రీధర్ది ఆత్మహత్యే: ఏఎస్పీ | SI sridhar committs suicide, reveals ASP radhika | Sakshi
Sakshi News home page

ఎస్ఐ శ్రీధర్ది ఆత్మహత్యే: ఏఎస్పీ

Published Tue, Aug 30 2016 6:41 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

ఎస్ఐ శ్రీధర్ది ఆత్మహత్యే: ఏఎస్పీ - Sakshi

ఎస్ఐ శ్రీధర్ది ఆత్మహత్యే: ఏఎస్పీ

ఆదిలాబాద్: కెరమెరిలో సబ్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ పొందిన ఎస్ఐ శ్రీధర్ది ఆత్మహత్యే' అని ఏఎస్పీ రాధిక వెల్లడించారు. మంగళవారం ఆమె ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఒత్తిడికి లోనై శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లభ్యమైందని చెప్పారు. ఇదిలా ఉండగా, తమ తమ్ముడి మృతికి అధికారుల వేధింపులే కారణమని ఎస్ఐ శ్రీధర్ అన్న శ్రీకాంత్ ఆరోపించారు. కాగా, పోలీస్ క్వార్టర్స్‌ రివాల్వర్ మిస్ ఫైర్ అయి ఎస్ఐ శ్రీధర్ మంగళవారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే.
( చదవండి: రివాల్వర్ మిస్ ఫైర్ : ఎస్ఐ మృతి)

కెరమెరి పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ రివాల్వర్‌ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కెరమెరిలో చోటుచేసుకుంది. పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్న ఎస్ఐ శ్రీధర్.. తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తున్న క్రమంలో గన్ మిస్ ఫైర్ రెండు బుల్లెట్లు తలలో దూసుకెళ్లాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎస్‌ఐ మృతిచెందారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement