మావోయిస్టుల పోస్టర్లు ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో కలకలం రేపాయి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రజా ప్రతినిధుల అంతు చూస్తామని మావోయిస్టుల పేరిట రాసి ఉన్న పోస్టర్లు ఆదిలాబాద్ లో వెలిసాయి. పట్టణంలోని రైల్వే బ్రిడ్జి, ఎన్టీఆర్ చౌరస్తా, పెంచుకల్‌పేట్ చౌరస్తా ప్రాంతాల్లో వెలిసిన మూడు పోస్టర్లలో అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని.. ఎంతటి అధికారి అయినా.. ప్రజప్రతినిధి అయినా ఉపేక్షించబోమని అందులో హెచ్చరించారు. కాగా.. పోస్టర్ల విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని తొలగించారు.