న్యూఢిల్లీ: ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీఎం నివాసంలో ఆప్ ఎమ్మెల్యేలందరూ గురువారం సమావేశమయ్యారు. అనంతరం గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని తెలిపారు.
ఆప్ మంత్రి గోపాల్ రాయ్
కాగా ఢిల్లీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ భారీ విజయాలను నమోదు చేసింది. బీజేపీ వరుసాగా మూడు, ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. ఇక ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 13 ఎస్సీ రిజర్వ్‌డ్‌గా కేటాయించారు.
అలాగే ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటరీ నిమోజకవర్గంలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇదిలా ఉండగా ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏడు స్థానాలకు గానూ ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడుచోట్ల పోటీ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment