
సినిమా: నటి అంజలిపై చర్యలు తీసుకోవాలంటూ కోవై ఆహార భద్రతా శాఖాధికారికి ఫిర్యాదు చేశారు. వివరాలు.. దక్షిణాదిలో హీరోయిన్ అంజలి పేరు సుపరిచయం. చట్ట నిబంధనలను పాటించకుండా తయారు చేస్తున్న ఒక వంట నూనె కంపెనీకి అంజలి ప్రచారం చేస్తున్నారంటూ కోవైకి చెందిన కోవై సుడర్‌పార్వై మక్కళ్ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ గురువారం కోవై ఆహార భద్రత శాఖ అధికారికి ఒక ఫిర్యాదు చేశారు.ఈ–రోడ్డు ప్రధాన కార్యాలయంగా సదరు నూనె కంపెనీ నడుస్తోందన్నారు.
వారు తయారు చేస్తున్న వంట నూనెను కొని పరిశోధనలకు పంపామని తెలిపారు. ఆ పరిశోధనలో తయారీదారులు నిభంధనలను పాటించడం లేదని తెలిసిందన్నారు. ఆ వంటనూనెతో ప్రజలకు హానికరం అని తెలిసిందన్నారు. అయినా వంటనూనెను కోవై జిల్లాలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ఆ వంటనూనెను స్వాధీనం చేసుకుని, తయారీ దారుడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ వంటనూనె కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటనల్లో నటి అంజలి నటించి ప్రజలను మోసపుచ్చుతున్నారని, ఈ కారనంగా ఆమెపై నమోదు చేసి, విచారించాలని ఆ పిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment