మహారాష్ట్రకి ఒకసారి ముఖ్యమంత్రిగా పని చేసి.. మరోసారి అధికారం అంచుల దాకా తీసుకెళ్లి.. చివరకు పార్టీ కోసం సీఎం పదవిని సైతం త్యాగం చేశాడన్న పేరు ఉంది దేవేంద్ర ఫడ్నవిస్‌కు. మహారాష్ట్ర ఫలితాల వేళ.. సీఎం రేసులో మొదట వినిపించిన పేరు ఈయనదే. అలాగే.. ఈయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లోకే వచ్చింది.
‘‘నా నుంచి బొట్టుగా నీరుపడుతోందని.. ఇల్లు కట్టుకోవాలని చూడకండి. నేనొక మహాసముద్రాన్ని.. కచ్చితంగా తిరిగి వస్తా.. అంటూ అసెంబ్లీలో ఆయన మాట్లాడిన ఐదేళ్ల కిందటి నాటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
महाराष्ट्र चुनाव के नतीजों के बाद ये वीडियो आज चर्चा में हैं
ठीक 5 साल पहले देवेंद्र फड़नवीस ने कहा था:
मेरा पानी उतरता देख
मेरे किनारे पर घर मत बसा लेना
मैं समंदर हूँ
लौटकर वापस आऊँगा#DevendraFadnavis Aditya Thackeray #महाराष्ट्र संजय राउत Ajit Pawar EVMS #ToxicTheMovie pic.twitter.com/KQNhzdalrg— political voices (@politicvoices_) November 23, 2024
‘‘కచ్చితంగా మావాడే సీఎం అవుతాడు. అందులో ఎలాంటి అనుమానాలే అక్కర్లేదు. తను 24 గంటలు నిద్రాహారాలు మానేసి కూటమి విజయం కోసం కృషి చేశాడు. ఈ ప్రయాణంలో కోట్లమంది అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదం అతనికి ఉంది’’ అంటూ ఫడ్నవిస్ తల్లి సరిత అంటున్నారు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. సోలోగానే బీజేపీ 100కిపైగా సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ అంచనాకు తగ్గట్లు.. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ చెబుతున్నారు. రేపు ఢిల్లీ నుంచి పార్టీ పరిశీలకులు వస్తారని, 25న మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం జరగనుందని చెప్పారాయన. ఆ ప్రకటన వెలువడిన వెంటనే.. ఫడ్నవిస్ అనుచరులు టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment