next cm
-
21 లోక్‌సభ స్థానాల్లో పురుషుల కన్నా ఎక్కువగా నమోదైన మహిళల ఓట్లు
-
రేవంత్.. భట్టి.. ఉత్తమ్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సీఎం అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు పోటీపడుతున్న వారి సంఖ్య సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది. రాజకీయ వర్గాల విశ్లేషణల ప్రకారం.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క (ఖమ్మం), ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరిని చాయిస్‌గా ఎంచుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించగా, తెలంగాణకు పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కూడా ఢిల్లీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రులుంటారా? కర్ణాటక తరహాలో ఉప ముఖ్యమంత్రి పదవులు తెలంగాణలోనూ లభించే అవకాశాలు కనిపిస్తున్నా యి. సీఎంగా ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేస్తారన్న దాన్నిబట్టి మరో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. సీఎం హోదా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఎస్సీ, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి, దళితులకు సీఎం హోదా ఇస్తే రెడ్డి, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో మైనార్టీలకూ ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో మైనార్టీల పక్షాన ఎవరూ విజయం సాధించకపోవడంతో ఉప ముఖ్యమంత్రి హోదా మైనార్టీలకు ఇవ్వాలంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ హోదా ఇవ్వాల్సి ఉండడం గమనార్హం. అమాత్యులెవరంటే...! మంత్రివర్గ కూర్పులో కూడా సామాజిక వర్గాలు, జిల్లాల వారీ లెక్కలు కట్టుకుంటూ తమ నాయకుడికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే చర్చ కీలక నేతల అనుచరుల్లో జరుగుతోంది. కొండా సురేఖ, సీతక్కకు కేబినెట్లో చోటు లాంఛనప్రాయమేనని గాందీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఉత్తమ్ ఒకవేళ తనకు అవకాశం ఇవ్వని పక్షంలో ఇతరుల కేబినెట్లో ఉండేందుకు అంగీకరించకపోతే ఆయన సతీమణి పద్మావతికి మంత్రి పదవి అవకాశం లేకపోలేదు. ఇక, ఆదిలాబాద్ నుంచి ప్రేంసాగర్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మెదక్ నుంచి ఆంథోల్ రాజనర్సింహ, రంగారెడ్డి నుంచి రామ్మోహన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, ఆదివాసీతో పాటు ఎస్టీల్లో లంబాడాలకు కూడా ఇవ్వాలనుకుంటే నేనావత్ బాలూనాయక్, ఆదిలాబాద్ నుంచి వివేక్ బ్రదర్స్‌లో ఒకరికి మంత్రివర్గంలో అవకాశమిస్తారని చర్చ జరుగుతోంది. ఎంపికలో ఇవే కీలకం సీఎం అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం నాలుగైదు కీలకాంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీపై విధేయత, ప్రభుత్వాన్ని నడిపించగల సామర్థ్యం, సామాజిక న్యాయంతో పాటు రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా ప్రచారం నిర్వహించి, సీఎం కేసీఆర్‌పై పోటీచేసి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పేరును అభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించనున్నారు. ఇక, శాసనసభాపక్షం (సీఎల్పి) నాయకుడిగా పనిచేసి, పాదయాత్ర నిర్వహించడం ద్వారా కేడర్‌లో కదలిక తెచ్చి, పార్టీకి విధేయుడిగా ఉంటున్న భట్టి విక్రమార్క పేరునూ సీఎం అభ్యర్థిత్వానికి ప్రతిపాదించనున్నారు. అలాగే, పార్టీలో వివిధ పదవులు నిర్వహించడంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ పేరునూ ఈ జాబితాలో ప్రతిపాదించనున్నారు. వీరిలో ఒకరిని సీఎంగా ఎంపిక చేసే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
Madhya Pradesh: కాబోయే సీఎం.. కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం!
భోపాల్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు భోపాల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బయట కాబోయే ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు శుభాకాంక్షలు అంటూ పోస్టరు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌లో 230 శాసనసభ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది. కాగా గురువారం విడుదలైన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఎగ్జిట్‌పోల్స్‌తో సంబంధం లేకుండా ఎవరికివారే తమ పార్టీలు గెలుస్తాయని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ప్రకటన చేస్తున్నారు. తమ పార్టీ భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటుందని మధ్యప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించగా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్.. తనకు రాష్ట్ర ఓటర్లపై పూర్తి విశ్వాసం ఉందని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. A poster congratulating Kamal Nath and portraying him as the next Chief Minister of Madhya Pradesh has been put up by a Congress worker outside the Congress office in Bhopal. pic.twitter.com/pX41zyoZgg — ANI (@ANI) December 2, 2023 -
‘సీఎం అవుతానని చెప్పలేదే’
యశవంతపుర (కర్ణాటక): తాను సీఎం అవుతానని ఎక్కడా చెప్పలేదని మంత్రి మురుగేశ్ నిరాణి అన్నారు. శుక్రవారం బాగలకోటె జిల్లా బీళగి పట్టణ పంచాయతీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి బొమ్మై సమర్థవంతంగా పని చేస్తున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: వరద బాధితులపై కేంద్రానిది బాధ్యతారాహిత్యం అయితే ఇటీవల మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. మంత్రి మురుగేశ్ నిరాణి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నిరాణికి సీఎం అయ్యే సత్తా ఉందని, బీసీలు, పేదలు, అట్టడుగు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు ఆయన సేవ చేయగలరని కొనియాడారు. నిరాణి సీఎం అవుతారని అనగానే కార్యకర్తలు పెద్దపెట్టున హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
జగన్‌కి జై కొట్టిన ఏపీ
న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా సర్వే వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ పాల నపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న నేపధ్యంలో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వే స్పష్టం చేసింది. సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే జగన్మోహన్రెడ్డికి 43% మంది ఓటేశారు. చంద్రబాబుకు 38%, జనసేన నేత పవన్ కళ్యాణ్‌కు 5% మద్దతిచ్చారు. ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదురోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం సేకరించారు. ఈ సర్వేలో టీడీపీ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతప్తితో ఉన్నట్టు తేలింది. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని, కాబోయే సీఎం జగన్మోహన్రెడ్డి వైపు ఏపీ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏపీలో జగన్‌కు మినహా ఎక్కడా ప్రస్తుత సీఎంల కంటే ప్రతిపక్షనేతకు ఎక్కువ శాతం ఓట్లు రాలేదని వెల్లడైంది. ఈ సర్వేపై శుక్రవారం రాత్రి ఇండియా టుడే ఛానెల్లో ‘పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్దేశాయ్, రాహుల్ కన్వల్ నిర్వహించారు. ఇండియా టుడే సర్వేలో భాగంగా తదుపరి సీఎం ఎవరన్న సూటి ప్రశ్నకు 43% మంది జగన్‌కు అనుకూలంగా ఓటేశారని వారు వెల్లడించారు. 36% చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై బాగాలేదని, 18% ఓ మోస్తరుగా ఉందని స్పష్టం చేశారన్నారు. ప్రజాసంకల్పయాత్ర పేరిట నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా జగన్ భారీగా ప్రజలతో మమేకమవుతున్నారన్నారు. జగన్ వర్సెస్ చంద్రబాబుగా ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. ఈ చర్చలో పాల్గొన్న యాక్సిస్ మై ఇండియా ప్రతినిధి ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు 44.35% ఓట్లు రాగా టీడీపీకి బీజేపీతో కలుపుకుని 46% ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ప్రతిపక్షనేత జగన్‌కి మాత్రమే చంద్రబాబు కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. మిగతా రాష్ట్రాల్లో ప్రతిపక్షనాయకుల కంటే సీఎంలకే ఎక్కువ ప్రజాదరణ ఉందని చెప్పారు. పొలిటికల్ సైంటిస్ట్ సందీప్ శాస్త్రి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పడే అవకాశాలున్నాయన్నారు. ఒకవేళ టీడీపీ–కాంగ్రెస్ పొత్తు కుదిరినా, కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయన్నది అనుమానమేనని, అంతే కాకుండా అక్కడ కాంగ్రెస్ బలం నామమాత్రమేనని అభిప్రాయపడ్డారు. ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కు అనుకూలంగా 44%, మోదీకి 33% మద్దతు పలికినట్టు ఈ సర్వే తెలిపింది. అయితే వచ్చే ఎన్నికల్లో ‘ఏపీకి ప్రత్యేకహోదా’ కీలకంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. -
తదుపరి సీఎం కేసీఆరే!
న్యూఢిల్లీ: అసెంబ్లీని ఎనిమిది నెలల ముందుగానే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల రేసులో ఎవరికీ అందనంత దూరంలో దూసుకుపోతున్నారు. ప్రముఖ ఆంగ్ల వార్తా చానల్ ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియాతో కలిసి చేసిన సర్వేలో.. తదుపరి సీఎంగా కేసీఆర్‌కు 43 శాతం మంది తెలంగాణ ప్రజలు మద్దతు తెలిపారు. కేసీఆర్ తర్వాతి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా, ఆయన తదుపరి సీఎం కావాలని కోరుకుంటున్నట్లు కేవలం 18 శాతం మందే చెప్పారు. పొలిటికల్ స్టాక్ ఎక్సే్చంజ్ పేరుతో తెలంగాణలో అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే జరిగింది. మొత్తంగా 7,110 మంది సర్వేలో పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, నిరుద్యోగం, వ్యవసాయంలో ఇబ్బందులు, నిత్యావసరాల ధరల పెరుగుదల తమకు ప్రధాన సమస్యలుగా ఉన్నాయని తెలంగాణ ప్రజలు వెల్లడించారు. కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు 11% మంది చెప్పారు. కుమారస్వామిపై అసంతృప్తి ఇండియా టుడే– మై యాక్సిస్ ఇండియా కర్ణాటకలోనూ సర్వే చేసింది. అక్కడ ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ పనితీరు బాగుందని 23 శాతం మంది, ఫరవాలేదని 28 శాతం మంది చెప్పగా ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని 35 శాతం మంది కర్ణాటక ప్రజలు వెల్లడించారు. 11,480 మంది కన్నడిగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. తదుపరి ప్రధానిగా 55 శాతం మంది నరేంద్ర మోదీకి, 42 శాతం మంది రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు. తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రత, వ్యవసాయంలో ఇబ్బందులు తమ రాష్ట్రంలో ప్రధాన సమస్యలని సర్వేలో పాల్గొన్న ప్రజలు వెల్లడించారు. కుమారస్వామి సీఎం పదవి చేపట్టి నాలుగు నెలలైనా పూర్తికాకముందే ఆయనపై ఇంతటి వ్యతిరేకత రావడం గమనార్హం. -
ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్తపేరు!
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన నేపథ్యంలో తర్వాతి సీఎం ఎవరనే విషయంపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుతం రవాణా, నీటి సరఫరా మంత్రిగా పనిచేస్తున్న విజయ్ రూపాని పేరు బలంగా వినిపిస్తోంది. 2017లో గుజరాత్ శాసనసభకు ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేడర్ పై పట్టుకలిగిన రూపానికే పగ్గాలు అప్పజెప్పాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. కేవలం కేడర్ పై పట్టే కాక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు రూపాని అంటే అమితమైన ఇష్టం. పటీదార్లు డామినేట్ చేసే సౌరాష్ట్రా రీజియన్ లోని రాజ్ కోట్ నుంచి ఆయన ఎమ్మెల్యే గా గెలుపొందారు. పటీదార్ ఉద్యమం, దళితుల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అన్నింటికీ సమర్ధుడైన నాయకుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సీనియర్ బీజేపీ లీడర్ ఒకరు తెలిపారు. అంతేకాకుండా రూపాని.. అమిత్ షా తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. గుజరాత్ లో ఈబీసీలకు 10శాతం కోటాను ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కాకుండా రూపాని ప్రకటించడమే ఇందుకు ప్రత్యక్షసాక్ష్యం. వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాల ప్రధానిని కలిసినట్లు సమాచారం. దీంతో ఆయన కూడా సీఎం రేసులో ఉన్నట్లు వాదనలు వినపిస్తున్నాయి. కద్వా కులానికి చెందిన రూపాలను పార్టీ ఉనా ఘటనలో దళితులను పరామర్శించేందుకు పంపింది. కానీ రూపాలను రాజ్యసభకు పంపేందుకు పార్టీ మొగ్గుచూపుతున్నట్లు ఉండటంతో ఆయనకు సీఎం పదవి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
3 గం.లకు మెహబూబా ప్రమాణ స్వీకారం