సాక్షి,శివాజీనగర(కర్ణాటక): బస్సుల్లో చిల్లర డబ్బు కోసం కండక్టర్‌ను ప్రయాణికులు అడగడం, కొన్నిసార్లు గొడవ జరగడం అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో కూడా ఈ ఉదంతాలు నవ్విస్తాయి. చిల్లర ఇవ్వాల్సిందేనని ప్రయాణికులు కండక్టర్లపై ఒత్తిడి తెస్తుండడాన్ని అరికట్టడానికి వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ వివాదాస్పద పోస్టర్‌లను బస్టాండ్‌లలో అతికించింది. సంస్థ ఏకపక్ష ధోరణిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఆ పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంతకీ పోస్టర్లో ఏముందంటే.. బస్సుల్లో చిల్లర అడగడం ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడమే అవుతుంది. నేరం రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది అని పోస్టర్లో హెచ్చరిక ఉంది. చిల్లర అడిగితే జైలుకు పంపుతారా, ఇదెక్కడి చోద్యం అని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment