పశ్చిమ గోదావరి జిల్లాలో వాటర్ ప్లాంట్‌లో తనిఖీలు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో మినరల్ వాటర్ పేరిట అడ్డగోలుగా నడుస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై దాడుల పరంపర కొనసాగుతోంది. అనధికార వాటర్ ప్లాంట్లపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మాయాజలం’ కథనంపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా నాలుగో రోజు కూడా తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 17 వాటర్ ప్లాంట్లలో తనిఖీలు చేశారు.
ఆయా ప్లాంట్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు తయారుచేస్తున్నట్టు గుర్తించారు. పూర్తి స్థాయి అనుమతులు లేకుండా అవి నడుస్తున్నాయని తేల్చారు. ప్లాంట్లలో నిల్వ ఉన్న స్టాకును సీజ్ చేశారు. ఈ ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment