విశాఖపట్నం, సాక్షి: అభ్యర్థుల్ని ప్రకటించినా.. కూటమిలో గొడవలు మాత్రం సర్దుమణగడం లేదు. మరికొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చాల్సిందేననే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ జాబితాలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం కూడా ఉంది.
కూటమిలో భాగంగా విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్తుందనే ప్రచారం మొదట్లో బాగా వినిపించింది. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమనే భావించారంతా. కానీ, చంద్రబాబు పాచికతో ఈ సీటు టీడీపీకి వెళ్లింది. నారా లోకేష్ తన తోడల్లుడు భరత్‌కు సీటు ఇప్పించారు. దీంతో జీవీఎల్ నొచ్చుకున్నారు. అయినా విశాఖకు తన సేవలు అందిస్తానంటూ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు.
అయితే ఈలోపు విశాఖలో పోస్టర్ల కలకలం రేగింది. జీవీఎల్‌కు సీటు కేటాయించాలంటూ జన జాగరణ సమితి పేరిట ఆంధ్రా యూనివర్సిటీ గేటుకు పోస్టర్లు అంటించారు. టీడీపీ-జనసేన-బీజేపీ తరఫు ఉమ్మడి అభ్యర్థి భరత్ విశాఖ కోసం ఏం చేశాడని.. జీవీఎల్ కనీసం పార్లమెంట్లో గళం వినిపించారని ఆ పోస్టర్ల సారాంశం. జీవీఎల్‌కు టికెట్ కేటాయించకపోవడం అన్యాయమని రాసి ఉంది అందులో. దీంతో కూటమిలో ఈ పోస్టర్లపై చర్చ జోరందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment