సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి ఉన్నత విద్యావంతురాలు. 2006లో బొబ్బిలి లోక్‌సభ సభ్యురాలిగా, 2009లో విజయనగరం ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న ఆమె.. 2009లోనే ‘విశాఖ విజన్’ పేరిట నగర అభివృద్ధిపై ఆమె పార్లమెంట్‌లో పలుమార్లు ప్రస్తావించారు.దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ నగరం ఒకటి. భవిష్యత్తులో ఇలాంటి నగరంలో తాగునీటి సమస్యలు రాకుండా ఉండేలా ముందుచూపుతో 2009లో లోక్‌సభలో బొత్స ఝాన్సీ లక్ష్మి వినూత్న ఆలోచన చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సూచన చేశారు.
తాగునీటి సమస్యకు చెక్ చెప్పేందుకు మంచినీటి ఎద్దడిపై అప్పటి కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని పార్లమెంటులో పట్టుబట్టడం ఆమెకే చెల్లింది. సముద్ర జలాలను తాగునీటి వినియోగార్థం మార్చే డిశాలీనేషన్ ప్రాజెక్ట్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తే..ఆంధ్ర తీర ప్రాంతం నీటి కష్టాలను నెరవేర్చగలదని లోక్ సభలో గళమెత్తారు. 2007లో ఎప్రిల్ 27వ తేదీన పార్లమెంటులో 368 నెంబర్ స్టారెడ్ క్వశ్చన్ సంధించారు. దేశంలోనే అతి పెద్ద తీరరేఖ పొడవు 927 కి.మీ ఉన్న ఏపీలో తాగునీటి సమస్య లేకుండా ఉండాలంటే దీనికి శాశ్వత పరిష్కారం డిశాలీనేషన్ ప్రాజెక్ట్ అని వివరించారు.
దీనికి అప్పటి కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ సమాధానం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నేరుగా త్రాగునీటి అంశాన్ని చూడకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతిపాదనలతో నిధులు కేటాయిస్తామని సమాధానం చెప్పడం జరిగింది. భీమిలి మున్సిపాలిటీ పరిధిలో 2.86 ఎంఎల్‌డి నీటి ప్రాజెక్ట్ కు కేంద్ర సహకారం ఉంటుందని సమాధానమిచ్చారు. రూ.185 లక్షల నిధులు మంజూరు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ప్రజావసరాలను నెరవేర్చడంలో ఎటువంటి శషభిషలకు పోకుండా పార్లమెంటులో ఝాన్సీలక్ష్మి ప్రయత్నానికి నాడు ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment