సాక్షి, విజయవాడ: నగరంలోని బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్‌లో పుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌లో పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. కనీసం కోవిడ్ నిబంధనలు పాటించకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. దీనిపై విజిలెన్స్ ఎస్పీ కనకరాజు, పుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. 'నిల్వ ఉన్న 1,500 కిలోల మటన్‌ను గుర్తించాం. ఆహారంలో నిషిద్ధ రంగులు వాడుతున్నారు. ఎంతోకాలంగా నిల్వ ఉంచిన హల్వాను వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. హోటల్ లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. దీనిపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. రెస్టారెంట్‌లోకొన్ని సాంపిల్స్ సేకరించాం. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి రిపోర్టుల ఆధారంగా రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment