
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. నారాయణ విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్‌లో తనిఖీలు చేశారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన కూరగాయాలను వాడుతున్నట్లు గుర్తించారు. తప్పుపట్టిన కత్తులతో సిబ్బంది.. కూరగాయలను కట్ చేస్తున్నారు.
కిచెన్‌లో ఈగలు, బొద్దింకలను అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచే సిబ్బంది.. ఫుడ్‌ను నారాయణ హాస్టల్‌కు సరఫరా చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా ఫుడ్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నారాయణ సెంట్రల్ కిచెన్ నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment