సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌: ‘టీ’తో పాటు పాడైపోయిన మటన్‌తో బిర్యానీ.. Task force Team Conducted Inspections In Secunderabad Alpha Hotel. Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌: ‘టీ’తో పాటు పాడైపోయిన మటన్‌తో బిర్యానీ..

Published Thu, Jun 20 2024 8:50 AM | Last Updated on Thu, Jun 20 2024 12:04 PM

Task force Team Conducted Inspections In Secunderabad Alpha Hotel

సాక్షి, సికింద్రాబాద్‌: నగరంలో పలు హోటల్స్‌లో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌లో తనిఖీల్లో భాగంగా నాసిరకంగా ఉన్న ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో హోటల్‌పై కేసు నమోదు చేసి లక్ష రూపాయలు జరిమానా విధించారు అధికారులు.

కాగా, ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు బుధవారం రాత్రి ఆల్ఫా హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అపరిశుభ్రత, నాసిరకం ఆహార పదార్థాలను వాడుతున్నట్టు గుర్తించారు. కిచెన్‌లో దారుణ పరిస్థితులను(అపరిశుభ్రత) వెలుగులోకి తెచ్చారు. అలాగే, పాడైపోయిన మటన్‌తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించారు. ఇక, తయారు చేసిన ఫుడ్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టి కస్టమర్లకు అందిస్తున్నట్టు తెలిపారు.

 

 

హోటల్‌లో తయారు చేసే బ్రెడ్‌తో పాటుగా ఐస్‌క్రీమ్‌, టీ పౌడర్‌ కూడా నాసిరకంగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో, ఆల్ఫా హోటల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. కేసు నమోదు చేసి లక్ష రూపాయల జరిమానా విధించారు.

 

 

మరోవైపు, సికింద్రాబాద్‌లోని సందర్శిని హోటల్‌లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా  ఎక్స్‌పైరీ అయిన నూడుల్‌ ప్యాకెట్స్‌, అపరిశుభ్రంగా ఉన్న పదార్థాలను గుర్తించారు. అలాగే, రాజ్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో సోదాలు చేయగా అక్కడి కిచెన్‌లో దారుణ పరిస్థితులను గుర్తించారు. కిచెన్‌లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలను చూసి అధికారులు విస్తుపోయారు. ఈ సందర్భంగా బార్‌ యాజమాన్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement