nadigadda
-
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నడిగడ్డలో మారుతున్న రాజకీయాలు
-
జీరో దందాలకు అడ్డాగా ‘గద్వాల’.. కిలోల్లో బంగారం..
సాక్షి, గద్వాల: జీరో దందాకు కేరాఫ్ అడ్రస్‌గా నడిగడ్డ పేరు తెరపైకి వచ్చింది. ఏ వ్యాపారం చేయాలన్నా అక్రమార్కులు ముందుగా నడిగడ్డను ఎంచుకుంటున్నారు. పన్నులు ఎగ్గొట్టి దర్జాగా ధనం సంపాదించాలనే కుతూహలంతో జీరో దందా చేసే ముఠా గద్వాలలో పాగా వేశారు. తాజాగా మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అల్ మీనా జ్యువెలర్ వర్క్ దుకాణానికి చెందిన కోట్ల హీరాబేగ్ ఎలాంటి అనుమతి లేకుండా 1.786 కిలోల (సుమారు రూ.66 లక్షల విలువజేసే) బంగారు ఆభరణాలను జిల్లాకేంద్రంలోని పలు దుకాణాల యజమానులకు విక్రయించేందుకు వచ్చాడు. పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్‌్కఫోర్స్ సీఐ జగదీష్‌గౌడ్, ఎస్ఐ నరేష్, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించి హీరాబేగ్‌ను రాజవీధిలో అదుపులోకి తీసుకున్నారు. వాణిజ్య, కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ శాఖల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా బంగారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అయితే గద్వాలలోనే దాదాపు 20 కిలోలకు పైగా బంగారాన్ని విక్రయించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం 1.786 కిలోల బంగారాన్ని మాత్రమే వాణిజ్య పన్నులశాఖకు అప్పగించారు. ఈ విషయంపై జిల్లా వాణిజ్య పన్నులశాఖ అధికారి గోవర్ధన్‌ను మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి, పన్నులు చెల్లించకుండా బంగారం విక్రయించేందుకు హీరాబేగ్ గద్వాలకు వచ్చినట్లు పోలీసులు గుర్తించి సమాచారం అందించారన్నారు. బంగారానికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున ఫెనాలీ్టగా రూ.4 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. సెంట్రల్, కస్టమ్స్‌శాఖకు నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దు కావడమే.. రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో గద్వాల జీరో దందాలకు అడ్డాగా మారింది. ఆర్నెల్ల క్రితం కర్ణాటక పోలీసులు గద్వాలకు చెందిన ఓ వ్యాపారిని అరెస్టు చేసి రూ.20 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. ఇక్కడి వ్యాపారులే ఇతర రాష్ట్రాల వారితో ముఠాగా ఏర్పడి జీరో దందాను ప్రోత్సాహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్యలు తప్పవు.. బంగారు ఆభరణాలు విక్రయించేందుకు వచ్చిన వ్యాపారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి విచారణ చేపట్టి జీరో వ్యాపారంగా గుర్తించారు. ఆభరణాలను జప్తు చేశాం.. ఏవైనా అనుమతి పత్రాలుంటే సంబంధితశాఖ అధికారులకు చూపించి తీసుకెళ్లాలని సూచించాం. పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లాలో అక్రమంగా బంగారం, ఇతరత్రా వ్యాపారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. – రంజన్‌రతన్ కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల జిల్లా -
అన్నను నరికి చంపిన తమ్ముడు..!
సాక్షి, హైదరాబాద్ : అత్తాపూర్‌లో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని పట్టపగలు నరికిచంపిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ తండాలో సొంత తమ్ముడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అన్నాదమ్ముల మధ్య నెలకొన్న ఆస్తి తగాదా ఈ హత్యకు దారితీసినట్టు సమాచారం. ఇల్లు అమ్మిన డబ్బుల కోసం గత కొంతకాలంగా వీరిమధ్య వివాదం కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజామున తమ్ముడు రవీందర్ తన స్నేహితుడు సాయితో కలిసి అన్న రాందాస్‌ను నరికి చంపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
నడిగడ్డకు అన్యాయం చేస్తే ఊరుకోం
ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్ ఇటిక్యాల : జిల్లాల ఎంపికలో నడిగడ్డకు అన్యాయం చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్ అన్నారు. గద్వాలను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌తో గద్వాల జమ్ములమ్మ నుంచి అలంపూర్ జోగుళాంబ ఆలయం వరకు పాదయాత్ర చేపట్టిన పాదయాత్ర బుధవారం మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నడిగడ్డ ప్రాంత ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో జిల్లా కేంద్రాలకు అనుకూలమైన ప్రాంతం గద్వాలనేనని అన్నారు. జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని అర్హతలు గద్వాలకు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల కమిటీలకు ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలకులు సైతం గద్వాల జిల్లా చేయవచ్చని స్పష్టంగా తెలియజేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే చేపట్టిన ఆయుత చండీయాగం ఫలాలు రాష్ట్రానికి దక్కాలంటే జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇందుకోసం జోగుళాంబ అమ్మవారి పేరిట గద్వాలను జిల్లా కేంద్రం చేయాలని పేర్కొన్నారు. రెండోరోజు పాదయాత్రలో ఎమ్మెల్యేలు ప్రజలతో కలిసి ఎర్రవల్లిచౌరస్తా నుంచి షేకుపల్లి, సాసనూలు, దువాసిపల్లి, ఆర్.గార్లపాడు గ్రామాల మీదుగా మానవపాడు మండలంలోకి ప్రవేశించారు. ఆర్.గార్లపాడులో మధ్యాహ్న భోజనం అనంతరం స్వల్ప విరామంతో మానవపాడు మండలంలోకి అడుగుపెట్టారు. పాదయాత్రకు ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. మంగళవారం రాత్రి ఎర్రవల్లి చౌరస్తాలోని సరస్వతి టెక్నో స్కూల్లో పాదయాత్ర బృందం బస చేసింది. బుధవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించే ముందు సరస్వతి స్కూల్లో స్థానిక మహిళలు డీకే అరుణకు కుంకుమ బొట్టు పెట్టి పాదయాత్రను ప్రారంభింపజేశారు. సరస్వతి స్కూల్లో పాదయాత్రకు ముందు ఎమ్మెల్యేలు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పాదయాత్రలో ప్రధాన అధికారి విజయ్‌కుమార్, గద్వాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మానవపాడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్షీ్మనారాయణరెడ్డి, ఆర్.గార్లపాడు సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, పెద్దదిన్నె మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, అనంతరెడ్డి, ఇటిక్యాల మాజీ జెడ్పీటీసీ సుందర్ తదితరులు పాల్గొన్నారు.