మిఠాయి షాపుల్లో నిబంధనల ఉల్లంఘన
ప్రజారోగ్యంతో నిర్వాహకుల చెలగాటం
అమీర్‌పేటలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు
వెలుగులోకి నివ్వెరపోయే నిజాలు
సాక్షి,హైదరాబాద్: చిన్నాచితకా వాటి నుంచి పేరున్న బడా షాపుల దాకా ఒకటే తీరు. సాధారణ హోటల్ నుంచి స్టార్ హాటళ్ల వరకూ అదే వరస. ప్రజలు తినే తిండితో వ్యాపారం చేస్తున్న నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. చివరకు ప్రజలు శుభకార్యాల్లో, సంతోష సమయాల్లో తినే.. దీపావళి పండగ సందర్భంగా బంధుమిత్రులకు పంపిణీ చేసే స్వీట్స్ దాకా ఈ పరిస్థితిలో మార్పు లేదు. ప్రజలు ఎగబడి క్యూలు కట్టే దుకాణాల్లోనూ అదే పరిస్థితి. గత కొన్ని నెలలుగా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా, ఆయా దుకాణాల నిర్వాకాలు బట్టబయలవుతున్నా ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ఒకసారి తనిఖీ చేసిన వాటిల్లోనూ తిరిగి అలాంటి ఘటనలే పునరావృతమవుతున్నాయంటే చర్యలపై వాటికి ఎంతటి లెక్కలేనితనం ఉందో అంచనా వేసుకోవచ్చు.
డొల్లతనం వెల్లడైంది ఇలా..
👉 జనసమ్మర్థం ఎక్కువగా ఉండే నగరంలోని అమీర్‌పేటలో కొన్ని స్వీటు ఫుడ్‌సేఫ్టీ అధికారులు బుధవారం నిర్వహించిన తనిఖీల్లో డొల్లతనం వెల్లడైంది. నిబంధనలు బేఖాతరు చేయడం దృష్టికొచ్చింది. కనీసం ట్రేడ్ లైసెన్సులు లేకుండా రిజి్రస్టేషన్లతోనే దర్జాగా వ్యాపారాలు నిర్వహిస్తుండటం తెలిసింది. ఆయా వివరాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం..
👉 నిబంధనల మేరకు ఆహార విక్రయ దుకాణాల్లో ప్రజలకు కనిపించేలా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)సరి్టఫికెట్ ప్రదర్శించాల్సి ఉండగా, ‘ఆగ్రా స్వీట్స్’లో అది కనిపించలేదు. లైసెన్సు లేకుండానే కేవలం రిజి్రస్టేషన్ మాత్రం చేయించుకొని వ్యాపారం చేస్తుండటం దృష్టికొచ్చింది. డస్ట్‌బిన్లకు ఎలాంటి మూతలు లేకుండా కనిపించాయి. సిబ్బంది తలలకు క్యాప్, చేతులకు గ్లౌజ్‌లు, ఆప్రాన్స్ లేవు.
👉 సగం తయారైన వంటకాలు ఫ్రిజ్‌లో సవ్యంగా ఉంచకపోవడం, లేబుల్ లేకపోవడం కనిపించాయి. కొన్ని సరుకులు ఎక్స్‌పైర్ డేట్‌వి ఉండటం అధికారుల దృష్టికొచి్చంది. ‘ఢిల్లీ మిఠాయి వాలా’ దుకాణంలో సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్ సరి్టఫికెట్లు, నీటి విశ్లేషణ నివేదికలు లేవు. శిక్షణ పొందిన సూపర్‌వైజర్ లేకపోవడం గుర్తించారు. క్రిమి కీటకాలు చొరబడకుండా తలుపులు, కిటికీలకు ప్రూఫ్ స్క్రీన్స్ లేవు. నేలపై అడ్డదిడ్డంగా చక్కెర బ్యాగ్స్, స్టోర్‌రూమ్ ర్యాక్స్‌లో ఎలుక పెంటికలు, మూతలు లేని డస్ట్‌బిన్లు కనిపించాయి.
హోమ్ ఫుడ్స్‌లోనూ అదే తంతు..
వాసిరెడ్డి హోమ్ ఫుడ్స్‌లో కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కనిపించలేదు. కేవలం రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకున్నట్లు గుర్తించారు. స్టోర్‌రూమ్‌లోని సిబ్బంది తలకు క్యాప్, చేతులకు గ్లౌజ్‌లు, ఆప్రాన్స్ లేకుండానే ఉండటాన్ని, సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన సరి్టఫికెట్స్ కానీ, పెస్ట్ కంట్రోల్‌రికార్డులు కానీ లేకపోవడం అధికారుల దృష్టికొచి్చంది. తినడానికి సిద్ధంగా ఉన్న సేవరీలు, పచ్చళ్లకు, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వాటికి లేబుళ్లు లేకపోవడాన్ని గుర్తించారు. ‘వినూత్న ఫుడ్స్’లోనూ దాదాపుగా అవే పరిస్థితులు. ఇక్కడ రిజిస్ట్రేషన్ సరి్టఫికెట్ సైతం గడువు ముగిసిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారో రికార్డులు లేవు. ఆహార పదార్థాలు నిల్వ ఉంచేందుకు తగిన స్టోరేజీ సదుపాయం కూడా లేకపోవడం గుర్తించారు. ఇలా.. ఎక్కడ తనిఖీలు జరిగినా లోపాలు బట్టబయలవుతున్నాయి.
చర్యలు లేకే..
తగిన చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బయట తినే బదులు ఇంట్లో చేసుకునే చిక్కీ అయినా మేలని అంటున్నవారూ ఉన్నారు. ‘అయ్యో.. నేనెప్పుడు అక్కడే కొంటుంటాను. ఇకనుంచి మానేస్తాను’ అని సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తున్న వారూ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment