Gopal Rai
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీఎం నివాసంలో ఆప్ ఎమ్మెల్యేలందరూ గురువారం సమావేశమయ్యారు. అనంతరం గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని తెలిపారు. ఆప్ మంత్రి గోపాల్ రాయ్కాగా ఢిల్లీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ భారీ విజయాలను నమోదు చేసింది. బీజేపీ వరుసాగా మూడు, ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. ఇక ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 13 ఎస్సీ రిజర్వ్డ్గా కేటాయించారు. అలాగే ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటరీ నిమోజకవర్గంలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇదిలా ఉండగా ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏడు స్థానాలకు గానూ ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడుచోట్ల పోటీ చేశాయి. -
ఢిల్లీలో మళ్లీ సరి–బేసి విధానం
న్యూఢిల్లీ: ప్రజారోగ్యానికి గొడ్డలిపెట్టులా మారిన కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో మళ్లీ సరి–బేసి విధానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకూ సరి–బేసి విధానం అమలు చేయనున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం ప్రకటించారు. నవంబర్ 20 తర్వాత ఈ విధానాన్ని పొడిగించే అంశంపై అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వాయు నాణ్యత తగ్గిపోవడం, కాలుష్యం వల్ల చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే 8వ తరగతి వరకూ ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించాలని సూచించారు. బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే పది, పన్నెండో తరగతి విద్యార్థులకు మినహాయింపు ఉంటుందన్నారు. -
ఢిల్లీకి ‘గాలాడటం’ లేదు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు నాణ్యత ఈ సీజన్లో మొదటిసారిగా ఆదివారం ‘వెరీ పూర్’ స్థాయికి పడిపోయింది. శనివారం 248గా ఉన్న సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 24 గంటల వ్యవధిలో 313కు పడిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణ మని అధికారులు చెబుతున్నారు. దాంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ సోమవారం సంబంధిత శాఖలతో సమీక్ష జరపనున్నారు. ప్రైవేటు వాహనాల రాకపోకలను వీలైనంతగా తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయతి్నస్తోంది. ఇందులో భాగంగా పార్కింగ్ ఫీజులు పెంచడం వంటి చర్యలు చేపట్టింది. హోటళ్లలో తందూరీ పొయ్యిలపై నిషేధం విధించింది. సీఎన్జీ, ఎలక్రి్టక్ బస్సుల వినియోగాన్ని, మెట్రో రైలు సరీ్వసుల సంఖ్యను పెంచాలని కోరింది. ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలోపలున్న కాలుష్య కారఖ పారిశ్రామిక యూనిట్లు, ధర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణాలు జరుగుతున్న, కూలి్చవేత ప్రాజెక్టులు చేపట్టిన చోట్ల దుమ్ము రేగకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
మోదీపై ఆప్ దేశవ్యాప్త పోస్టర్ ప్రచారం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆప్ గురువారం నుంచి దేశవ్యాప్త ప్రచారం ప్రారంభించింది. మోదీ హటావో, దేశ్ బచావో అనే నినాదంతో ప్రాంతీయ భాషల్లో ముద్రించిన పోస్టర్లు, బ్యానర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ గోపాల్ రాయ్ చెప్పారు. ప్రధాని మోదీ, బీజేపీ ఇచ్చిన అమలు కాని హామీల గురించి ప్రజలకు తెలియజెప్పడమే తమ ఉద్దేశమన్నారు. హామీలను నెరవేర్చకపోగా, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ మేరకు ఇప్పటికే పోస్టర్లు, బ్యానర్లను 22 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు కూడా అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 10వ తేదీ నుంచి అన్ని యూనివర్సిటీల్లోనూ ఇటువంటి పోస్టర్లు, బ్యానర్లనే ఏర్పాటు చేస్తామన్నారు. -
బాణసంచా కొన్నా, కాల్చినా 6 నెలల జైలు!
న్యూఢిల్లీ: దీపావళి పండుగ అంటేనే బాణసంచా ఉండాల్సిందే. అయితే, పండుగకు ముందు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం దృష్ట్యా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటంపై నిషేధం విధించింది. ఫైర్‌క్రాకర్స్ కొనుగోలు చేసినా, కాల్చినా రూ.200 జరిమానా విధించటంతో పాటు.. 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియా సమావేశంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటన చేశారు. బాణసంచా తయారీ, నిలువ, విక్రయాలు జరపటం నేరమని తెలిపారు. అందుకు రూ.5000 వరకు జరిమానా, పేలుడు పదార్థాల సెక్షన్ 9బీ ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అక్టోబర్ 21న ‘ దీపాలు వెలిగించండి.. పటాకలు కాదు’ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు రాయ్. వచ్చే శుక్రవారం సెంట్రల్ పార్క్ వద్ద 51వేల దీపాలు వెలిగిస్తున్నామని చెప్పారు. ‘ఫైర్‌క్రాకర్స్ కొనుగోలు చేయటం, కాల్చటం చేస్తే రూ.200 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తాం. ’ అని స్పష్టం చేశారు. నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఫైర్‌క్రాకర్స్ తయారు చేయటం, విక్రయించటం సహా అన్నింటిపై జనవరి 1 వరకు నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం. అందులో దీపావళికి సైతం ఎలాంటి మినహాయింపునివ్వలేదు. గత రెండేళ్లుగా ఇదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. Hon’ble Environment Minister Sh. @AapKaGopalRai Addressing an Important Press Conference | LIVE https://t.co/MgY2RNnCzv — AAP (@AamAadmiParty) October 19, 2022 ఇదీ చదవండి: మోడ్రన్ కృష్ణుడు.. తన మ్యూజిక్‌తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్ -
ఆప్ ఈవెంట్‌ను హైజాక్ చేసిన మోదీ! రాత్రికి రాత్రే ఏం జరిగింది?
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించాల్సిన ఓ కార్యక్రమాన్ని కేంద్రం హైజాక్ చేసిందని ఆరోపించారు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్. రాత్రికి రాత్రే పోలీసులు రంగంలోకి దిగి స్టేజీపై నరేంద్ర మోదీ పోస్టర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమాన్ని కాస్తా.. రాజకీయ కార్యక్రమంగా మార్చారని విమర్శించారు. ఈమేరకు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. 'కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సం కార్యక్రమం ఆదివారంతో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ హాజరుకావాల్సి ఉంది. కానీ ఏమైందో తెలియదు. శనివారం రాత్రి అనూహ్యంగా ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి స్టేజీపై మొత్తం మోదీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. వాటిని తొలగిస్తే అరెస్టు చేస్తామని బెదిరించారు.' అని గోపాల్ రాయ్ పేర్కొన్నారు. పోలీసులు ఉంది ప్రజలకు భద్రత కల్పించడానికి గానీ, ప్రధాని మోదీ కోసం బ్యానర్లు కట్టేందుకు కాదని ధ్వజమెత్తారు. Delhi Govt के वन महोत्सव में CM @ArvindKejriwal को शामिल होना था लेकिन प्रधानमंत्री कार्यलय के आदेश पर Police ने मंच पर कब्ज़ा कर ज़बरदस्ती Modi जी की तस्वीर लगा दी और हटाने पर गिरफ़्तारी की धमकी दी मोदी जी दिल्ली Govt के कायर्क्रम में अपनी तस्वीर लगाकर क्या साबित करना चाहते? pic.twitter.com/B3Hdo5KCLr — AAP (@AamAadmiParty) July 24, 2022 ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు గోపాల్ రాయ్. ఇప్పటికే తమ నేత సత్యేంద్ర జైన్‌పై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కూడా కుట్ర జరుగుతోందని అన్నారు. సీఎం కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు వెళ్లకుండా అధికారిక ప్రక్రియ నిలివేశారని విమర్శించారు. చదవండి: 'ఆ రెస్టారెంట్ స్మృతి ఇరానీ కూతురిదే.. ఇదిగో సాక్ష్యం' -
కాళ్లపై పడేందుకైనా సిద్ధం..: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ)కి పలు విధులు, అధికారాలను కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును వెనక్కు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఆ బిల్లు ఉపసంహరణ కోసం ఏం చేయడానికైనా, అవసరమైతే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాళ్లపై పడేందుకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆ ‘గవర్న్మెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్ (జీఎన్సీటీడీ)’ను వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఎల్జీకి అపరిమిత అధికారాలిచ్చే ఆ సవరణ బిల్లు చట్టరూపం దాలిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘ఎన్నికలకు, ఓట్లకు, మేం గెల్చుకున్న 62 స్థానాలకు అర్థం లేదా?’ అని ప్రశ్నించారు. బిల్లును వెనక్కు తీసుకోవాలని, రాష్ట్ర ప్రజలను మోసం చేయవద్దని కేంద్రాన్ని అభ్యర్థించారు. ‘ఢిల్లీలో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు, రాష్ట్ర ప్రజల అధికారాన్ని నిలబెట్టేందుకు అవసరమైతే.. ఈ బిల్లును నిలిపేయాలని కోరుతూ వారి కాళ్లపై పడేందుకు సిద్ధమే’నన్నారు. తన ప్రభుత్వాన్ని బలహీన పర్చే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆప్ గెలుపును చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే ఈ బిల్లును తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ చట్టం ద్వారా ఢిల్లీ రాష్ట్రంలోకి దొడ్డిదారిన ప్రవేశించాలని బీజేపీ అనుకుంటోందని ఆప్ నేత గోపాల్ రాయ్ ఆరోపించారు. ధైర్యముంటే ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి చూపాలని సవాలు విసిరారు. ఈ బిల్లును సోమవారం కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ‘ఢిల్లీ అసెంబ్లీ చేసే ప్రతీ చట్టానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనే అర్థం’ అని ఈ బిల్లు నిర్దేశిస్తుంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి కార్యనిర్వాహక నిర్ణయంపై అయినా ముందుగా ఎల్జీ అభిప్రాయం తీసుకోవడం తప్పని సరి అని ఆ బిల్లులో పొందుపర్చారు. చదవండి: 3 కోట్ల రేషన్ కార్డుల తొలగింపా.. సుప్రీం కోర్టు ఆగ్రహం -
ఢిల్లీలో కేవలం ‘గ్రీన్’ దీపావళి
న్యూఢిల్లీ: దీపావళి పండుగని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కేవలం గ్రీన్ దీపావళి మాత్రమే జరుపుకోవాలని ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే ఢిల్లీలో తయారు చేసి, అమ్మాలని మంత్రి బుధవారం చెప్పారు. మరోవైపు ఈ ఏడాది టపాసులకి వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నవంబర్ 3 నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టుగా గోపాల్ రాయ్ వెల్లడించారు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రజలెవరూ టపాసులు కాల్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఏడాది దీపావళి టపాసులు పేల్చడం, పంట వ్యర్థాల దహనం కారణంగా ఢిల్లీ కాలుష్యం బారిన పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఈ సారి టపాసులకి దూరంగా ఉండాలన్నారు. -
ఆమ్ ఆద్మీ పార్టీ.. మరో ముందడుగు!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతవిజయం అందుకుని ఉత్సాహంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ విస్తరణలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆప్ పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ శుక్రవారం వెల్లడించారు. తొలుత మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. సానుకూల జాతీయవాదంతో పార్టీని విస్తరించేందుకు ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేవిధంగా కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. పార్టీలో చేరాలనుకునే వారెవరైనా 9871010101 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చని చెప్పారు. ఈనెల 16న రామ్‌లీలా మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆహ్వానం పంపించినట్లు గోపాల్ రాయ్ వెల్లడించారు. ప్రధాని హాజరయ్యేదీ లేనిదీ తెలియదన్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రజలు హాజరు కావాలని పత్రికల ద్వారా కేజ్రీవాల్ ఆహ్వానం పంపించారు. (చదవండి: 24 గంటల్లో 11 లక్షల కొత్త సభ్యులు) -
పారదర్శకతను పక్కన పెట్టిన ‘ఆప్’
సాక్షి, న్యూఢిల్లీ : పలు ఉన్నత ఆశయాలతో ప్రజల ముందుకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుత ఎన్నికల రాజకీయ రంగంలో వాటిని నిలబెట్టుకోలేక ఒక్కొక్కదాన్ని వదిలేస్తూ వస్తోంది. ఈ వైఖరి నచ్చక ఉన్నత ఆశయాలతో పార్టీలోకి వచ్చిన వారు ఒక్కొక్కరే పార్టీకి దూరం కూడా అవుతున్నారు. ముందుగా పార్టీ వెబ్సైట్లో పార్టీకి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను పెట్టిన ఆప్ ఆ తర్వాత వాటిని తొలగించింది. తమ పార్టీకి విరాళాలిచ్చిన భారతీయులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధిస్తున్న కారణంగా వారి వివరాలను వెబ్సైట్లో పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకుడు, ఢిల్లీ కార్మిక మంత్రి గోపాల్ రాయ్ మీడియాకు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా ఇందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. ‘ఈ విషయంలో బీజేపీ నుంచి వేధింపులు ఉన్నాయనడం అబద్ధం. వాస్తవానికి పార్టీతోపాటు దాతలు కూడా వారి పేర్లను వెబ్సైట్ ద్వారా వెల్లడించాలనే కోరుకుంటున్నారు. ఆ సమాచారాన్ని ప్రజలు నేరుగా వీక్షించేందుకు వీలుండాలిగానీ దుర్వినియోగం చేయడానికి వీలు ఉండకూడదు. అయితే అందుకు వెబ్‌సైట్‌ను మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. దానికి బ్రాండ్ విడ్త్ సరిపోవడంలేదు. మా సాంకేతిక బృందం సాంకేతిక పరిష్కారం కనుగొనే పనిలో ఉన్నారు. పార్టీ దాతల వివరాలను ఎలాగూ ఎన్నికల కమిషన్‌కు ఇస్తాం కదా!. 98 శాతం దాతలు తెల్సిన వారే’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశాక దాతల వివరాలను మళ్లీ వెబ్సైట్లో పెడతామన్నట్లుగా ఆయన మాట్లాడారు. 2016 సంవత్సరంలో కూడా డోనర్ల పేర్లను ఆప్ వెబ్సైట్లో పెట్టి ఆ తర్వాత తొలగించింది. ఆ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మళ్లీ దాతల పేర్లను పెట్టింది. ఈసారి అలాంటి స్పందన ఉంటుందా అన్నది అనుమానమే! 2014–15 ఆర్థిక సంవత్సరానికి పార్టీకి అందిన వాస్తవ వివరాలకు, ఆదాయం పన్ను శాఖకు సమర్పించిన వివరాలకు పొంతన కుదరడం లేదంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ఇచ్చిన నివేదికను పురస్కరించుకొని ఎన్నికల కమిషన్ వారం క్రితం అంటే, సెప్టెంబర్ 11వ తేదీనే ఆప్ పార్టీకి నోటీసు ఇవ్వడం, 20 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా అందులో కోరడం గమనార్హం. వచ్చిన మొత్తం విరాళాల్లో 13 కోట్ల రూపాయలను ఆప్ తక్కువ చేసి చూపించిందన్నది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆరోపణ. బోర్డే ఆదాయాన్ని లెక్కించడంలో తప్పు చేసిందని, తాము సమర్పించిన రిటర్న్స్‌లో అంకెలు సరిగ్గా ఉండగా, ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటీసులోనే తప్పుడు అంకెలు ఉన్నాయంటూ ఆప్ పార్టీ అధికార పార్టీ ప్రతినిధులు సమర్థించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై కక్షగట్టడం వల్లనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమను వేధిస్తున్నాయని వారంటున్నారు. ప్రాంతీయ పార్టీలకు వస్తున్న విరాళాలను, అవి ప్రభుత్వ విభాగాలకు సమర్పిస్తున్న రిటర్న్స్‌ను ‘ది అసోసియేషన్ ఆఫ్ ది డెమోక్రటిక్ రిఫామ్స్’ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికీ ఈ విషయంలో పారదర్శకతను పాటిస్తుండగా, ఎక్కువ పార్టీలు పాటించడం లేదని సంస్థ సహ వ్యవస్థాపకుడు, బెంగళూరులోని ఐఐఎం ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్త్రి తెలిపారు. 2016–2017 సంవత్సరానికి ఆదాయం పన్ను శాఖ నివేదిక ప్రకారం ఆప్ పార్టీ ఆదాయం 30.8 కోట్ల రూపాయలు. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తిగత విరాళాలు, పార్టీ కార్యకర్తల నుంచి వచ్చినట్లు ఆ పార్టీ చూపించిన విరాళాలు 24.7 కోట్ల రూపాయలు. రెండింటి మధ్య వ్యత్యాసం 6.1 కోట్ల రూపాయలు. వాటిలో వ్యక్తుల నుంచి వచ్చిన విరాళాల మొత్తం 20.8 కోట్ల రూపాయలు కాగా, కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన విరాళాలు 3.8 కోట్ల రూపాయలు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు 20 వేల రూపాయలకు మించి వచ్చిన విరాళాల వివరాలను విధిగా వెల్లడించాలి. కానీ ఈరోజుల్లో చాలా రాజకీయ పార్టీలు పారదర్శకంగా వ్యవహరించడం లేదని శాస్త్రి ఆరోపించారు. నేడు అన్ని రాజకీయ పార్టీలు విరాళాలు వచ్చిన సోర్స్ వెల్లడించకుండా దాచాలని కోరుకుంటున్నాయని, అంటే అందులో దాచాల్సిన అంశమేదో కచ్చితంగా ఉన్నట్లేనని, ఏదిఏమైనా పారదర్శకత అత్యవసరమని డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థ వ్యవస్థాపకులు, అహ్మదాబాద్‌లోని ఐఐఎం మాజీ డీన్ జగధీప్ ఛోకర్ వ్యాఖ్యానించారు. అంటే, ఆప్ పార్టీ కూడా విరాళాల సోర్స్‌ను వెల్లడించకుండా ఏదో దాచేందుకు ప్రయత్నిస్తుందన్నది సుస్పష్టం. -
‘సీఎం శివగామి, రాయ్ కట్టప్ప’
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి నేత కుమార్ విశ్వాస్ మరోసారి పార్టీ కన్వీనర్ గోపాల్ రాయ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో ఎమ్మెల్యే అమానుతుల్లాను లక్ష్యంగా చేసుకొన్న గోపాల్ రాయ్ ఇప్పుడు తనపై అదే విధంగా కక్షకట్టారని విమర్శించారు. బాహుబలి-2 సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గోపాల్ రాయ్‌కు సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. సినిమాలో శివగామి దేవి తనకు ఎవరైనా ఎదురుతిగితే అంతం చేయడానికి కట్టప్పను ఉసిగొల్పుతుందని, చివరకు కొడుకు బాహుబలిని కూడా చంపేయిస్తుందని, ఇప్పుడు పార్టీలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉందని కుమార్ విశ్వాస్ అన్నారు. అధిస్థానానికి ఎదురు తిరిగితే తమ పార్టీ అధినేత కేజ్రీవాల్, తిరుగుబాటుదారులపై గోపాల్‌రాయ్ అనే కట్టప్పను ప్రయోగిస్తారని దుయ్యబట్టారు. పార్టీలోని చాలామంది కార్యకర్తలు తనని రాజ్యసభ సభ్యుడిగా చూడాలనుకున్నారని, ఈ విషయంపై పార్టీలో ఎన్నిక కూడా నిర్వహించాలని సూచించానని అన్నారు. కానీ తన మాటను పార్టీ పక్కన పడేసిందని, కావాలనే వ్యాపార వేత్త సుశీల్ గుప్తా, చార్టెడ్ అకౌంటెంట్ ఎన్డీ గుప్తా, పార్టీ నేత సంజయ్ సింగ్‌లను పార్టీ ఎంపిక చేసిందని విమర్శించారు. ఇది పార్టీలో నిజాలు మాట్లాడినందుకు దక్కిన ఫలితం అన్నారు. ఇది తన బలిదానంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అయితే దీనిపై పార్టీ సీనియర్ నేత స్పందించారు. గోపాల్ రాయ్‌పై కుమార్ విశ్వాస్ ఆరోపణలు చేసినప్పటికీ ఆయన్ను పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసిందని అన్నారు. ఒకవేళ పార్టీ కుమార్‌ను నిర్లక్ష్యం చేస్తే రాజస్తాన్ ఎన్నికల ఇన్చార్జ్గా విశ్వాస్ను ఎందుకు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారు. ఇక రాజ్యసభ ఎన్నికల విషయానికి వస్తే శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసింది. 8 వరకూ నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంది. జనవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. -
అల్కా లంబా అధికార ప్రతినిధి హోదాపై వేటు
న్యూఢిల్లీ: ఎమ్మెల్యే అల్కా లంబా అధికార ప్రతినిధి హోదాపై ఆమ్ ఆద్మీ పార్టీ రెండు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధికార పార్టీ ప్రతినిధి హోదా నుంచి ఆమెను రెండు నెలలపాటు తప్పిస్తూ ఆప్ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా రవాణా శాఖమంత్రి పదవి నుంచి గోపాల్ రాయ్ తప్పుకున్న నేపథ్యంలో రిలీవ్ అయ్యారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక తన సస్పెన్షన్‌పై అల్కా లంబా స్పందిస్తూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఒకవేళ తెలియక తప్పుగా మాట్లాడి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటానని ఆమె ట్విట్ చేశారు. కాగా ఢిల్లీ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ రెండు రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. దీంతో గోపాల్ రాయ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో మంత్రి సత్యేంద్ర జైన్‌కు అప్పగించారు. కాగా బస్సుల కుంభకోణంలో గోపాల్ రాయ్ పై ఆరోపణలు రాగా దీనిపై విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
రవాణా శాఖ మంత్రి రాయ్ రాజీనామా
న్యూఢిల్లీ: ఆరోగ్య కారణాల దృష్ట్యా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల కిందట అనారోగ్యంతో సర్జరీ చేయించుకున్న రాయ్ ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. గత శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసి బాధ్యతల నుంచి తప్పించాలని కోరిన ఆయన రాజీనామాను సమర్పించారు. రాయ్ స్థానంలో ఢిల్లీ పబ్లిక్ వెల్త్ అండ్ డెవలప్ మెంట్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను బాధ్యతలు తీసుకున్నారు. కాగా, యాప్ బేస్డ్ ప్రీమియం బస్ సర్వీసెస్ లో అవినీతి ఆరోపణలు వచ్చిన కొద్ది రోజుల్లోనే రాయ్ రాజీనామా చేశారు. దీనిపై బీజేపీ నేత విజేందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కి ఫిర్యాదు చేశారు. ప్రీమియం బస్ సర్వీసెస్ లో నియమాల ఉల్లంఘనతో పాటు అవినీతి జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బస్ సర్వీసుల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని రాయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
15తో 'సరి-బేసి'కి తెర...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ విధానాన్ని ఈ నెల 15వ తేదీతో ముగిస్తామని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానాన్ని పొడిగించే ఆలోచన లేదని తెలిపింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా రోజు విడిచి రోజు వాహనాలను రోడ్లకు మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న ఈ విధానాన్ని 15 తేదీ వరకు కొనసాగించాలని మొదట నిర్ణయించారు. 15 తర్వాత ఈ విధానంపై సమీక్ష నిర్వహిస్తామని ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్‌రాయ్ శనివారం తెలిపారు. అయితే ఈ విధానాన్ని మరింతకాలం పొడిగించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 15 రోజలకు మించి కూడా ఈ విధానాన్ని పొడిగించవచ్చునని కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఢిల్లీ వాయుకాలుష్యం తగ్గి వాతావరణ పరిస్థితులు మెరుగయ్యే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని కొనసాగిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 'సరి-బేసి' విధానం వల్ల ఇప్పటికే 5893 మందికి చలాన్లు విధించారు. ఈ నేపథ్యంలోనే ఈ విధానం ప్రయోగాత్మక అమలును ఈ నెల 15తో చాలించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.