water packets
-
రూపాయి తెచ్చిన పంచాయితీ !
నల్గొండ (కోదాడరూరల్) : వాటర్ ప్యాకెట్ రేటుపై మద్యం దుకాణ నిర్వాహకుడికి మందుబాబులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అనంతగిరి మండలం గోల్తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం తాగేందుకు పట్టణంలోని ప్రమీలటవర్ సమీపంలోని ఓ వైన్స్ వద్దకు వచ్చారు. మద్యంతో పాటు వాటర్ ప్యాకెట్ కూడా తీసుకున్నారు. అయితే వైన్స్ నిర్వాహకుడు వాటర్ ప్యాకెట్‌కు రూ.3 తీసుకున్నాడు. దీంతో వారు వాటర్ ప్యాకెట్ రేటు రూ.2 కదా రూ.3 ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ నెలకొంది. మద్యం తాగేందుకు వచ్చిన వ్యక్తి వైన్స్ కౌంటర్లో ఉన్న వ్యక్తిని బయటకు లాగి గొడవకు దిగాడు. కౌంటర్ బల్లాపై ఉన్న మద్యం సీసాలను పగలకొట్టాడు. దీంతో కౌంటర్‌నుంచి బయటకు వచ్చిన వైన్స్ నిర్వాహకుడు కోపంతో బీరుసీసా తెచ్చి తలపైకొట్టడంతో అతని తల పగిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. -
వాటర్ ప్లాంట్లపై విస్తృతంగా దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో మినరల్ వాటర్ పేరిట అడ్డగోలుగా నడుస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై దాడుల పరంపర కొనసాగుతోంది. అనధికార వాటర్ ప్లాంట్లపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మాయాజలం’ కథనంపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా నాలుగో రోజు కూడా తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 17 వాటర్ ప్లాంట్లలో తనిఖీలు చేశారు. ఆయా ప్లాంట్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు తయారుచేస్తున్నట్టు గుర్తించారు. పూర్తి స్థాయి అనుమతులు లేకుండా అవి నడుస్తున్నాయని తేల్చారు. ప్లాంట్లలో నిల్వ ఉన్న స్టాకును సీజ్ చేశారు. ఈ ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్టు జాయింట్ ఫుడ్ కంట్రోలర్ స్వరూప్ ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
ఆదుకోకపోతే వలసలే గతి
శ్రీకాకుళం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో ఆదాయం ఇచ్చే జీడిమామిడి, కొబ్బరి తోటలతోపాటు ఇళ్లు కూడా కూలిపోవడంతో వేలాది కుటుంబాలు నిలువ నీడ కోల్పోయాయి. ఇళ్లలో ఉన్న బియ్యం, ఉప్పు, పప్పు పనికిరాకుండా పోయాయి. వీరంతా సర్కారు ప్రకటించిన 25 కిలోల బియ్యం, ఉప్పు, పప్పు కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఇంతవరకు అందలేదు. సర్కారు ఆదుకోకపోతే వలసపోవడం తప్ప వారికి గత్యంతరం కనిపించడం లేదు. ‘గూడు కూడా లేనప్పుడు ఎక్కడుంటే ఏముంది? కూలి పనులు ఎక్కడ దొరికితే అక్కడకు వెళ్లక తప్పదు’ అంటూ బాధితులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులపై చాలామంది ఆందోళన చెందుతున్నారు. పెళ్లి ఇళ్లే పునరావాస కేంద్రం కవిటి, మందస, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, పలాస తదితర గ్రామాల్లో బాధితుల బాధలు వర్ణణాతీతం. నాలుగు రోజులు నుంచి తాగునీరు లభించడం లేదు. వేలాది కుటుంబాలు పస్తులతో గడుపుతున్నాయి. వజ్రపుకొత్తూరు మండలంలో ఒక వ్యక్తి తన బిడ్డకు నెలన్నర కిందట నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి బట్టలు, భోజనాలకు అవసరమైన సరుకులన్నీ ముందే తెచ్చుకున్నారు. ఆదివారం ఆ కుటుంబంలో పెళ్లి జరగడంతో పిలిచినవారితోపాటు పిలవని వారు కూడా భోజనాలకు వెళ్లారు. దీంతో వండిన వంటలు అయిపోయి మళ్లీ చేయాల్సి వచ్చింది. ఆ పెళ్లిల్లు తుపాను పునరావాస కేంద్రంగా మారిపోయింది. ఆకలితో తుపాను బాధితులు ఎంత అల్లాడిపోతున్నారో తెలియడానికి ఈ సంఘటనే నిదర్శనం. వర్షమొస్తే ఎక్కడుండాలో? ఇళ్లు కూలిపోవడంతో వేలాది మంది చెట్ల కింద, పడిపోయిన ఇళ్ల పక్కన, పాఠశాలల్లో ఉంటున్నారు. ఇక వర్షమొస్తే ఎక్కడ తలదాచుకోవాలోనని భయపడుతున్నారు. తోటల్లోనే చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. అక్కడ ఉండాలంటేనే భయమేస్తోందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు త్వరగా సాయం చేయాలని వారు కోరుతున్నారు. ‘మా మట్టి మిద్దె పడిపోయింది. దీంతో మేం కట్టుబట్టలతో మిగిలాం. మార్చుకోవడానికి దుస్తులు కూడా లేవు. సర్కారు ఆదుకోలేదు’ అని వజ్రపుకొత్తూరు మండలం పెద్ద బైపల్లికి చెందిన పొలాకి బాలమ్మ వాపోయారు. తాగునీటి కోసం బాధితులు రాస్తారోకోలు చేస్తున్నారు. వరద వెలిసిపోయి మూడు రోజులు కావస్తున్నా వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లో చాలా గ్రామాల్లో బాధితులకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దాఖలాలే లేవు. దుర్వాసన వస్తున్న హెరిటేజ్ నీటి ప్యాకెట్లు హెరిటేజ్ నీటి ప్యాకెట్లను బాధితులకు ఇచ్చారు. అయితే అవి తాగడానికి పనికిరాకుండా దుర్వాసన వస్తుండటంతో జనం వాటిని పడేశారు. ఇళ్లలోనూ, పొలాల్లోనూ బోర్లు, మోటార్లు ఉన్నప్పటికీ నాలుగు రోజులుగా కరెంటు సరఫరా లేకపోవడంతో నీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. నీటి ట్యాంకర్ వస్తుందని చెప్పారని, ఇప్పటివరకు రాలేదని వివిధ గ్రామాల మహిళలు వాపోయారు. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందలేదు మా గ్రామానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. రోడ్డుపై పడిపోయిన చెట్లను గ్రామస్తుల సహకారంతో తొలగించాం. పారిశుధ్య పనులు కూడా గ్రామకమిటీనే చేయించింది. 500 గడపలున్న మా గ్రామంలో తోటలు, ఇళ్లు పడిపోయి చాలామంది నిరాశ్రయులయ్యారు. – డొంక తిరుపతిరావు, మాజీ సర్పంచ్, పెద్దబైపల్లి, వజ్రపుకొత్తూరు మండలం. -
బల్దియాలో వాటర్ ప్యాకెట్లతో జాగ్రత్త
-
వాటర్ ప్యాకెట్ల తరహాలో చీప్ లిక్కర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో టెట్రా ప్యాక్‌లలో మద్యం అమ్మకాలు చేపట్టబోతోంది. వాటర్ ప్యాకెట్ల తరహాలో చీప్ లిక్కర్ ప్యాకెట్లు తయారుచేసి డిసెంబర్ నుంచి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 180 ఎంఎల్, 90 ఎంఎల్ ప్యాక్‌ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి డిస్టిలరీస్‌లో ఈ టెట్రాప్యాకెట్లు ఉత్పత్తి కానున్నాయి. -
మందులోకి వాటర్ ప్యాకెట్లు తేలేదని హత్య
మియాపూర్ : వాటర్ప్యాకెట్లు తేనందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను మియాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ సీఐ రమేష్ కొత్వాల్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. స్థానిక బేకరీలో పని చేసే ఇస్మాయిల్(20), సయ్యద్ షఫీ (23) అనే వ్యక్తులు ఈ నెల 18న మర్తాండ నగర్‌లోని ఏవీ ఏస్టేట్‌లో మరో వ్యక్తితో కలిసి మద్యం సేవించారు. అనంతరం సదరు వ్యక్తిని వ్యక్తిని మద్యంతో పాటు వాటర్ బాటిళ్లు తీసుకురమ్మని చెప్పడంతో అతను వెళ్లి తిరిగి రాలేదు. దీనికి కోపోద్రిక్తులనైన ఇస్మాయిల్, సయ్యద్ షఫీ అతడిని పట్టుకుని వాటర్ ట్యాంకు వద్దకు తీసుకువచ్చి గొడవపడ్డారు. మాట మాట పెరగడంతో అతడి తలపై బండరాయితో మోది హత్య చేశారు. వైన్ షాపుల వద్ద సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిచిన పోలీసులు ఇస్మాయిల్, సయ్యద్ షఫీలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. కాగా హతుడు ఎవరనేది తెలియరాలేదని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని, నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
మహిళ దారుణ హత్య
కొత్తకోట రూరల్ : జాతీయ రహదారి నుంచి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న రాణిపేట గ్రామ శివారులో గుర్తు తెలియని వివాహిత దారుణ హత్యకు గురైంది. బుధవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అదే గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్‌రెడ్డి తన పొలానికి వెళ్లగా ఓ మహిళ వివస్త్రగా పడిఉండటం గమనించాడు. వెంటనే రైతు సర్పంచు బాలయ్యకు ఫోన్‌చేసి చెప్పాడు. ఆయన కొత్తకోట పోలీసులకు సమాచారం అందించడంతో వనపర్తి డీఎస్పీ శ్రీనువాస్‌రావు, కొత్తకోట సీఐ రమేష్‌బాబు, ఎస్ఐలు రాఘవేందర్, గోపాల్‌లు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. దుండగులు మహిళను అత్యాచారం చేసి అతి దారుణంగా తలపై బండరాయితో మోది హతమార్చారు. అంతటితో ఆగకుండా ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మహిళ వయసు సుమారు 25 నుండి 30 ఏళ్లలోపు ఉండవచ్చని, మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీపంలో బీరుసీసాలు, వాటర్ప్యాకెట్లు పడి ఉన్నాయి. పరిసర ప్రాంతంలో మహిళకు సంబంధించిన దుస్తులు, ఇతర వస్తువులు ఎక్కడా కనిపించలేదు. హత్య చేసిన వారు తెలివిగా బట్టలను మాయం చేశారు. మృతి చెందిన మహిళ గృహిణియా, ఇంకెవరైనా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేష్‌బాబు తెలిపారు. సంఘటన స్థలంలో లభించిన వాటర్ ప్యాకెట్లు గద్వాల ప్రాంతం జమ్మిచెడ్ ప్రాంతంలో తయారైనట్టు గుర్తించామని, మృతురాలెవరో గుర్తిస్తే కేసు ఛేదించడం సులభమవుతుందని తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
దడ పుట్టిస్తోన్న నీటి ధర!
దండుకుంటున్న వాటర్ ప్యాకెట్ల వ్యాపారులు తాగునీటి సరఫరా లేక తప్పక కొంటున్న ప్రజలు యలమంచిలి: ఒకవైపు మండుతున్న ఎండలు... విద్యుత్ కోతలతో తాగునీటి కోసం కటకట! వాటితో ప్రజలు అల్లాడుతుంటే ఇదే అదనుగా ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీలు మాత్రం ధర భారీగా పెంచేశాయి. మరోవైపు రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగునీరు సక్రమంగా అందకపోవడంతో ఈ వాటర్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు దండిగా లాభాలు దండుకుంటున్నారు. వాటర్ ప్యాకెట్ ధర రూపాయి నుంచి రూ. 2లకు పెంచేశారు. ఇప్పటివరకు పది రూపాయలకే 10 లీటర్ల నీటి క్యాన్ సరఫరా చేసేవారు. దీన్ని ఇప్పుడు రూ. 20 నుంచి రూ. 30కు అమ్ముతున్నారు. ఎంత ధర పెంచినా అధికారుల నియంత్రణ, పర్యవేక్షణ కొరవడటంతో పలువురు ఈ వ్యాపారం వైపే మొగ్గు చూపిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలతో గ్రామాల్లోనూ నీటి వ్యాపారం భారీ ఎత్తున చేస్తున్నారు. పలుచోట్ల రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగునీరు అందకపోవడంతో ప్రజలు ఈ ప్యాకేజ్డ్ నీటిపైనే ఆధారపడక తప్పట్లేదు. విద్యుత్ కోతల కారణంగా తాగునీటి పథకాల నుంచి రోజులో కనీసం రెండు గంటల పాటు కూడా నీరు అందని పరిస్థితి. కొన్నిచోట్ల పైపులైన్ల మరమ్మతుల కారణంగా తాగునీరు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వీటితో కొంత ఊరట... పలు ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు సేవా దృక్పథంతో గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు తాగునీటిని సరఫరా చేస్తున్నాయి. యలమంచిలి ఉప్పలపాటి ఫౌండేషన్, బ్రాండిక్స్ పరిశ్రమ యలమంచిలి, పెదపల్లి, పూడిమడక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. నక్కపల్లిలో హెట్రో డ్రగ్స్ పరిశ్రమ యాజమాన్యం ప్లాంట్‌ను ఏర్పాటుచేసి తాగునీటిని సరఫరా చేస్తోంది. పది లీటర్ల నీటిని రూ. 2ల నుంచి రూ. 5లకే ఇస్తుండటంతో ఇక్కడ డిమాండ్ పెరిగింది. -
నీటి దందాతో కోట్లు
రూ.25 కోట్లకుపైగా దోచేస్తున్న ప్రైవేటు సంస్థలు ఐఎస్ఐ లేకనే వాటర్ప్యాకెట్లు, బాటిల్స్ అమ్మకాలు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో నిలువు దోపిడీ తిరుపతి, చిత్తూరు నగరాల్లో నకిలీ కంపెనీలు పట్టించుకోని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు నకిలీ కంపెనీల నీళ్ల వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. కోట్ల రూపాయలు దండుకుంటున్న ఈ కంపెనీలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారుు. వేసవి మొదలవడంతో ఈ నీళ్ల వ్యాపారం మాఫియూ స్థాయికి చేరుకుంది. సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ఏటా నకిలీ వాటర్ ప్యాకేజీ కంపెనీలు రూ.25 కోట్లకు పైగా వ్యాపారం చేస్తూ ప్రజలను దోచేస్తున్నాయి. నకిలీ వాటర్ కంపెనీలు కలుషితమైన నీటిని అమ్ముతూ దాదాపు కోట్లల్లో టర్నోవర్ చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆహార మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం జిల్లాలో 90 శాతం ప్యాకేజీ వాటర్ కంపెనీలు నడవడం లేదు. కొన్ని లెసైన్స్లే లేకుండా విచ్చలవిడిగా నాసిరకం, కలుషితమైన నీటితో వ్యాపారం చేస్తున్నాయి. వందల్లో నకిలీ కంపెనీలు తిరుపతిలో 4, చిత్తూరులో రెండు, మదనపల్లెలో 2 కలిపి జిల్లా మొత్తం పదిలోపే ఐఎస్ఐ ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ లెసైన్స్ కలిగిన కంపెనీలు ఉన్నాయి. ఒక్క తిరుపతిలోనే ఐఎస్ఐ ముద్ర లేని వాటర్ప్లాంట్లు పదికి పైగా ఉన్నాయి. ఇళ్లలో నడుస్తున్న చిన్నాచితక అనధికారిక కంపెనీలు రెండు వందలకు పైగా ఉన్నాయి. మదనపల్లెలో 50, చిత్తూరులో 100 వరకు ఇలాంటి బోగస్ వాటర్ ప్యాకేజీ కంపెనీలు ఉన్నాయి. శివారు ప్రాంతంలో స్థలం లీజ్‌కు తీసుకోవడం బోరు వేసేయడం, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ అనధికారికంగా ప్రారంభించేయడం జిల్లాలో సర్వసాధారణంగా మారింది. వీటిని అడ్డుకోవడంపై జిల్లా అధికారులు కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు. నిబంధనలు ఇవీ... బీఎస్ఐ ఇచ్చే ఐఎస్ఐ మార్కు తప్పనిసరిగా ఉండాలి. ఐఎస్ఐ ఉంటేనే ఫుడ్ లెసైన్స్ ఇస్తారు. ఈ రెండు ఉంటేనే ప్యాకేజీ వాటర్ కంపెనీ నిర్వహించడానికి అనుమతి లభిస్తుంది. పంచాయతీ లేదా మున్సిపాలిటీ అప్రూవల్ కచ్చితంగా ఉండాలి. స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీగా గుర్తింపు పొంది ఉండాలి. సేల్‌ట్యాక్స్ టిన్ మెంబర్‌తోపాటు టీవోటీ లెసైన్స్ కలిగి ఉండాలి. వాటర్‌ప్లాంట్‌లో ఒక మైక్రోబయోలజిస్టు, కెమిస్టు, ఇద్దరు టెక్నికల్ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. వీరు ఎప్పటికప్పుడు వాటర్ శాంపిల్స్ తీసి ప్రయోగశాలకు పరీక్ష నిమిత్తం పంపుతుండాలి. ప్రతి నెలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి వాటర్ శాంపిల్స్ పరీక్షకు పంపి నివేదిక తెప్పించుకోవాలి. ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్-లేబుల్‌పై ఐఎస్ఐ మార్కు, వాటర్ ప్యాకేజీ చేసిన తేదీ, గడువు తీరే తేదీ ముద్రించాలి. ఒక వాటర్ ప్యాకెట్‌ను మూడు రోజుల్లోనే విక్రయించాలి. డబ్బు పెట్టినా... కలుషిత నీరే రైళ్లు, ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లో, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి విష్ణునివాసం, శ్రీనివాసం వంటి యాత్రికుల సముదాయాల వద్ద నాసిరకం, కలుషిత ప్యాకేజీ వాటర్‌ను విరివిగా అమ్ముతున్నారు. ఒక్కొక్క వాటర్ ప్యాకెట్ రూ.2, బస్టాండ్లలో రూ.3కి కూడా విక్రయిస్తున్నారు. ఐఎస్ఐ ముద్ర ఉన్న కంపెనీ బాటి ల్స్ లీటరు రూ.20 విక్రయిస్తుండగా, ఎలాంటి నాణ్యత లేని, ప్రమాణాలు పాటించని కంపెనీల వాటర్ బాటిల్స్‌ను రూ.20 కే విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆయూ మున్సిపల్ కమిషనర్లు, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అధికమొత్తాలకు ఆశపడి.... నీటిని ఎలాంటి ప్రోసెసింగ్ చేయకుండా నేరుగా తయూరైన వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్‌పై అధిక మొత్తంలో మార్జిన్ ఇస్తున్నారు. దీంతో దుకాణదారులు కూడా నాసిరకం నీటి ఉత్పత్తులపైనే ఆసక్తి చూపుతున్నారు. రానున్నది వేసవి సీజన్ కావడంతో ఈ తరహా మోసపూరిత వ్యాపారాలు ఇప్పటి నుంచే పుంజుకోనున్నాయి. -
నమో సభకు సర్వం సిద్ధం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నమో (నరేంద్ర మోడీ) సభకు నగరంలోని ప్యాలెస్ మైదానం ముస్తాబైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 స్థానాల్లో మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్రంలో మోడీ ప్రభావం ఉందనే అంచనాల నేపథ్యంలో ఈ సభపై పార్టీ నాయకులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. సభను సజావుగా, సాఫీగా నిర్వహించడానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. రెండు వారాల కిందటే సభా వేదిక నిర్మాణం, ఇతర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మోడీ హెచ్ఏఎల్ విమానాశ్రయం ద్వారా 11 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అభిమానులకు ఉప్మా, మైసూరు పాక్ ఆహూతుల కోసం ఏర్పాటు చేసిన ఆరు అతి పెద్ద వంట శాలల వద్ద 50 చొప్పున కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సుమారు యాభై వేల మందికి ఆహార పదార్థాలను అందిస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం వడ్డించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచే అల్పాహారం పంపిణీ ప్రారంభమవుతుంది. బెంగళూరు, తుమకూరుకు చెందిన పాక శాస్త్ర నిపుణులు చవులూరించే వంటకాలను సిద్ధం చేయనున్నారు. సుమారు 1000 మంది వాలంటీర్లు వీటిని పార్టీ అభిమానులకు పంచి పెడతారు. ఇప్పటికే 12 లక్షల నీటి ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఉప్మా, మైసూర్ పాక్, పలావ్, టొమాటో రైస్ బాత్‌లను అభిమానులకు పంపిణీ చేస్తారు. కాగా బహిరంగ సభను పురస్కరించుకుని ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బళ్లారి రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. పలు రూట్లలో మార్పులు చేశారు.