కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ నేతృత్వంలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్‌ల తనిఖీకి ప్రత్యేక ఏర్పాట్లు
నాచారం ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌కు కొత్త హంగులు
కొత్తగా వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్
‘హైదరాబాద్‌లోనే పేరున్న ఓ హోటల్ నుంచి తెచ్చిన చికెన్ బిర్యానీ పార్శిల్‌లో బొద్దింక.. మరో హోటల్‌లో బిర్యానీలో కనిపించిన జెర్రీ... ప్రసిద్ధి చెందిన ఓ హోటల్ కిచెన్‌లోని ఫ్రిజ్‌లో పాడైపోయిన చికెన్..సేంద్రియ పంటల నుంచి తయారు చేసే స్వీట్ల దుకాణంలో అపరిశుభ్ర వాతావరణం’... గత కొంతకాలంగా హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని హోటళ్లలో ఆహార ప్రియులకు వినిపిస్తున్న చేదు వార్తలు ఇవి.
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటవుతున్న హోటళ్లు, ఇతర ఫుడ్ సెంటర్లలో ఆహార తనిఖీలకు అవసరమైన సిబ్బంది లేకపోవడం, ఆహార పరీక్షలు జరిపే సదుపాయాలు మెరుగుపడకపోవడం వంటి కారణాలతో కొన్నేళ్లుగా ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు.
జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు హోటళ్లకు ట్రేడ్ లైసెన్స్‌లు ఇవ్వడంపై చూపిన శ్రద్ధ ఆహార భద్రతపై పెట్టలేదు. రోడ్ల పక్కన గప్‌చుప్, మిర్చిబజ్జీలు, బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఇతర ఆహారం అందించే స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లు హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, నగరాల్లో విచ్చలవిడిగా వెలిశాయి.
మధ్యాహ్నం, రాత్రి భోజనాలు కూడా రోడ్ల పక్కనే అందించే స్ట్రీట్ ఫుడ్ పాయింట్లు అయితే కోకొల్లలు. వీధుల్లోని ఫుడ్ సెంటర్లతోపాటు పేరున్న హోటళ్లలో సైతం నాణ్యత ప్రమాణాలతో ఆహారం అందించడం లేదని ఇటీవల తనిఖీలతో తేటతెల్లమైంది.
‘ఫుడ్ సేఫ్టీ ఆన్‌వీల్స్’ద్వారా రాష్ట్రవ్యాప్త తనిఖీలు
ఆహార భద్రతపై వచ్చిన వందలాది ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం రేవంత్, మంత్రి దామోదర రాజనర్సింహ ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్‌వీ.కర్ణన్‌ను ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా నియమించి ఆహార భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకొనే బాధ్యతను ఆయనకు అప్పగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆహార తనిఖీ కోసం నాచారంలో ఒకే ల్యాబ్ ఉంది.
అయితే కొత్తగా మూడింటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాచారం ల్యాబ్‌ను ఆధునీకికరించడంతోపాటు వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కొత్తగా 24 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులకు వివిధ జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఐదు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటికి తోడు మరో పదింటిని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నారు.
‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’పేరిట ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) ప్రత్యేకంగా ఈ మొబైల్ యూనిట్లను అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాల్లో ఫుడ్ లే»ొరేటరీలను ఏర్పాటు చేసి, నగరం, పట్టణాల్లో రోజుకో ఏరియాలో మొబైల్ పరీక్షలు నిర్వహిస్తోంది. తద్వారా సంవత్సరానికి కనీసం 24 వేల ఆహార నమూనాలు పరీక్షించేలా లే»ొరేటరీలను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది.
దీనికోసం 10 మంది ల్యాబ్ టెక్నీíÙయన్లు, ఇతర సిబ్బందిని నియమించింది. జీహెచ్‌ఎంసీతోపాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండలో ఈ పది మంది ఇప్పటికే రంగంలోకి దిగారు. స్ట్రీట్ ఫుడ్స్, గప్‌చుప్ బండ్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల వద్ద ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ నిబంధనలకు అనుగుణంగా ఆహారం ఉందో లేదో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment