న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆప్ గురువారం నుంచి దేశవ్యాప్త ప్రచారం ప్రారంభించింది. మోదీ హటావో, దేశ్ బచావో అనే నినాదంతో ప్రాంతీయ భాషల్లో ముద్రించిన పోస్టర్లు, బ్యానర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ గోపాల్ రాయ్ చెప్పారు. ప్రధాని మోదీ, బీజేపీ ఇచ్చిన అమలు కాని హామీల గురించి ప్రజలకు తెలియజెప్పడమే తమ ఉద్దేశమన్నారు.
హామీలను నెరవేర్చకపోగా, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ మేరకు ఇప్పటికే పోస్టర్లు, బ్యానర్లను 22 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు కూడా అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 10వ తేదీ నుంచి అన్ని యూనివర్సిటీల్లోనూ ఇటువంటి పోస్టర్లు, బ్యానర్లనే ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment