Madhya Pradesh: కాబోయే సీఎం.. కాంగ్రెస్‌ కార్యకర్తల అత్యుత్సాహం! | MP Congress Workers Put Up Posters Congratulating Kamal Nath As Next CM | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: కాబోయే సీఎం.. కాంగ్రెస్‌ కార్యకర్తల అత్యుత్సాహం!

Published Sat, Dec 2 2023 7:55 PM | Last Updated on Sat, Dec 2 2023 8:03 PM

MP Congress Workers Put Up Posters Congratulating Kamal Nath As Next CM - Sakshi

భోపాల్‌: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు భోపాల్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం బయట కాబోయే ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు శుభాకాంక్షలు అంటూ పోస్టరు ఏర్పాటు చేశారు.

మధ్యప్రదేశ్‌లో 230 శాసనసభ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది. కాగా గురువారం విడుదలైన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రమే కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపాయి. 

ఎగ్జిట్‌పోల్స్‌తో సంబంధం లేకుండా ఎవరికివారే తమ పార్టీలు గెలుస్తాయని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ప్రకటన చేస్తున్నారు. తమ పార్టీ భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటుందని మధ్యప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించగా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్‌.. తనకు రాష్ట్ర ఓటర్లపై పూర్తి విశ్వాసం ఉందని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement