visakhapatnam parliamentary constituency
-
మనసు పెడితే మార్గం ఉంటుంది
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి ఉన్నత విద్యావంతురాలు. 2006లో బొబ్బిలి లోక్‌సభ సభ్యురాలిగా, 2009లో విజయనగరం ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న ఆమె.. 2009లోనే ‘విశాఖ విజన్’ పేరిట నగర అభివృద్ధిపై ఆమె పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించారు.దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ నగరం ఒకటి. భవిష్యత్తులో ఇలాంటి నగరంలో తాగునీటి సమస్యలు రాకుండా ఉండేలా ముందుచూపుతో 2009లో లోక్‌సభలో బొత్స ఝాన్సీ లక్ష్మి వినూత్న ఆలోచన చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సూచన చేశారు. తాగునీటి సమస్యకు చెక్ చెప్పేందుకు మంచినీటి ఎద్దడిపై అప్పటి కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని పార్లమెంటులో పట్టుబట్టడం ఆమెకే చెల్లింది. సముద్ర జలాలను తాగునీటి వినియోగార్థం మార్చే డిశాలీనేషన్ ప్రాజెక్ట్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తే..ఆంధ్ర తీర ప్రాంతం నీటి కష్టాలను నెరవేర్చగలదని లోక్ సభలో గళమెత్తారు. 2007లో ఎప్రిల్ 27వ తేదీన పార్లమెంటులో 368 నెంబర్ స్టారెడ్ క్వశ్చన్ సంధించారు. దేశంలోనే అతి పెద్ద తీరరేఖ పొడవు 927 కి.మీ ఉన్న ఏపీలో తాగునీటి సమస్య లేకుండా ఉండాలంటే దీనికి శాశ్వత పరిష్కారం డిశాలీనేషన్ ప్రాజెక్ట్ అని వివరించారు. దీనికి అప్పటి కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ సమాధానం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నేరుగా త్రాగునీటి అంశాన్ని చూడకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతిపాదనలతో నిధులు కేటాయిస్తామని సమాధానం చెప్పడం జరిగింది. భీమిలి మున్సిపాలిటీ పరిధిలో 2.86 ఎంఎల్డి నీటి ప్రాజెక్ట్ కు కేంద్ర సహకారం ఉంటుందని సమాధానమిచ్చారు. రూ.185 లక్షల నిధులు మంజూరు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ప్రజావసరాలను నెరవేర్చడంలో ఎటువంటి శషభిషలకు పోకుండా పార్లమెంటులో ఝాన్సీలక్ష్మి ప్రయత్నానికి నాడు ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. -
Visakha: కూటమిలో పోస్టర్ల కలకలం
విశాఖపట్నం, సాక్షి: అభ్యర్థుల్ని ప్రకటించినా.. కూటమిలో గొడవలు మాత్రం సర్దుమణగడం లేదు. మరికొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చాల్సిందేననే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ జాబితాలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం కూడా ఉంది. కూటమిలో భాగంగా విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్తుందనే ప్రచారం మొదట్లో బాగా వినిపించింది. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమనే భావించారంతా. కానీ, చంద్రబాబు పాచికతో ఈ సీటు టీడీపీకి వెళ్లింది. నారా లోకేష్ తన తోడల్లుడు భరత్‌కు సీటు ఇప్పించారు. దీంతో జీవీఎల్ నొచ్చుకున్నారు. అయినా విశాఖకు తన సేవలు అందిస్తానంటూ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. అయితే ఈలోపు విశాఖలో పోస్టర్ల కలకలం రేగింది. జీవీఎల్‌కు సీటు కేటాయించాలంటూ జన జాగరణ సమితి పేరిట ఆంధ్రా యూనివర్సిటీ గేటుకు పోస్టర్లు అంటించారు. టీడీపీ-జనసేన-బీజేపీ తరఫు ఉమ్మడి అభ్యర్థి భరత్ విశాఖ కోసం ఏం చేశాడని.. జీవీఎల్ కనీసం పార్లమెంట్లో గళం వినిపించారని ఆ పోస్టర్ల సారాంశం. జీవీఎల్‌కు టికెట్ కేటాయించకపోవడం అన్యాయమని రాసి ఉంది అందులో. దీంతో కూటమిలో ఈ పోస్టర్లపై చర్చ జోరందుకుంది. -
జనసేనకు ‘కొత్త’ తలనొప్పి
అలగడమే అలంకారంగా భావించే సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ.. జనసేనలో చేరీ చేరడంతోనే తన సహజనైజాన్ని బయటపెట్టుకున్నారు. అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసేది తానేనని ఫిక్స్ అయిపోయాకనే అయన జనసేనలో చేరారు. వాస్తవానికి అయన ఆలోచనలకూ విరుద్ధంగా జరిగితే వెంటనే అయన అలకపాన్పు ఎక్కుతారు.. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతున్నదే. కాంగ్రెసులోను, వైఎస్సార్ కాంగ్రెస్ లోను ఇలా ఎక్కడైనా ఆయనది అదే తీరు. ఇక చాన్నాళ్లుగా ఖాళీగా ఉంటున్న కొణతాల రామకృష్ణ మొన్నీమధ్యనే జనసేనలో చేరారు. చేరుతూనే.. తాను అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని అని తనకుతానే ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉండగానే.. అనకాపల్లి నుంచి తాను పోటీ చేస్తాను అంటూ పవన్ అన్నయ్య నాగబాబు సైతం అనకాపల్లి మీద కన్నేశారు.. తరచూ అక్కడే పర్యటిస్తున్నారు. యలమంచిలి దగ్గర అయన ఉండేందుకు ఒక ఇతనికి, స్టాఫ్ కోసం ఇంకో రెండు ఇళ్లను సైతం తీసుకున్నారు. అనకాపల్లి నుంచి పోటీకి అయన ఏర్పాట్లు చేసుకున్నారు... దీంతో తన అంశాలమీద నీళ్లు పడ్డాయని గుర్తించిన కొణతాల మొన్న నిన్న అనకాపల్లిలో జరిగిన పార్టీ సభలు, ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ' తనకు టిక్కెట్ ఇవ్వనప్పుడు ఇంకా పార్టీ సమావేశాలకు వెళ్లడం ఎందుకన్నది ఆయన భావన. ఇదిలా ఉండగా అనకాపల్లిలో ప్రధాన సామాజిక వర్గం అయిన గవర కమ్యూనిటీకి చెందిన కొణతాల అలిగితే ఇక తన గెలుపు సంగతి అటుంచి డిపాజిట్లు కూడా రావని భయపడిన నాగబాబు ఒకవైపు.. పవన్ మరోవైపు కొణతాల ఇంటికి వెళ్లి ఆయన్ను బుజ్జగించారు. ఇదిలా ఉండగా తెలుగుదేశంతో పొత్తులో భాగంగా జనసేనకు అనకాపల్లి,కాకినాడ,మచిలీపట్నం లోక్ సభ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో నాగబాబు సైతం అనకాపల్లిలో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక.. కొణతాల సైతం అక్కడే కన్నేయడంతో ఇరువురిమధ్య పీఠముడి పడింది. దీంతో ఆ విభేదాలను పరిష్కరించేందుకు పవన్, నాగబాబు సైతం కొణతాల ఇంటికి వెళ్లి వచ్చారు. ఒకవేళ అయన మెత్తబడినా ఆయనకు ఇంకోచోట ఎక్కడ సీట్ ఇస్తారనేది తెలియడం లేదు. ఇప్పటికే విశాఖలో పెందుర్తి, భీమిలి ఇలా మూడు నాలుగు సీట్లలో జనసేన గట్టిగా డిమాండ్ చేస్తోంది.. ఇప్పుడు అవికాకుండా అనకాపల్లి ఎమ్మెల్యే కూడా తీసుకోవడం కష్టమే.! మరి అలాంటప్పుడు కొణతాలను ఎక్కడ ? ఎలా ఎకామిడేట్ చేస్తారో చూడాలి. ఇక్కడ.. వైవీ చక్రవర్తి అనే అయన సైతం తెలుగుదేశం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతుండగా. సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కూడా టిక్కెట్ కోసం చూస్తున్నారు.. ఇదిలా ఉండగా మరో సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు కొడుకు రత్నాకర్ సైతం టీడీపీ కోసం గట్టిగా ఆశతో ఉన్నారు. దీంతో వీళ్ళు ఎవరికీ టిక్కెట్ లేకుండా నాగబాబుకు ఇచ్చేలా చంద్రబాబును పవన్ ఒప్పిస్తున్నారు అని అంటున్నారు.. దీంతో అనకాపల్లి కాస్తా హాట్ టాపిక్ అయ్యింది. ✍️సిమ్మాదిరప్పన్న -
సబ్బం హరి తీరుతో కంగుతిన్న సీపీఎం
విశాఖపట్నం: అనకాపల్లి ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యలపై సీపీఎం శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమతో పొత్తు పెట్టుకొని బీజేపీ-టీడీపీకి ఓట్లేయమని ఎలా చెబుతున్నారని మండిపడ్డాయి. సమైక్యవాదానికి సబ్బంహరి తూట్లు పొడిచారని విమర్శించాయి. సమైక్యాంధ్రకు కట్టుబడిన సీపీఎం... కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీతో సీమాంధ్రలో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా పోటీకి దిగిన సబ్బం హరికి సీపీఎం మద్దతు పలికింది. అయితే చివరి నిమిషంలో సబ్బం హరి చేతులెత్తేయడంతో సీపీఎం శ్రేణులు కంగుతిన్నాయి. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చివరి నిమిషంలో సబ్బం హరి ప్రకటించడంతో ఆయనపై సీపీఎం శ్రేణులు కారాలు మిరియాలు నూరతున్నాయి. పిరికివాడిలా పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా, ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని అడిగే అధికారం ఆయనకెక్కడిదని ప్రశ్నిస్తున్నాయి. అసలు ఎవరినడిగి పోటీ నుంచి తప్పుకున్నారని నిలదీస్తున్నాయి.