బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే పంజాబ్‌లో ఆయన అదృశ్యం అయ్యారంటూ పోస్టర్లు వెలిశాయి. అంతే కాదు సన్నీ డియోల్ ఆచూకీ చెప్పినవారికి రూ.50 వేలు రివార్డు కూడా ప్రకటించారు. సన్నీ డియోల్ అదృశ్యమయ్యారంటూ పోస్టర్లు వేయడం ఇదేమీ మొదటిసారి కాదు. నిజానికి సన్నీ డియోల్ గురుదాస్‌పూర్-పఠాన్‌కోట్ లోక్‌సభ స్థానానికి చెందిన బీజేపీ ఎంపీ. సన్నీడియోల్ ఎంపీ అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పఠాన్‌కోట్ జిల్లాలోని హల్కా భోవాకు చెందిన జనం సర్నా బస్టాండ్‌లో సన్నీ డియోల్ అదృశ్యంపై పోస్టర్లపై అతికించి, అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జిల్లాలోని హల్కా, పఠాన్‌కోట్, సుజన్‌పూర్‌లలో సన్నీ డియోల్ అదృశ్యానికి సంబంధించిన పోస్టర్‌లు కనిపించాయి. ఇంత జరుగుతున్నా సదరు ఎంపీ స్థానికుల బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తన లోక్‌సభ నియోజకవర్గానికి ఎప్పుడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో నిరసనకు దిగిన జనం బస్సులకు ఈ పోస్టర్లను అతికించారు.
ఎంపీగా ఎన్నికయిన తర్వాత సన్నీ డియోల్ తన లోక్‌సభ నియోజకవర్గానికి ఏనాడూ రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారికి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. ప్రజలను మోసం చేయడంలో సన్నీ డియోల్ విజయం సాధించారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డు ఇస్తామని నిరసనకారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో చలి విజృంభణ.. కశ్మీర్‌లో జీరోకు దిగువన ఉష్ణోగ్రతలు!
Comments
Please login to add a commentAdd a comment