బిహార్లో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు సంబంధించని పోస్టర్లను తొలగించడంపై కాంగ్రేస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఓటమి ఖరారయిందనీ అందుకే పోస్టర్లను తొలగించారని ఆయన శనివారం వ్యాఖ్యానించారు. పోస్టర్లను తొలగించడం ఎన్డీఏ కూటమి ఓడిపోతుందనడానికి సంకేతం అన్నారు.
ఫొటోలతో కూడిన పోస్టర్లు ఉంటే తరువాత ఓటమికి వీరే బాధ్యత తీసుకోవాల్సి వస్తుందనే ఉద్ధేశంతోనే వీటిని తొలగించారని సింఘ్వీ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ నేతలు ఓటమి భయంతోనే పోస్టర్ల తొలగింపు చేపట్టారనీ, ఈ చర్యతో ఓటమి భయం వారి మొహాల్లో కన్పిస్తుందని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ, అమిత్ షాలకు స్వాగతం చెబుతూ పాట్నా ఎయిర్పోర్టు సమీపంలో ఎన్డీఏ నేతలు ఏర్పాటు చేసిన పోస్టర్లపై మహాకూటమి నేతలు ఎలక్షన్ కమీషన్కు పిర్యాదు చేయడంతో వాటిని తొలగించిన సంగతి తెలిసిందే.