
మందులోకి వాటర్ ప్యాకెట్లు తేలేదని హత్య
మియాపూర్ : వాటర్‌ప్యాకెట్లు తేనందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను మియాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ సీఐ రమేష్ కొత్వాల్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. స్థానిక బేకరీలో పని చేసే ఇస్మాయిల్(20), సయ్యద్ షఫీ (23) అనే వ్యక్తులు ఈ నెల 18న మర్తాండ నగర్‌లోని ఏవీ ఏస్టేట్‌లో మరో వ్యక్తితో కలిసి మద్యం సేవించారు.
అనంతరం సదరు వ్యక్తిని వ్యక్తిని మద్యంతో పాటు వాటర్ బాటిళ్లు తీసుకురమ్మని చెప్పడంతో అతను వెళ్లి తిరిగి రాలేదు. దీనికి కోపోద్రిక్తులనైన ఇస్మాయిల్, సయ్యద్ షఫీ అతడిని పట్టుకుని వాటర్ ట్యాంకు వద్దకు తీసుకువచ్చి గొడవపడ్డారు. మాట మాట పెరగడంతో అతడి తలపై బండరాయితో మోది హత్య చేశారు.
వైన్ షాపుల వద్ద సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిచిన పోలీసులు ఇస్మాయిల్, సయ్యద్ షఫీలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. కాగా హతుడు ఎవరనేది తెలియరాలేదని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని, నిందితులను రిమాండ్‌కు తరలించారు.