అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్)లో చేరాలని బిహార్ యువతను ఆహ్వానిస్తూ పోస్టర్లు వెలువడం కలకలం రేపింది. బిహార్ సహస్రా జిల్లాలోని నౌహట్టా ప్రాంతంలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ముఖాలకు మాస్క్ పెట్టుకున్న ఐసిస్ ఉగ్రవాదుల ఫొటోలు ఈ పోస్టర్లలో ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నౌహట్టాలోని కరెంటు స్తంభాలకు దాదాపు అంటించిన దాదాపు మూడు పోస్టర్లను పోలీసులు గుర్తించారు.