హైదరాబాద్ : సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఓ సామాజిక వర్గం వారి మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టర్లను ముద్రించారని, తక్షణం ఆ పోస్టర్లను తొలగించి సినిమా నుంచి కూడా ఆ దృశ్యాలను తీసేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో యువకులు శనివారం బంజారాహిల్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఈ పోస్టర్లపై ఫిర్యాదు కూడా చేశామని వెల్లడించారు.
రోడామిస్త్రీ కాలనీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాసబ్‌ట్యాంకులోని సెన్సార్‌బోర్డు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. దృశ్యాలు తొలగించకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వందలాదిగా యువకులు బైక్ ర్యాలీతో వెళ్లడంతో బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ర్యాలీ
Published Sat, Jan 9 2016 6:25 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM
Advertisement
Advertisement