Man Killed his Brother in Miyapur, Hyderabad - Sakshi
Sakshi News home page

Published Mon, Oct 8 2018 3:51 PM | Last Updated on Mon, Oct 8 2018 8:21 PM

Man Killed Brother In Miyapur In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అత్తాపూర్‌లో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని పట్టపగలు నరికిచంపిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నడిగడ్డ తండాలో సొంత తమ్ముడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అన్నాదమ్ముల మధ్య నెలకొన్న ఆస్తి తగాదా ఈ హత్యకు దారితీసినట్టు సమాచారం. ఇల్లు అమ్మిన డబ్బుల కోసం గత కొంతకాలంగా వీరిమధ్య వివాదం కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజామున తమ్ముడు రవీందర్‌ తన స్నేహితుడు సాయితో కలిసి అన్న రాందాస్‌ను నరికి చంపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement