banners
-
గాలి భానుప్రకాష్ అతి.. ఓట్ల లెక్కింపునకు ముందే..!
నగరి: నగరి నియోజకవర్గం పుత్తూరులో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపు జరగముందే తానే ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయించారు. కొందరు దీన్ని చూసి అంత తొందరేల భానూ.. అంటూ నవ్వుకున్నారు. ఇందంతా ఒక పథకం ప్రకా రం రెచ్చగొట్టడమేనని భావిస్తున్నారు. నేర చరిత కలిగిన వారిని జనంలోకి రప్పించడం.. గతంలో గంజాయి సరఫరా జరిగిందని ప్రచారం జరిగిన ప్రాంతంలో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభించడం ఏంటని చర్చించుకుంటున్నారు. అది బ్యాడ్మింటన్ కోర్టు కాదు.. విధ్వంస కుట్రలకు కేంద్రంగా చేసుకున్నారని అనుమానిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కమిషన్‌కు కనబడలేదా అని జనం ప్రశి్నస్తున్నారు.ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది టీడీపీ నేతల పరిస్థితి. ఓట్ల లెక్కింపు జరగలేదు. గెలుస్తారో లేదో కూడా తెలియదు. నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అంటూ పుత్తూరు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం హాస్యాస్పదంగా మారింది. ఇదేం విడ్డూరం అంటూ జనం నవ్వుకుంటున్నారు.బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవంలో గాలి భానుప్రకాష్పుత్తూరు మున్సిపాలిటీ చింతలగుంటలో గతంలో బీఎస్ జిమ్ నిర్వహించేవారు. ఏడాది క్రితం ఈ జిమ్ నిర్వాహకుడు టీడీపీ నేత హరి విశాఖపట్నం అరకు వద్ద గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత ఆ జిమ్ నిరుపయోగంగా మారింది. ఈ జిమ్ నుంచే గంజాయి సరఫరా జరిగేదంటూ అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అనంతరం ప్రచారాల్లోను, పలు కార్యక్రమాల్లోను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్తో పాటు గంజాయి స్మగ్లర్, అతని అనుచరులు పాల్గొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. వివాదాలకు చిరునామాగా ఉన్న వీరంతా తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నిరుపయోగంగా ఉన్న జిమ్‌ను బ్యాడ్మింటన్ కోర్టుగా మార్చి ఎన్ని కల కోడ్ ఉండగానే టీడీపీ అభ్యరి్థతో ప్రారం¿ోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో భానుప్రకాష్ ఎమ్మెల్యే, నగరి అంటూ ముద్రించి ప్రదర్శనగా ఉంచారు.కోడ్ వర్తించదా? ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల నిబంధనలు వర్తించవా అంటూ నగరి నియోజకవర్గ ప్రజలు ప్రశి్నస్తున్నారు. బహిరంగంగా ఒక అభ్యర్థి ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రారం¿ోవాలు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రెచ్చగొట్టి విధ్వంసాలకు పాల్పడేందుకేనా?ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే పుత్తూరు టీడీపీ నాయకుల దుశ్చర్యను చూసి వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రాజకీయ పారీ్టలను రెచ్చగొట్టి.. గొడవలు సృష్టించి విధ్వంసాలకు పాల్పడేందుకే పథకం వేశారని స్థానికులు భయపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకే నేరచరిత కలిగిన వారిని టీడీపీ నాయకులు జనంలోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. -
‘ఆ ఎమ్మెల్యే కామ పిశాచి’.. హైదరాబాద్‌లో ఫ్లెక్సీల కలకలం..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వెలసిన ఫ్లైక్సీలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టడంతో సంచలనంగా మారింది. దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుంచి బెల్లంపల్లి ప్రజలను కాపాడండి అంటూ ఆరిజన్ డెయిరీ పేరుతో ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. ‘‘కేసీఆర్, కేటీఆర్, మీడియా సంస్థలకు విన్నపం. మాకు న్యాయం చేయాలి’’ అని ప్లెక్సీలో ఉంది. ఎమ్మెల్యేపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్ పాల సంస్థ భాగస్వామి శైలజ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆడియో -
సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి సీఎం ఎంపికపైనే ఉంది. సీనియర్ లీడర్ సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లలో అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎవరిని ఖరారు చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఇద్దరి నేతల అభిమానులు మాత్రం పోస్టర్ల వార్‌కు దిగారు. తమ నేతనే సీఎంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ డీకే ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అటు సిద్ధరామయ్య మద్దతుదారులు కూడా తమ నేతనే సీఎంగా ప్రకటించాలని ఆయన నివాసం బయట పోస్టర్లు కట్టారు. దీంతో అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. #WATCH | Karnataka Congress President DK Shivakumar's supporters put up a poster outside his residence in Bengaluru, demanding DK Shivakumar to be declared as "CM" of the state. pic.twitter.com/N6hFXSntJy — ANI (@ANI) May 14, 2023 #WATCH | Supporters of senior Congress leader Siddaramaiah put up a poster outside Siddaramaiah's residence in Bengaluru, referring to him as "the next CM of Karnataka." pic.twitter.com/GDLIAQFbjs — ANI (@ANI) May 14, 2023 మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. పోస్టర్లు, బ్యానర్లు కట్టినంత మాత్రాన వారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయరని పేర్కొన్నారు. అధిష్టానమే అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని సీఎం ఎవరనేదని ఖరారు చేస్తుందని వ్యాఖ్యానించారు. కాగా.. సీఎం ఎంపిక కోసం కర్ణాటక శాసనసభ పక్షం బెంగళూరులో సమావేశమైంది. ఈ భేటీకి ఏఐసీసీ పరీశీలకులుగా సుషీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వార్ జీతేంద్ర సింగ్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదికలో సమర్పించనున్నారు. నివేదిక అందిన అనంతరం కర్ణాటక సీఎం ఎవరని అధిష్టానం ప్రకటించనుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నో త్యాగాలు చేశా.. సిద్ధ రామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని డీకే శివకుమర్ మరోమారు స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసి ఆయనకు మద్దతుగా నిలిచానని తెలిపారు. సిద్ధరామయ్యకు పూర్తి సహకారం అందించినట్లు సీఎల్పీ సమావేశానికి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ -
మోదీపై ఆప్ దేశవ్యాప్త పోస్టర్ ప్రచారం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆప్ గురువారం నుంచి దేశవ్యాప్త ప్రచారం ప్రారంభించింది. మోదీ హటావో, దేశ్ బచావో అనే నినాదంతో ప్రాంతీయ భాషల్లో ముద్రించిన పోస్టర్లు, బ్యానర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ గోపాల్ రాయ్ చెప్పారు. ప్రధాని మోదీ, బీజేపీ ఇచ్చిన అమలు కాని హామీల గురించి ప్రజలకు తెలియజెప్పడమే తమ ఉద్దేశమన్నారు. హామీలను నెరవేర్చకపోగా, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ మేరకు ఇప్పటికే పోస్టర్లు, బ్యానర్లను 22 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు కూడా అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 10వ తేదీ నుంచి అన్ని యూనివర్సిటీల్లోనూ ఇటువంటి పోస్టర్లు, బ్యానర్లనే ఏర్పాటు చేస్తామన్నారు. -
'మోదీ హఠావో దేశ్ బచావో..' అంటూ ఢిల్లీలో వేల బ్యానర్లు ప్రత్యక్షం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వేల సంఖ్యలో బ్యానర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఫుటోవర్‌లు, ఫ్లైఓవర్లు, బిల్డింగులు, రోడ్లు ఇలా అనేక చోట్ల మోదీ హఠావో దేశ్ బచావో(మోదీని గద్దె దించండి దేశాన్ని కాపాడండి) అంటూ ప్లెక్సీలు వెలిశాయి. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్లు తెగ వైరల్ అయ్యాయి. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి వీటిని తొలగించారు. మొత్తం 100కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే ఇలాంటి బ్యానర్లు లక్షకుగా పైగా ముద్రించాలని రెండు ప్రింటింగ్ ప్రెస్‌లకు ఎవరో ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు మంగళవారం 10వేల పోస్టర్లను కూడా సీజ్ చేశారు. వీటిని వ్యానులో తరలిస్తుండగా పట్టుకున్నారు. అయితే వాటిపై ప్రింటింగ్ ప్రెస్ పేరు గానీ, ఎవరు ముద్రించారనే వివరాలు గానీ లేవు. మోదీ వ్యతిరేక బ్యానర్లకు సంబంధించి 100 ఎఫ్ఐర్లు నమోదు చేయడంతో పాటు, ఆరుగురుని అరెస్టు చేసినట్లు స్పెషల్ సీపీ దీపేంద్ర పథాక్ తెలిపారు. ఆప్ కార్యాలయం నుంచే వ్యాన్ వెల్లిందని పేర్కొన్నారు. ఆప్ సెటైర్లు.. మరోవైపు మోదీ వ్యతిరేక పోస్టర్లను పోలీసులు తొలగించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ సెటైర్లు వేసింది. కేంద్రం నియంత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడింది. ఆ పోస్టర్లలో ఏం తప్పు ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేశారు మోదీజీ? అని ప్రశ్నించింది. భారత్ ప్రజాస్వామ్య దేశం అని బహుశా ప్రధాని మర్చిపోయినట్టున్నారని సెటైర్లు వేసింది. ఈమేరకు ట్వీట్ చేసింది. मोदी सरकार की तानाशाही चरम पर है‼️ इस Poster में ऐसा क्या आपत्तिजनक है जो इसे लगाने पर मोदी जी ने 100 F.I.R. कर दी? PM Modi, आपको शायद पता नहीं पर भारत एक लोकतांत्रिक देश है। एक पोस्टर से इतना डर! क्यों? pic.twitter.com/RLseE9Djfq — AAP (@AamAadmiParty) March 22, 2023 చదవండి: కేంద్రం శుభవార్త .. ఓటర్ ఐడీకి ఆధార్ కార్డ్ లింక్ చేశారా? -
ఫిఫా వరల్డ్‌కప్‌లో వైరలవుతోన్న సంజూ శాంసన్ బ్యానర్లు
టీమిండియా టాలెంటెడ్ ఆటగాడు సంజూ శాంసన్‌కు అన్యాయం జరుగుతూనే ఉంది. న్యూజిలాండ్‌తో ముగిసిన టి20 సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికి ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ అదే పరిస్థితి. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఏదో మొక్కుబడిగా తొలి వన్డే ఆడించారు. ఆ తర్వాత వెంటనే రెండో వన్డేకు పక్కకు తప్పించారు. అలా అని సంజూ శాంసన్ బాగా ఆడలేదా అంటే 37 పరుగులు చేశాడు. ఎన్ని అవకాశాలిచ్చినా వరుసగా విఫలమవుతున్న పంత్ కంటే శాంసన్ చాలా బెటర్‌గా కనిపిస్తున్నాడు. దీపక్ హుడాకు స్థానం కల్పించడానికి శాంసన్‌ను తప్పించినట్లు ధావన్ చెబుతున్నప్పటికి సౌత్ ప్లేయర్ అనే వివక్ష కొట్టొచ్చినట్లు కనిపించిదని అభిమానులు పేర్కొన్నారు. మరి నవంబర్ 30(బుధవారం) జరిగే చివరి వన్డేలోనైనా సంజూకు అవకాశం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సంగతి పక్కనబెడితే.. సంజూ శాంసన్ ఫ్యాన్స్ ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో అతని బ్యానర్లు ప్రదర్శించడం వైరల్‌గా మారింది.ఫిఫా మ్యాచ్ లకు హాజరవుతూ శాంసన్ కు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా గల్ఫ్ దేశాలలో మళయాళీలు స్థిరపడుతుంటారు. సంజూ కూడా మళయాళీనే కావడంతో అక్కడి కేరళీయులు అతడికి మద్దతు తెలుపుతున్నారు. అంతేగాక ఫిఫా చూడటానికి వెళ్లిన పలువురు కేరళ ఫ్యాన్స్ కూడా బ్యానర్లతో స్టేడియాలకు హాజరవుతూ అతడిపై ప్రేమను చాటుకుంటున్నారు. ''నిన్ను టీమిండియా ఆడించినా ఆడించకపోయినా మేం నీతోనే ఉంటాం. నువ్వు ఏ జట్టు తరఫునా ఆడినా మంచిదే. మా మద్దతు ఎప్పుడూ నీకు ఉంటుంది.'' అని ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. సంజూ శాంసన్ ఫ్యాన్ పేజీ ఈ ఫోటోలను ట్విటర్ లో పోస్ట్ చేయగా రాజస్తాన్ రాయల్స్ జట్టు దానికి ..''అతడి మీద మీకున్న ప్రేమకు సలామ్..'' అని కామెంట్స్ చేయడం విశేషం. Everybody: Who are you supporting at the FIFA World Cup? Us: pic.twitter.com/e66NRg78dh — Rajasthan Royals (@rajasthanroyals) November 27, 2022 చదవండి: FIFA WC: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?' Cristiano Ronaldo: 'ఇదంతా తొండి.. ఆ గోల్ నాది' -
మీ సానుభూతి మాకు అవసరం లేదు: పవన్‌కు దిమ్మ తిరిగే కౌంటర్
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లు కూల్చి వేస్తోందంటూ జనసేన, తెలుగుదేశం నాయకులు వారం రోజులుగా నానా హడావుడి చేశారు. వాస్తవానికి రోడ్డును ఆక్రమించిన వారి ఇళ్లను ప్రభుత్వం ఎక్కడా కూల్చలేదు. కేవలం ప్రహరీ, మెట్లను మాత్రమే తొలగించారు. దీనిని రాజకీయంగా వాడుకుని, లబ్ధి పొందాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల అక్కడ పర్యటించి హంగామా చేశారు. జనసేన సభకు భూములిచ్చిన వారి ఇళ్లను కూల్చి వేశారంటూ విష ప్రచారం చేశారు. ఆ తర్వాత ఒక్కో ఇంటికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తానని ప్రకటించారు. అయితే ఈ వ్యవహారం ఇప్పటం వాసులకు విసుగు తెప్పించింది. ‘ప్రభుత్వం మా ఇళ్లను కూల్చ లేదు. మీ సానుభూతి మాకు అవసరం లేదు. డబ్బులు ఇచ్చి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయొద్దు’ అంటూ బుధవారం ఆయా ఇళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (‘ఈనాడు’కు ఎందుకంత కడుపుమంట?.. రామోజీకి కళ్లు కనపడట్లేదా?’) -
బీజింగ్‌లో జిన్‌పింగ్ వ్యతిరేక బ్యానర్లు
బీజింగ్: చైనాలో మునుపెన్నడూ కనిపించని దృశ్యాలు.. సోషల్ మీడియా సాక్షిగా వైరల్ అవుతున్నాయి. కరోనా కఠిన ఆంక్షలతో జనాలు తీవ్ర అసంతృప్తి.. అసహనంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌పై వ్యతిరేకత తారాస్థాయికి చేరుతోంది. తాజాగా ఏకంగా రాజధాని బీజింగ్ మహానగరంలో జిన్‌పింగ్ వ్యతిరేక బ్యానర్లు వెలిశాయి. అయితే.. అప్రమత్తమైన అధికారులు తొలగించినప్పటికీ అప్పటికే వాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. జిన్‌పింగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, కొవిడ్-19 కఠిన ఆంక్షల్ని తొలగించాలని ఆ బ్యానర్లను ఓ ఫ్లై ఓవర్‌పై, మరికొన్ని కూడళ్లలో ఉంచారు. పైగా ఫ్లై ఓవర్‌పై వేలాడదీసిన బ్యానర్లకు కాస్త దూరంలో ఆకర్షణ కోసం మంటలు రాజేశారు. ‘‘కరోనా పరీక్షలు మాకొద్దు. మా ఆకలి తీరితే చాలు. లాక్డౌన్లు అక్కర్లేదు.. స్వేచ్ఛ కావాలి.. అందుకు జిన్‌పింగ్‌కు ఉద్వాసన పలకాలి’’ అంటూ బ్యానర్లను కట్టారు. జిన్‌పింగ్ వ్యతిరేక బ్యానర్లు తొలగిస్తున్న సిబ్బంది బీజింగ్‌తో పాటు హయిదియాన్లో, మరికొన్ని చోట్ల ఆ బ్యానర్లు వెలిశాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులను సైతం ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పోతున్నారు అధికారులు. వీటిని ఏర్పాటు చేసిన వాళ్లను సాహసవీరులుగా పొగుడుతూ చైనా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ వెబ్‌లో పోస్టులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని ఏర్పాటు చేసిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు అక్కడి అధికారులు. కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తైన దరిమిలా, జింగ్‌పిన్ మూడో దఫా అధ్యక్ష పగ్గాలు చేపడతాడనే ఊహాగానాల నడుమ.. ఈ వ్యతిరేక పరిణామం ఆసక్తికర చర్చకు దారి తీసింది. తాజాగా కొత్త వేరియెంట్ల కేసులతో మరోసారి లాక్డౌన్ విధిస్తోంది చైనా. ఇదీ చదవండి: అప్పుడే అయిపోలేదు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక -
Munugode Bypoll: మాకు మీ డబ్బొద్దు.. రోడ్లు వేయండి
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల వేళ నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను తెరపైకి తెస్తున్నారు. వాటిని పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ మేరకు బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్న ప్రధాన రాజకీయ పార్టీలకు తమ డిమాండ్లు తెలియజేస్తున్నారు. బుధవారం కూడా మునుగోడు మండలం కాశవారిగూడెంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. గత నెలలో చండూరు మండలంలోని పడమటితాళ్ల గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతూ గ్రామస్తులు గ్రామం పొలిమేరలో బ్యానర్ కట్టారు. దీంతో ఆ గ్రామస్తులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో నాయకులు పడ్డారు. గట్టుప్పల్ మండలంలోని తేరట్పల్లి గ్రామం బ్యాంకు కాలనీలో ఇటీవల ‘ప్రజా ప్రతినిధులకు గమనిక’ అంటూ బోర్డు రూపంలో ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ కాలనీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు (సీసీరోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలు) చేపట్టనందున ప్రజా ప్రతినిధులెవరూ ఓట్లు అడగడానికి ఈ కాలనీలో అడుగు పెట్టకూడదని, తమ సమస్యలను త్వరగా పరిష్కరించేవారే ఓట్లు అడిగేందుకు అర్హులంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. దీంతో వారి సమస్యలను పరిష్కరించేలా సంప్రదింపులు జరుగుతున్నాయి. కాగా బుధవారం కాశవారిగూడెంలో ప్రజలు అలాంటి బ్యానరే ఏర్పాటు చేశారు. ‘మాకు మీరిచ్చే డబ్బులు వద్దు.. మా గూడేనికి రోడ్డు కావాలి..’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. ‘గ్రామ ప్రగతి మారలేదు. గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వాలు, ప్రజా ప్రతిని ధులు, ఎందరో నాయకులు మారినా మా గతుకుల రోడ్డు, కనీస సౌకర్యాలు మార లేదు. అన్ని రాజకీయ పార్టీలకు విన్నపం.. రోడ్డు, మా గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పించే నాయకులకే ఓట్ల కోసం మా కాశవారి గూడెంకు రాగలరు. మాకు తక్షణమే కల్వలపల్లి నుంచి కాశవారి గూడేనికి రోడ్డు వేయాలి. గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలి’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేయడంతో నేతలు తలపట్టుకుంటున్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం కోయలగూడెంలో ప్రచారం చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలి పిస్తే మీ ఊరికి రోడ్డు వేస్తామని చెప్పగా ఓ ఓటరు.. ‘మీ మా టలు నమ్మం’ అంటూ అడ్డు తగిలారు. దానికి మంత్రి ‘నువ్వు ఆ వర్గమా ఈ వర్గమా?’ అని ప్రశ్నించడంతో ‘ఓ ఓటరుగా అడుగు తున్నా’ అని ఆయన జవాబిచ్చారు. -
ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నిషేధం అమలు, ఉల్లంఘనలు, వాటిపై చర్యలు, ప్రత్యామ్నాయాలు తదితరాలకు సంబంధించిన మార్గదర్శకాలను నోటిఫికేషన్లో వివరించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతులతోపాటు వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనలకు నిషేధం వర్తిస్తుంది. నిషేధం అమలును పట్టణాలు, నగరాల్లో కాలుష్య నియంత్రణ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, శానిటేషన్ సిబ్బంది పర్యవేక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, పంచాయతీలు, గ్రామ సచివాలయాల సిబ్బందికి అప్పగించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లకు బదులుగా కాటన్, నేత వ్రస్తాలను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఉల్లంఘిస్తే జరిమానా నిబంధనలు ఉల్లంఘిస్తే ఫ్లెక్సీ చదరపు అడుగుకు రూ.100 జరిమానా విధిస్తారు. ఉల్లంఘనులపై పర్యావరణ చట్టం–1986 ప్రకారం చర్యలు తీసుకుంటారు. సీజ్చేసిన బ్యానర్లను శాస్త్రీయంగా డిస్పోజ్ చేయడానికి అవసరమైన ఖర్చును నిబంధనలు ఉల్లంఘించిన వారినుంచి వసూలుచేస్తారు. పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, జీఎస్టీ అధికారులు ప్లాస్టిక్ ఫెక్సీల నిషేధాన్ని పర్యవేక్షించే అధికారులకు సహాయపడతారు. -
చంద్రబాబు పర్యటన లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు
-
జీహెచ్ఎంసీ ఎన్నికలు: అధికారుల కొరడా
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో నేటి నుండి అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 4 వేలకు పైగా పోస్టర్లు, బ్యానర్లు తొలగించినట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారిగా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటిని ప్రత్యేకంగా నియమించామని తెలిపారు. (చదవండి: దుబ్బాక దెబ్బ: కేసీఆర్ వ్యూహం మార్చుతారా?) తక్షణమే నగరంలో వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నేడు తొలగించిన ప్లెక్సీలు, బ్యానర్లలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రహరీ గోడలు, ప్రధాన రహదారుల వెంట తొలగించినట్లు పేర్కొన్నారు. నగరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి సర్కిళ్లవారిగా నిఘా బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని డి.ఎస్.లోకేష్ కుమార్ వివరించారు. (చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల) -
యాక్షన్‌కు బ్యానర్లు వద్దు
సినిమా: యాక్షన్ చిత్రానికి బ్యానర్లు పెట్టవద్దని నటుడు విశాల్ అభిమాన సంఘం తరఫున మంగళవారం ఒక ప్రకటనను పత్రికలకు విడుదల చేశారు. నటుడు విశాల్, తమన్నా జంటగా నటించిన చిత్రం యాక్షన్. ఫుల్ మాస్ ఎంటర్‌టెయిన్‌గా రూపొందిన ఈ చిత్రానికి సుందర్.సీ దర్శకుడు. ట్రెడెంట్ ఆర్ట్ పతాకంపై రవీంద్రన్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి హిప్హాప్ తమిళా సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న యాక్షన్ చిత్రం ఈ నెల15న తెరపైకి రానుంది. కాగా ఇటీవల శుభశ్రీ విషయంలో జరిగిన దుర్ఘటన తరువాత ఏ సినిమాలకు కటౌట్లను ఏర్పాటు చేయడం లేదు. అలాంటి వాటిని ప్రభుత్వమే నిషేధించింది కూడా. అయినా కొందరు దురభిమానులు పోస్టర్లు, బ్యానర్లు అంటూ హంగామా చేస్తునే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పురట్చి దళపతి విశాల్ మక్కళ్ నల ఇయక్కం అనే నటుడు విశాల్ ప్రజా సంఘం తరఫున ఆ సంఘం అధ్యక్షుడు వి.హరికృష్ణన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో మన అభిమాన నటుడు విశాల్ నటించిన యాక్షన్ చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుంది. కాగా ఈ సంతోషకరమైన తరుణంలో అభిమానులెవరూ ప్రజలకు ఇబ్బంది కలిగించే చిత్ర బ్యానర్లను, జెండాలను ఏర్పాటు చేయరాదని, ఆ ఖర్చుతో పేదలు, అనాథుల సహాయపడే విధంగా ఉపయోగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
దుర్గగుడిలో ‘అధికార’ ప్రచారం
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో ప్రచారానికి అధికార పార్టీ నేతలు తహతహలాడుతున్నారు. దుర్గమ్మ సన్నిధిలోనూ, దుర్గగుడి ఆస్తులపైన అమ్మవారి ప్రచారం తప్ప మరొకటి ఉండకూడదనే నిబంధన ఉంది. అయితే అధికారపార్టీ నేతలు దీన్ని పట్టించుకోవడం లేదు. తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి రావాలంటూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనందసూర్య ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 9వ తేదీన ఆదివారం చేయనున్నారు. దీనికి సంబంధించిన బ్యానర్లు అర్జున వీధిలో వెలిశాయి. వాస్తవంగా గతంలో ఉన్న అర్జున వీధిని విస్తరించినప్పుడు దుర్గగుడికి ప్రత్యేకంగా ఒక రోడ్డు వేసుకున్నారు. అక్కడ పర్గోలా కట్టారు. అలాగే పాత అర్జున వీధిలో అన్నదానం భవనం దుర్గగుడికి చెందింది. ఇంద్రకీలాద్రి కింద దుర్గాఘాట్ ఉన్న ప్రాంతం దుర్గగుడి పరిధిలోకే వస్తుంది. అయితే అక్కడ ఆనందసూర్య అనుచరులు ఆయన గిరి ప్రదక్షణ విజయవంతం కావాలంటూ బ్యానర్లు కట్టారు. నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌పై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుచరులు బ్యానర్లతో నింపేశారు. అధికారులు వారిస్తున్నా.. దుర్గగుడికి చెందిన ఆస్తులపై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బ్యానర్లు కట్టవద్దంటూ దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది వారించారు. పర్గోలాకు కట్టిన బ్యానర్లు తీయించారు. ఆ నేపథ్యంలో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా దుర్గాఘాట్, ఎదురుగానూ, అన్నదాన భవనం గేట్లకు ఉన్న బ్యానర్లు మాత్రం తొలగించలేదు. వాటిని అలాగే ఉంచడం వెనుకు ఎమ్మెల్సీ వత్తిడి ఉందని ప్రచారం జరుగుతోంది. కోటి దీపోత్సవంలోనూ.. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం కోటి దీపోత్సవం జరిగింది. అక్కడ కూడా ఆనందసూర్య అనుచరులు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణకు చెందిన కరపత్రాలు పంచడంపై మహిళలు చికాకు పడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినంత మాత్రాన కోటి దీపోత్సవంలోనూ, దుర్గగుడిపైనా ఆయన పెత్తనం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. నాలుగున్నర ఏళ్లలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు దేవస్థానానికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాబట్టలేకపోయారు. అయితే ఇక్కడ పెత్తనం మాత్రం జోరుగా చేస్తున్నారు. దేవస్థానంలో ఏ చిన్న వివాదం జరిగినా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తలదూర్చుతారు. ఇక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రతినిధులు కూడా దుర్గగుడిలో హవా నడిపేందుకు తహతహలాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏకంగా దేవస్థానం ఆస్తులపై బ్యానర్లు వెలవడం పై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. -
గడ్చిరోలిలో మావోయిస్టుల బ్యానర్లను తగులబెట్టి..
సాక్షి, కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకాలోని తాడుగుడ, పెండ్రీ గ్రామాల్లో మావోయిస్టుల ఎరుపురంగు బ్యానర్లు వెలిశాయి. ఆదివారం తెల్లవారు జామున మావోయిస్టులు ఆయా గ్రామాల్లో డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆ ఎరుపురంగు బ్యానర్లలో తెలిపారు. దీంతో స్థానికులు తమ గ్రామాలకు మావోయిస్టులు రావద్దని, అభివృద్ధి నిరోధకులని ఆ బ్యానర్లను స్థానికులు తీసు నాలుగు కూడళ్ల వద్ద నిప్పంటించి తగులబెట్టారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలిసింది. దీంతో ఆయా గ్రామాల్లో పోలీసులు కూంబింగ్ తీవ్రం చేశారు. కాగా శనివారం ఏటపల్లి తాలూకా గట్టపల్లి అడవుల్లో రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో అక్కడి 10 జేసీబీలు, 5 ట్రాక్టర్లను మావోయిస్టులు కాల్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మావోయిస్టులు మెరుపుదాడులకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే యాక్షన్ టీంలు సంచిరిస్తున్నట్లు పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని గోదావరి సరిహద్దుల్లో పోలీసులు నిఘాను తీవ్రం చేశారు. -
మన్యంలో మావోయిస్టుల బ్యానర్లు
విశాఖపట్నం, గూడెంకొత్తవీధి(పాడేరు): మన్యంలో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నేతలు మన్యం విడిచి వెళ్లాని డిమాండ్ చేస్తూ మండలంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టుల బ్యానర్లు కట్టి, కరపత్రాలు విడిచిపెట్టారు. ఆదివాసీ గిరిజనులను నాశనం చేసేందుకు అధికార పార్టీ నేతలు పూనుకుంటున్నారని వాటిలో పేర్కొన్నారు.ఆర్వీ నగర్, చాపగెడ్డ, చిరుబాల, అరటి చెట్ల వీధి తదితర పలు గ్రామాల్లో సోమవారం మావోయిస్టు గాలికొండ కమిటీ పేరిట పెద్ద ఎత్తున బ్యానర్లు వెలశాయి. అడవిపై సర్వాధికారం ఆదివాసులదేనని, జీకే వీధి కాఫీ తోటలు ఆదివాసీలకే చెందుతాయని, కాఫీ తోటల జోలికి వస్తే సహించేది లేదని వాటిలో పేర్కొన్నారు, 1/70 చట్టం ప్రకారం ఆదివాసీ గిరిజనులకు కాఫీ తోటలు చెందుతాయని, కాఫీతోటలు వదిలి ఏపీఎఫ్డీసీ అధికారులు మైదాన ప్రాంతాలకు వెళ్లిపోవాలని బ్యానర్లు, కరపత్రాల్లో పేర్కొన్నారు. -
బహా కిలికి రహా కిలికి... స్పోకెన్ కిలికి!
