botsa jhansi lakshmi
-
పాదయాత్రకు మించి బస్సు యాత్రకు ప్రజాదరణ
-
ఆర్కే బీచ్ లో బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారం
-
మనసు పెడితే మార్గం ఉంటుంది
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి ఉన్నత విద్యావంతురాలు. 2006లో బొబ్బిలి లోక్‌సభ సభ్యురాలిగా, 2009లో విజయనగరం ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న ఆమె.. 2009లోనే ‘విశాఖ విజన్’ పేరిట నగర అభివృద్ధిపై ఆమె పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించారు.దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ నగరం ఒకటి. భవిష్యత్తులో ఇలాంటి నగరంలో తాగునీటి సమస్యలు రాకుండా ఉండేలా ముందుచూపుతో 2009లో లోక్‌సభలో బొత్స ఝాన్సీ లక్ష్మి వినూత్న ఆలోచన చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సూచన చేశారు. తాగునీటి సమస్యకు చెక్ చెప్పేందుకు మంచినీటి ఎద్దడిపై అప్పటి కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని పార్లమెంటులో పట్టుబట్టడం ఆమెకే చెల్లింది. సముద్ర జలాలను తాగునీటి వినియోగార్థం మార్చే డిశాలీనేషన్ ప్రాజెక్ట్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తే..ఆంధ్ర తీర ప్రాంతం నీటి కష్టాలను నెరవేర్చగలదని లోక్ సభలో గళమెత్తారు. 2007లో ఎప్రిల్ 27వ తేదీన పార్లమెంటులో 368 నెంబర్ స్టారెడ్ క్వశ్చన్ సంధించారు. దేశంలోనే అతి పెద్ద తీరరేఖ పొడవు 927 కి.మీ ఉన్న ఏపీలో తాగునీటి సమస్య లేకుండా ఉండాలంటే దీనికి శాశ్వత పరిష్కారం డిశాలీనేషన్ ప్రాజెక్ట్ అని వివరించారు. దీనికి అప్పటి కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ సమాధానం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నేరుగా త్రాగునీటి అంశాన్ని చూడకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతిపాదనలతో నిధులు కేటాయిస్తామని సమాధానం చెప్పడం జరిగింది. భీమిలి మున్సిపాలిటీ పరిధిలో 2.86 ఎంఎల్డి నీటి ప్రాజెక్ట్ కు కేంద్ర సహకారం ఉంటుందని సమాధానమిచ్చారు. రూ.185 లక్షల నిధులు మంజూరు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ప్రజావసరాలను నెరవేర్చడంలో ఎటువంటి శషభిషలకు పోకుండా పార్లమెంటులో ఝాన్సీలక్ష్మి ప్రయత్నానికి నాడు ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. -
Botsa Jhansi Lakshmi: పుట్టినింటి రుణం తీర్చుకుంటా
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖే నా పుట్టినిల్లు.. నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది. ఇక్కడే చదువు పూర్తి చేశాను. రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన నేను పార్లమెంట్లో విశాఖ నగర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల కోసం పలుమార్లు ప్రస్తావించాను. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుంది. ఇదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమతం. రాష్ట్ర భవిష్యత్‌కూ విశాఖే ఆశాకిరణం. విశాఖ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా బీసీ మహిళనైన తనకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చి ప్రజాసేవ చేసే అవకాశం కలిగింది. ఈ ఎన్నికల్లో గెలిచి ఈ ప్రాంత ఆడపడుచుగా స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటా.. విశాఖ అభివృద్ధి కృషి చేస్తా.’ అని వైఎస్సార్ సీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మెట్టినింటి నుంచి పుట్టినింటికి.. దశాబ్దాల కాలంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే నా ఆకాంక్ష. ఉత్తరాంధ్రలోని విశాఖ నగరం పరిపాలన రాజధాని అయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. విశాఖ నాకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలోనే నా బాల్యం, విద్యాభ్యాసం పూర్తి చేశాను. విశాఖ ప్రజలకు ఏం కావాలో.. విశాఖను ఎలా అభివృద్ధికి చేయాలో.. నిధులు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. ఈ ప్రాంత ఆడపడుచుగా విశాఖ ప్రగతికి కృిషి చేస్తాను. మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. సంక్షేమ పథకాలతో మహిళల ఆర్థిక స్వావలంబన ‘ఇంటికి వెలుగు ఇల్లాలే..’అన్నట్టుగా ప్రతీ ఇల్లు బాగుండాలంటే ఆ ఇంట్లో మహిళ ఆర్థికంగా ఎదగాలి. అప్పుడే ఆ కుటుంబం ఆర్థిక పరిపుష్టి సాధిస్తుంది. అలాంటి పాలన 2019–2024 వరకు చూశాం. ఎంతో ముందు చూపుతో.. పెద్ద మనసుతో మహిళలే లబ్ధిదారులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి, ఆసరా, చేదోడు, గృహ నిర్మాణం, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా మహిళల ఖాతాలకే డీబీటీ పద్ధతిలో నగదు జమ చేసి.. ఆర్థికంగా బలోపేతం చేశారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ.. మరింత ఆర్థికంగా ఎదుగుతున్నారు. గ్రామీణ ప్రాంతంలోనే కాకుండా అర్బన్ ప్రాంతంలో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారు. ఎక్కడా అవినీతి లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా యావత్ దేశం ప్రశంసించేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగింది. స్టీల్‌ప్లాంట్ ఆంధ్రుల హక్కు గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా పని చేసిన నేను విశాఖకు అవసరమైన నిధులు, ప్రాజెక్టుల కోసం పార్లమెంట్లో గళం విప్పాను. బీహెచ్ఈఎల్, బీహెచ్వీఎల్ విలీనం ప్రక్రియ, షిప్‌యార్డు వెస్సెల్స్ కోసం పార్లమెంట్లో ప్రస్తావించాను. విశాఖ నగరానికి మెట్రో రైలు తీసుకురావాలని, భోగాపురం ఎయిర్‌పోర్టు వంటివి మహానేత వైఎస్సార్ హయాంలో ఆలోచన చేశాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. భావితరాల భవిష్యత్ కోసం వేలాది ఎకరాల భూములను ఇక్కడి ప్రజలు త్యాగం చేశారు. భవిష్యత్ బాగుంటుందనే భూములిచ్చారు.. ప్రైవేటీకరణ కోసం కాదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు వైఎస్సార్సీపీ కృషి చేస్తోంది. ఇక్కడి ప్రజల సెంటిమెంట్, విశాఖ స్టీల్ పరిరక్షణ బాధ్యతను ఈ ప్రాంత ఆడపడుచుగా తీసుకుంటాను. నేను ఎంపీగా గెలిచి.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఉద్యమిస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అందరం కలిసి అడ్డుకుందాం. అన్ని స్థానాలు క్లీన్‌స్వీప్ చేస్తాం విశాఖ పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికల్లో నాలుగు సీట్లు కోల్పోయాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చూసిన ప్రజలు.. ఈ సారి అన్ని సీట్లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.ప్రచారానికి వెళ్తున్న సమయంలో లబ్ధి పొందిన మహిళలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులను చూసి ఐక్యరాజ్యసమితిలో పెద్దలు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థుల భవిష్యత్‌ను సీఎం జగన్ తీర్చిదిద్దుతున్నారు. పేదోడి ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచారు. విశాఖలో పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి సీఎం జగన్‌తో సాధ్యమైంది. విశాఖే రాష్ట్ర భవిష్యత్ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. రాష్ట్రానికి విశాఖ లాంటి ప్రాంతం రాజధానిగా అవసరం ఉంది. రాష్ట్ర భవిష్యత్ అంతా విశాఖ నగరమే. విశాఖ పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. రాజధానికి కావాల్సిన మౌలిక వసతులు, రోడ్డు, విమాన, ఓడ రేవు కనెక్టవిటీ ఉంది. ఆనాడు మహానేత వైఎస్సార్ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపేలా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటు పడింది. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ అంతకుమించి ఉత్తరాంధ్ర కోసం ఆలోచన చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే దేశంలోనే టాప్ నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది. విశాఖ పార్లమెంట్‌తో పాటు అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముందడుగు వేయాలి. -
విశాఖ నా పుట్టిన ఇల్లు: బొత్స ఝాన్సీ లక్ష్మి
-
రాజన్న హయాంలో...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అంతకు ముందు కంటే డ్వాక్రా మహిళలు రెండింతలు పైబడి పెరిగారు. వారందరికీ డ్వాక్రా రుణాలు ఇస్తూ మహిళల సంక్షేమాన్ని ఆయన చవి చూశారు. మళ్లీ అలాంటి రాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందే! తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సాగునీరు, తాగునీరు అందక ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. –బొత్స ఝాన్సీలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఎంపీ -
కొత్త పార్టీ ప్రభావం ఉండదు: బొత్స ఝాన్సీ
బొబ్బిలి: కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టినా.. దాని ప్రభావం పెద్దగా ఉండదని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. బుధవారం ఆమె బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏది చేయడానికైనా హక్కు ఉందన్నారు. అయితే సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున కిరణ్ సీఎం అయ్యారు కనుక దాన్ని గుర్తుపెట్టుకుంటేనే మనుగడ ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం వాల్తేరును రైల్వే జోన్‌గా చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖను రాజధాని చేయాలని, సీమాంధ్రకు విద్య, ఉపాధి, వైద్యం, సాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. -
మళ్లీ నిరాశే!
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఎప్పటిలాగే నిరాశే ఎదురైంది. ఏడాది పాటు నిరీక్షించిన జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట చెల్లుబాటు కాలేదు. కేంద్రంలో తనకున్న పలుకుబడితో జిల్లాకు న్యాయం చేస్తానని చెప్పిన ఎంపీ ఏమీ తీసుకురాలేకపోయారు. ఆమె విజ్ఞప్తిని రైల్వేమంత్రి లెక్క చేయలేదని తెలుస్తోంది. మూడు రాష్ట్రాలకు కలిపి కొత్తగా వేస్తున్న రైళ్ల వెనుక తన ఘనత ఉందని చివరికి సమర్థించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వేకి సంబంధించి విశాఖ- గుణుపూర్ పాసింజర్ రైలు తప్పితే ఇంకేదీ మనకందలేదు. రైల్వే బడ్జెట్ ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం చూపలేదు సరికదా గత బడ్జెట్లో చేర్చిన అంశాలకు కూడా నిధులు కేటాయించలేదు. ఇదంతా చూస్తుంటే గత బడ్జెట్లో చేసిన కేటాయింపులు మరో రెండు మూడే ళ్లయినా అమలయ్యే పరిస్థితి కన్పించడం లేదు. విజయనగరం-రాయపూర్ లైన్ విద్యుద్దీకరణ, విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు ప్రత్యేక రైల్వే లైన్, బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, విజయనగరం రైల్వే స్టేషన్లో అవుట్ పేషెంట్ విభాగం, వ్యాధి నిర్ధారణ కేంద్రం తదితరాలన్నీ చాలా కాలంగా ప్రతి రైల్వే బడ్జెట్లో పేర్కొంటున్నారు. ఈసారి ఆ ప్రస్తావన కూడా లేకుండా చేశారు. దీన్నిబట్టి గత కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏళ్ల నాటి డిమాండ్లైన పలాస-విశాఖ రైలు, సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్న కోరిక, సుమారు రూ.కోటి 55 లక్షలతో విజయనగరంలో నిర్మించిన మామిడి యార్డ్‌కు ప్రత్యేక లైన్ కలగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక రూ.10 కోట్లకు పైగా ఆదాయాన్ని తీసుకొస్తున్న గూడ్స్ షెడ్ అభివృద్ధి కూడా ఏళ్ల నాటి డిమాండ్ జాబితాలో చేరిపోయింది. ఎంపీ ఝాన్సీలక్ష్మీ ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’పరిస్థితి కూడా ఒక డిమాండ్‌గానే మిగిలిపోయింది. రైల్వేస్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిని 5వ ప్లాట్‌ఫామ్ నుంచి చివరి ప్లాట్‌ఫామ్ వరకూ నిర్మించేందుకు చేసిన ప్రతిపాదనలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. వాటికి సంబంధించి పిల్లర్లు వేసి పనులు అర్ధాంతరంగా నిలుపుదల చేశారు. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్లో చివరి వరకూ షెల్టర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఆ పనులు కూడా నెరవేరలేదు. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశాఖ-కోరాపుట్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కేవలం వారంలో రెండురోజులు మాత్రమే నడుపుతున్నారు. వాస్తవానికి ఐదురోజులు నడపాల్సి ఉంది. వి.టి.అగ్రహారం బీసీ కాలనీ వద్ద రైల్వే గేట్ ఏర్పాటుచేయాలన్న వినతులు వినతులుగానే మిగిలిపోయాయి. -
విశ్వాస ఘాతుకం !
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తమకు పదవులే పరమావధి అని దాని కోసం ప్రజలను ఎంతగా వీలైతే అంతగా వం చించగలమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబం మరో సారి నిరూపించింది. పార్లమెంట్లో సమైక్యాంధ్రకు అనుకూలంగా గళం విప్పుతాననిప్రకటించిన ఎంపీ బొత్స ఝాన్సీ కనీసం అవిశ్వాస నోటీసుపై సంతకం పెట్టలేదు. దీంతో ఆమె మరోసారి జిల్లా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. నోటి తో పలకరిస్తూ నొసటితో వెక్కిరిస్తున్నట్టుగా బొత్స కుటుంబ సభ్యులు వ్యవహరిస్తుండడంపై జిల్లా వాసు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా చీల్చిందన్న విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనకు మూలకారకుడని, ఆయన తన పదవుల కోసమే అధిష్టానానికి వత్తాసు పలుకుతున్నారని ప్రజలు గాఢంగా విశ్వసించారు. ప్రజల్లో రేకెత్తిన ఈ అనుమానాలు బలపడి, హింసాత్మకంగా మారి ఆయన ఆస్తులపై దాడులవరకూ దారితీసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా ఉద్యమిస్తున్న తరుణంలో ఎంపీ ఝాన్సీ వారికి తారసపడ్డారు. సమైక్యాంధ్ర కోసం మీరు ఎందుకు రాజీనామా చేయడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు అనాడు ప్రశ్నించగా, దీని కోసం తాను పార్లమెంట్లో గళం విప్పుతానని, జిల్లా వాసుల ఆందోళనను సభ దృష్టికి తీసుకువెళతానని చెప్పి ఆమె ఆ పూటకు వారి నుంచి తప్పించుకున్నారు. అయితే ఆ తరువాత ఆమె ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పదవులను అనుభవిస్తున్నారు తప్ప ఏనాడూ సమైక్యా్రంధ గురించి మాట్లాడిన దాఖలాల్లేవు. గతంలో సీమాంధ్రకు చెందిన మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో సమైక్యాంధ్ర వాణి వినిపించి సస్పెండ్‌కాగా ఝాన్సీ మాత్రం వారికి దూరంగా ఉండి సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకొన్నారు. సమైక్యాంధ్రా ఉద్యమానికి మొదటి నుంచి దూరంగానే ఉం టున్న ఈమె పార్లమెంట్‌లోనూ.... ఉద్యమిస్తున్న సీమాంధ్రా ఎంపీలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కేంద్రం వైఖరిని నిరసిస్తూ పలువురు కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇచ్చారు. ఈ మేరకు నోటీసుపై ఉండవల్లి, లగడపాటి, రాయపాటి, సాయిప్రతాప్, హర్షకుమార్, సబ్బం హరి వంటి పలువురు ఎంపీలు సంతకాలు చేశారు. అయినా ఈ జాబితాలోనూ ఝాన్సీ లేరు. ఎక్కడికక్కడ మాటలు మార్చి పబ్బం గడుపుకోవడమే తప్ప తమకు పదవులిచ్చి గౌరవించిన ప్రజల కోసం కాస్తయినా చేద్దామన్న బాధ్యతను విస్మరించడాన్ని జనం తీవ్రంగా పరిగణిస్తున్నారు. అవిశ్వాస తీర్మానాలపై సంతకాలు చేయని సీమాంధ్రా ఎంపీలను బహిష్కరించాల్సిందిగా ఇప్పటికే ఏపీఎన్జీవోలు పిలుపు నిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి అవకాశవాద నాయకులకు తగిన విధంగా బుద్ధి చెబుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.