కొత్త పార్టీ ప్రభావం ఉండదు: బొత్స ఝాన్సీ | Kiran Kumar Reddy Party not affect, says Botsa Jhansi Lakshmi | Sakshi
Sakshi News home page

కొత్త పార్టీ ప్రభావం ఉండదు: బొత్స ఝాన్సీ

Published Thu, Feb 27 2014 4:15 PM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

కొత్త పార్టీ ప్రభావం ఉండదు:  బొత్స ఝాన్సీ - Sakshi

కొత్త పార్టీ ప్రభావం ఉండదు: బొత్స ఝాన్సీ

బొబ్బిలి: కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టినా.. దాని ప్రభావం పెద్దగా ఉండదని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. బుధవారం ఆమె బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏది చేయడానికైనా హక్కు ఉందన్నారు. అయితే సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున కిరణ్ సీఎం అయ్యారు కనుక దాన్ని గుర్తుపెట్టుకుంటేనే మనుగడ ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం వాల్తేరును రైల్వే జోన్‌గా చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖను రాజధాని చేయాలని, సీమాంధ్రకు విద్య, ఉపాధి, వైద్యం, సాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement