revolver misfire
-
తుపాకీ పేలి.. గోవిందా కాలికి గాయం
ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందా(60) కాలికి బుల్లెట్ గాయమైంది. ముంబైలోని జుహూ ప్రాంతంలోని ఆయన నివాసంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతుండగా ఉదయం 4.45 గంటల సమయంలో చేతిలో ఉన్న లైసెన్సుడ్ రివాల్వర్ అనుకోకుండా పేలిందని పోలీసులు తెలిపారు. ‘వైద్యులు గోవిందా కాలిలోని బుల్లెట్‌ను తొలగించారు. ఎడమ మోకాలి దిగువన 8–10 కుట్లు పడ్డాయి. ఆయన కోలుకుంటున్నారు’అని పోలీసులు తెలిపారు.ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టామన్నారు. ‘అభిమానులు, తల్లిదండ్రులు, ఆ దేవుని ఆశీర్వాదంతో గాయం నుంచి కోలుకుంటున్నాను. నాకు తగిలిన బుల్లెట్‌ను వైద్యులు తొలగించారు’అంటూ గోవిందా ఒక ఆడియో సందేశం విడుదల చేశారు.మంగళవారం కోల్‌కతాలో జరిగే ఓ షోలో గోవిందా పాల్గొనాల్సి ఉందని ఆయన మేనేజర్ శశి సిన్హా తెలిపారు. రివాల్వర్‌ను కప్‌బోర్డులో ఉంచే సమయంలో పొరపాటున ట్రిగ్గర్‌పై వేలు పడి, పేలి కాలికి తగిలిందని సిన్హా వివరించారు. రివాల్వర్‌ను చెక్ చేస్తుండగా చేతుల్లో జారి అనుకోకుండా పేలిందని గోవిందా సోదరుడు కృతి కుమార్ చెప్పారు. -
ఎస్ఐ శ్రీధర్ది ఆత్మహత్యే: ఏఎస్పీ
ఆదిలాబాద్: కెరమెరిలో సబ్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ పొందిన ఎస్ఐ శ్రీధర్ది ఆత్మహత్యే' అని ఏఎస్పీ రాధిక వెల్లడించారు. మంగళవారం ఆమె ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఒత్తిడికి లోనై శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లభ్యమైందని చెప్పారు. ఇదిలా ఉండగా, తమ తమ్ముడి మృతికి అధికారుల వేధింపులే కారణమని ఎస్ఐ శ్రీధర్ అన్న శ్రీకాంత్ ఆరోపించారు. కాగా, పోలీస్ క్వార్టర్స్ రివాల్వర్ మిస్ ఫైర్ అయి ఎస్ఐ శ్రీధర్ మంగళవారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ( చదవండి: రివాల్వర్ మిస్ ఫైర్ : ఎస్ఐ మృతి) కెరమెరి పోలీస్ స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీధర్ రివాల్వర్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కెరమెరిలో చోటుచేసుకుంది. పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్న ఎస్ఐ శ్రీధర్.. తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తున్న క్రమంలో గన్ మిస్ ఫైర్ రెండు బుల్లెట్లు తలలో దూసుకెళ్లాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎస్ఐ మృతిచెందారు. -
మిస్‌ఫైర్‌పై కొనసాగుతున్న విచారణ
నిర్మల్ అర్బన్/ నిర్మల్ రూరల్ : పట్టణంలోని మయూరి ఇన్‌లాడ్జ్‌లో ఆదివారం రాత్రి జరిగిన రివాల్వర్ మిస్‌ఫైర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి రాయికల్ ఎస్సై రాములునాయక్‌ను మంగళవారం స్థానిక పోలీసులు విచారించినట్లు సమాచారం. సోమవారం ఎస్పీ గజరావు భూపాల్‌తోపాటు డీఎస్పీ మాధవరెడ్డి, రూరల్ సీఐ రఘు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాడ్జిలోని 212 గదిని పరిశీలించారు. అక్కడ పనిచేసే సిబ్బందిని వివరాలడిగి తెలుసుకున్నారు. సోమవారం సేకరించిన ఆధారాల ప్రకారం మంగళవారం విచారణ కొనసాగించారు. అప్పటికే రాములునాయక్‌పై సెక్షన్ 286, 337 కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. దీనిపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కూడా చేపడుతున్నట్లు తెలుస్తోంది. సదరు ఎస్సై విచారణలో దోషిగా తేలితే చట్టపరమైన చర్యలతోపాటు శాఖ పరమైన చర్యలు తప్పవని డీఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం...! కరీంనగర్ జిల్లా రాయికల్ ఎస్సై రాములునాయక్ జిల్లా దాటి నిర్మల్‌కు రావడం, కుంటాల జలపాతంలో విందు చేసుకోవడం.. పైగా దీనికి అధికారికంగా సెలవు తీసుకోకుండా రావడం ఆయన విధినిర్వహణపై ఉన్న బాధ్యతను తెలియజేస్తోంది. ఆది నుంచి దూకుడు స్వభావంతో పనిచేసే ఎస్సైగా రాములునాయక్‌కు పేరుందని సమాచారం. విధి నిర్వహణలో భాగంగా అత్యవసర సమయంలో ఉపయోగించే సర్వీస్ రివాల్వర్ రెండు రౌండ్లు పేల్చడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగా అయితే రివాల్వర్ నుంచి ఒక్క తూటా బయటపడిన అనంతరం అప్రమత్తమై మరోరౌండ్ తూటా పేలకుండా చర్యలు తీసుకోవచ్చు. కానీ వెనువెంటనే తుపాకీ నుంచి రెండు బుల్లెట్లు రావడం పలు సందేహాలకు తావిస్తోంది. సెటిల్మెంట్ కోసమేనా..? రాయికల్ ఎస్సై అసలు నిర్మల్‌కు ఎందుకు వచ్చినట్లు..? కరీంనగర్ జిల్లా ఎంఈవోలతో కలిసి కుం టాల జలపాతానికి వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణం లో నిర్మల్‌లో ఎందుకు ఆగారు..? ఆయనకు నిర్మల్ డివిజన్లోని ఎంపీడీవోలు, ఈవోపీర్డీలు లాడ్జీలో విం దు ఎందుకు ఏర్పాటుచేశారు..? వీరి కలయిక వెనక సెటిల్మెంట్ వ్యవహారం ఏమైనా దాగి ఉందా..! అ నేది పట్టణంలో చర్చనీయాంశమైంది. నిర్మల్ డివి జన్‌లోని ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు కొందరు ఎ న్నికల కంటే ముందు కరీంనగర్ జిల్లాలో పనిచేయడంతో ఎస్సైతో సాన్నిహిత్యం ఏర్పడి ఉండవచ్చనే అనుమానం కలుగుతోంది. ఆ బంధం ఏమైనా ఆర్థిక సంబంధాలకు ఊతమిచ్చిందా..? అయితే.. ఒకే గదిలో ఉద్యోగులతో కలిసి విందు చేసుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఎస్సై రివాల్వర్ పేలడం ప్రమాదవశాత్తు జరిగింది కాదేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేటు పడే అవకాశం? : ఎస్సై రివాల్వర్ తూటాలు ఉపయోగిస్తే ఎందుకు, ఎప్పుడు వినియోగించారన్న పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి లెక్కచెప్పాల్సి ఉంటుంది. దీనిపై ఆయన ప్రభుత్వానికి ఏ విధమైన లెక్కచూపిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ఎస్సైపై వేటువేసేందుకే ఉన్నతాధికారులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
పోలీస్ (మిస్) ఫైర్..!
ఎస్సై చేతిలోని రివాల్వర్ మిస్‌ఫైర్ అయింది. పట్టణంలోని లాడ్జిలో స్నేహితులతో కలిసి విందు చేసుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో లాడ్జిలో పనిచేస్తున్న సర్వర్‌బాయ్ కాలికి స్వల్ప గాయమైంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. చర్యలు తీసుకుంటాం.. - ఎస్పీ పట్టణంలోని మయూరి ఇన్ లాడ్జిలో జరిగిన రివాల్వర్ మిస్‌ఫైర్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గజరావు భూపాల్ పేర్కొన్నారు. ఎస్పీ సోమవారం రాత్రి నిర్మల్‌లోని మయూరి ఇన్ లాడ్జిలో సంఘటన జరిగిన గదిని పరిశీలించారు. అనంతరం ఆయన డీఎస్పీ మాధవరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. లా డ్జిలో రెండు రౌండ్ల కాల్పులు జరిగిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలుతీసుకుంటామని పేర్కొన్నారు. నిర్మల్ అర్బన్ : కరీంనగర్ జిల్లా రా యికల్ ఎస్సై రాములు నాయక్ ఆది వారం నిర్మల్‌కు వచ్చారు. అనంతరం తన స్నేహితులైన నిర్మల్ డివిజన్‌కు చెందిన కొందరు ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఎంఈవోలతో కలిసి కుంటాల జలపాతానికి విహార యాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. అక్కడి నుంచి రాత్రి నిర్మల్‌లోని మ యూరి ఇన్ లాడ్జి లో 212 నంబర్ గదిలో దిగా రు.రాత్రి స్నేహి తులతో కలిసి విం దు చేసుకున్నారు. సుమారు 11గంటల సమయంలో రివాల్వర్ కిందపడి పేలింది. ఈ ఘటనలో మద్యం సీసాలు పగిలినట్లు సమాచారం. అదే సమయంలో గదిలోకి సర్వర్ బాయ్ బాలు వచ్చాడని, బుల్లెట్‌తో దెబ్బతిన్న గచ్చు బాలు కాలికి గుచ్చుకొని స్వల్ప గాయమైందని పోలీసులు తెలిపారు. కాగా, రాయికల్ ఎస్సైరాములు నాయక్ ఉన్న గది.. నిర్మల్ డివిజన్లోని ఓ మండల ఎంపీడీవో పేరిట బుక్ చేసినట్లు లాడ్జి రికార్డుల్లో ఉంది. ఆదివారం మధ్యాహ్నమే ఈ గది బుకింగ్ చేసినట్లు రికార్డుల ఆధారంగా తెలుస్తోంది. పోలీసుల విచారణ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. సోమవారం సాయంత్రం డీ ఎస్పీ మాధవ్‌రెడ్డి లాడ్జిలోని 212 గదిలోకి వెళ్లారు. బుల్లెట్‌తో దెబ్బతిన్న నేల, గదిని పరిశీలించారు. లాడ్జి నిర్వాహకులు, అక్కడ పనిచేసే సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఎస్సై రివాల్వర్ కిందపడడంతోనే మిస్‌ఫైర్ అయి ఉంటుం దని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ రఘు, పట్టణ ఎస్సై రాంనర్సింహారెడ్డి ఉన్నారు. ఘటనపై అనుమానాలు.. గదిలో ఉన్న ఇద్దరి మధ్య గొడవ జరగడంతోనే ఫైర్ జరిగి ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా రు. గదిలో సుమారు ఐదుగురు ఉన్న ట్లు సమాచారం. అంతేకాకుండా సర్వ ర్ బాయ్‌పై ఆగ్రహంతో ఫైర్ చేసి ఉం టారనే అనుమానాలూ వినిపిస్తున్నా యి. అయితే ఎందుకు ఎస్సై రివాల్వర్ నుంచి రెండు బుల్లెట్లు బయటకు వ చ్చాయనే సంగతి ఇంకా తేలాల్సి ఉంది. -
రివాల్వర్ మిస్‌ఫైర్.. ఎస్ఐ మృతి
నిన్న కాక మొన్న విజయవాడలో రివాల్వర్ మిస్‌ఫైర్ అయ్యి ఓ వ్యక్తి గాయపడితే, తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ ఎస్ఐ దగ్గరున్న రివాల్వర్ పొరపాటున పేలి, ఆయన ప్రాణాలనే బలిగొంది. కాంకేర్ జిల్లా భానుప్రతాప్ప గ్రామం వద్ద ఓ బస్సులో ప్రయానిస్తున్న ఎస్ఐ వద్ద ఉన్న రివాల్వర్ పొరపాటున మిస్‌ఫైర్ అయ్యింది. ఆ బుల్లెట్ నేరుగా ఆయనకే తగలడంతో అక్కడికక్కడే ఆ ఎస్ఐ మరణించారు. సాధారణంగా రివాల్వర్‌కు ఉండే లీవర్ రిలీజ్ చేస్తేనే అది పేలుతుంది. ఎప్పుడూ దాన్ని లాక్ పొజిషన్లోనే ఉంచుతారు. బుల్లెట్లు లోడ్ చేసే సమయంలో గానీ, మరేదైనా సందర్భంలో గానీ పొరపాటున ట్రిగ్గర్ ఒత్తుకుంటే.. రివాల్వర్ పేలుతుంది. గురువారం కూడా సరిగ్గా అలాగే జరిగి, ఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు. -
పెరిగిపోతున్న గన్ కల్చర్
రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఒకప్పుడు కేవలం బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఇది కనిపించేది. తర్వాత సినిమాల ప్రభావంతో అన్ని ప్రాంతాలకూ ఇది విస్తరించింది. తుపాకులు సులభంగా ఎక్కడ దొరుకుతాయంటే బీహార్ అని అందరూ చెబుతున్నారు. ఇది ఎంతెలా పాకిందంటే.. చివరకు ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా చేస్తున్న యువకుడు కూడా బీహార్ వరకు వెళ్లి రివాల్వర్ కొనుక్కొచ్చి.. ప్రియురాలి భర్తను చంపడానికి ప్రయత్నించారు!! ఇంతకుముందు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రివాల్వర్లు పేలడం, తుపాకులు గర్జించడం లాంటి సంఘటనలు జరిగాయి. కొల్లేరు ప్రాంతంలో కొంతమంది వేటగాళ్లు పక్షులను వేటాడేందుకు ఉపయోగించే నాటు తుపాకులు కూడా చివరకు బీహార్ నుంచి వచ్చినవేనని చెబుతారు. ఈమధ్య విడుదలైన 'రాంలీలా' చిత్రంలో సైతం విచ్చలవిడిగా ఆయుధాల వాడకాన్ని చూపించారు. మనదేశంలో ప్రధానంగా రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే తుపాకులు విచ్చలవిడిగా అమ్ముతుంటారు. వాటిని ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలవాళ్లు కొంటున్నారు. ఎన్నికల సీజన్ దగ్గర పడటంతో తుపాకులు, రివాల్వర్లు, పిస్టళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా, వారి నిఘా కేవలం లైసెన్సు ఉన్న ఆయుధాలకే పరిమితం అవుతోంది. ఆయుధ లైసెన్సులు ఉన్నవాళ్లు తమ ఆయుధాలను స్టేషన్లలో డిపాజిట్ చేయాలని పోలీసులు ఆదేశించడం, వాళ్లు కొన్నాళ్ల పాటు సరెండర్ చేయడం మామూలే. అయితే.. ఒక్క లైసెన్సుడు రివాల్వర్ ఉంటే, దాంతోపాటు కనీసం అరడజను లైసెన్సు లేని రివాల్వర్లు ఉంటున్నాయన్నది ఒక అంచనా. ఫ్యాక్షన్ ప్రాంతాల్లో అయితే ఇక తుపాకులు, బాంబు పేలుళ్ల గురించి చెప్పనక్కర్లేదు. సినిమాల ప్రభావం, సులభంగా అందుబాటు, సంఘటన జరిగేవరకు ఎవరికీ దొరక్కుండా దాచిపెట్టే సౌలభ్యం.. ఇలాంటి కారణాల వల్లే చిన్న సైజులో ఉండే రివాల్వర్ల పట్ల ఎక్కువ మంది మోజుపడుతున్నారు. రాష్ట్రంలో కూడా నేరాలు పెచ్చుమీరడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. -
భగ్న ప్రేమికుడి కుట్ర భగ్నం
అతనో భగ్న ప్రేమికుడు. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ కుదరలేదు. ఆమె భర్తను చంపేద్దామని ప్రయత్నిస్తూ.. అనుకోకుండా జరిగిన మిస్‌ఫైర్ సంఘటనలో పోలీసులకు దొరికిపోయాడు. అతనే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆంజనేయస్వామి ఆలయ పూజారి రవి దత్తు. పోలీసులు విచారించినప్పుడు మొత్తం విషయమంతా అతడు బయటపెట్టాడు. తొలుత బంధువుల అమ్మాయిని ఇష్టపడిన రవి, తన అన్నకు పెళ్లి కాకపోవడంతో తాను పెళ్లి చేసుకోలేకపోయాడు. ఇంతలోనే ఆమెకు 2008 సంవత్సరంలో పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా అతడికి ఆశ చావలేదు. ఆమె భర్తను చంపేస్తే.. తర్వాత పెళ్లి చేసుకోవచ్చని భావించాడు. అప్పటినుంచి ఆమె భర్తను హతమార్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. తరచు ఏదో పని ఉన్నట్లుగా ఒంగోలు వెళ్లడం, అక్కడ ఆమె భర్తతో మాట్లాడి రావడం చేసేవాడు. టీవీ ఛానళ్లలో వచ్చే క్రైం సీరియళ్లు చూసే రవిదత్తు, తాను ప్రేమించిన మహిళ భర్తను ఒకసారి పీకకు తాడు బిగించి చంపుదామనుకున్నాడు, మరికొన్ని సార్లు కాలవలో తోసేసి, లారీకింద తోసేసి చంపుదామనుకున్నాడు. ఈ అన్ని ప్రయత్నాలకూ తన వెంట రమేష్, అనిల్ అనే ఇద్దరు ఆటోడ్రైవర్లను కూడా తీసుకెళ్లేవాడు. కానీ అతడి ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో మూడు నెలల క్రితం బీహార్ వెళ్లి.. అక్కడ ఓ రివాల్వర్ కొన్నాడు. సోమవారం ఒంగోలు వెళ్లి, అక్కడినుంచి తిరిగి తెల్లవారు జామున 2-3 గంటల సమయంలో విజయవాడ వచ్చాడు. సంప్రదాయం ప్రకారమే లుంగీ కట్టుకునే రవిదత్తు, తన బొడ్డులో రివాల్వర్ దోపుకొనేవాడు. మంగళవారం తెల్లవారుజామున విజయవాడ బస్టాండుకు వచ్చినప్పుడు కూడా రివాల్వర్ అలాగే ఉంది. అయితే, బాత్రూంకు వెళ్లినప్పుడు లోపల అనుకోకుండా రివాల్వర్ పేలింది. దాంతో బాత్రూం తలుపు గుండా బయటకు వచ్చిన బుల్లెట్.. బయట ఉన్న వ్యాపారి వెంకటరమణ కాలికి తగిలింది. పెద్ద శబ్దం రావడంతో తాను ఏంటో అనుకున్నానని, చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా ప్యాంటు నుంచి రక్తం వస్తోందని చెప్పడంతో చూసుకున్నానని వెంకటరమణ ఆస్పత్రిలో విలేకరులకు చెప్పాడు. వాస్తవానికి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా వెంకటరమణనే అనుమానించారు. రవిదత్తు బయటకు వచ్చి ఏమీ తెలియనట్లుగా ఏం జరిగిందని అడిగాడు. అయితే బస్టాండులో ఉన్న పోలీసులు వెంటనే గేట్లు మూసేసి తనిఖీ చేయడంతో పూజారి బొడ్డులో ఉన్న రివాల్వర్ బయటపడింది. మొత్తం విషయం బయటకొచ్చింది. -
'ప్రియురాలి భర్తను చంపాలని స్కెచ్ వేశాడు'
ప్రియురాలి భర్తను హతమార్చేందుకు ఓ పూజారి క్రిమినల్‌గా మారాడు. ఎలాగైనా తన ప్రియురాలిని దక్కించుకునేందుకు ఆమె భర్తను చంపాలని స్కెచ్ వేశాడు. అయితే, అతడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇబ్రహింపట్నానికి చెందిన పూజారి రవిదత్తు, అతడి స్నేహితుడు సతీష్‌తో కలిసి అర్థరాత్రి విజయవాడ బస్టాండ్‌లో కాపు కాశాడు. తాను చంపాలనుకున్న వ్యక్తి కనిపించడంతో .. వెంటనే సులభ్ కాంప్లెక్స్ లోకి వెళ్లి రివాల్వర్‌లో బుల్లెట్స్ లోడు చేయబోయాడు. ఆ హడావిడిలో గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో ఎదురుగా వేరే బాత్రూమ్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకటరమణ శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. తాను చేసిన పొరపాటు ఏంటో అర్థమైన రవిదత్తు, అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. తూటా పేలిన శబ్ధం వినిపించడం, బాత్రూమ్ డోర్‌కు రంధ్రం కావడంతో పోలీసులు అతడిని అనుమానించి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రివాల్వర్, బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈలోగా .. అతడి ఫ్రెండ్ సతీష్ తప్పించుకున్నాడు. గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. విజయవాడ బస్టాండులోని 50వ ప్లాట్ఫారం బాత్రూం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. పూజారి రవిదత్తును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు ఉపయోగించిన రివాల్వర్ లైసెన్సు లేదని సమాచారం. అయితే అసలు వాళ్ల చేతికి రివాల్వర్ ఎలా వచ్చిందనే విషయమే పెద్ద సంచలనంగా మారింది. రివాల్వర్‌ను బీహార్‌లో కొన్నట్లు పూజారి రవిదత్తు పోలీసులకు వెల్లడించారు. -
పూజారి చేతిలో రివాల్వర్ మిస్‌ఫైర్