హైదరాబాద్: మియాపూర్ హఫీజ్‌పేట్‌లో గురువారం రాత్రి ఓ మహిళ హత్యకు గురయింది. కాలనీకి చెందిన గుర్రం భిక్షపతి భార్య నిర్మల(32)కు నీలకంఠం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. శుక్రవారం ఉదయం నిర్మలను నిద్ర లేపేందుకు ఆమె కూతురు హసీనా యత్నించగా ఆమె లేవలేదు. దీంతో హసీనా చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. వారంతా వచ్చి చూసి ఆమె చనిపోయినట్లు గుర్తించారు. నీలకంఠం అనే వ్యక్తి ఆమెను గొంతు పిసికి చంపినట్లు నిర్మల సోదరి భవాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.