హైదరాబాద్ అమీర్‌పేటలో ఎటు చూసినా ‘స్పోకెన్ కిలికి’ బ్యానర్లు కనిపిస్తున్నాయి. అసలు హైదరాబాద్ అని ఏమిటి... తెలుగు రాష్ట్రాల్లో ఏ మూల చూసినా ఇలాంటి బ్యానర్లే కనిపిస్తున్నాయి. కిలికి కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.ఒకప్పుడు ఇంగ్లిష్ మాట్లాడటం హోదాకు సింబల్‌గా ఉండేది.ఇప్పుడు మాత్రం కిలికి భాషలో ఎంతసేపు మాట్లాడితే అంత గొప్ప!కూకట్‌పల్లిలో ఒక మధ్యతరగతి కుటుంబం.ఆ ఇంట్లో జరిగే సంభాషణ వినండి....తండ్రి:‘నిమ్దాదోసురాసురా నుమ్మీమోహినో జూ?’తెలుగు అనువాదం:‘ఏరా హోంవర్క్ ఎందుకు చేయలేదు. ఒళ్లు బలిసిందా?’కొడుకు:‘మిన పీజ్రాషూకు నే...మిన్ బహిత్త..అనువాదం:‘హోంవర్క్ చేయాల్సింది డాడీలే కదా...నన్ను దబాయిస్తావేం. వీడియోగేమ్స్ ఆడుతున్నాను. కనబడటం లేదా!’సికింద్రాబాద్‌లో ‘అఖిల భారత బద్ధకస్తుల మహాసభ’ జరుగుతుంది. ఆ సభలో అధ్యక్షుడి ఉపన్యాసం వినండి...‘క్రా చు రావీక్ నేమీన్ మహత్తి బస్ మర్ర బంత బంత నత్తురే’ అనువాదం:‘కుందేలు రోజు రన్నింగ్, జంపింగ్ చేస్తుంది.కానీ ఏంలాభం? పది సంవత్సరాలకు మించి బతకదు.తాబేలు విషయానికి వస్తే...రన్నింగ్ చేయదు. జంపింగ్ చేయదు.అయినా భేషుగ్గా వందసంవత్సరాలు బతుకుతుంది’పెళ్లి ఊరేగింపులో కిలికి భాషలో డీజే సాంగ్...‘నిమ్దా సిగ్క నిమ్ సింబ రిపోస్బహా కిలికి రహా కిలికిపిప్పీ ఫిలిఫ్ జివ్ల క్రోయిక్కిఉన్నో డున్నో మువ్వో జావోదంబా దంబా బూగూ కిలికినిమ్దేరే ఉఫ్ఫ్బహ సులుకుకి మారో... మారో మారో మారో మారో కిలికి’ ‘‘మై డియర్ రాజా... బాహుబలి సినిమా వచ్చి చాలా కాలమే అయింది కదా. మరి ఇప్పుడు కిలికి గోల ఏంటి? ఉన్నట్టుండి ఇంగ్లిష్ భాష కనుమరుగు కావడం ఏమిటి? ఎటు చూసినా కిలికి మాట్లాడటం ఏమిటి? ఈ భాష నేర్చుకోవడానికి కోచింగ్సెంటర్లకు పరుగులు తీయడం ఏమిటి? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా జవాబు చెప్పలేకపోయావో..’’ అన్నాడు విక్రమార్కుడి భుజం మీది భేతాళుడు.‘‘ఈజీ కొచ్చన్ అడిగావు తమ్ముడూ’’ అని భేతాళుడికి థ్యాంక్స్ చెప్పి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు విక్రమార్కుడు...‘‘ఒకరోజు ట్రంపుకు బాగా బోరు కొట్టింది. వైట్‌హౌజ్‌కు వెళ్లకుండా ఓన్హౌజ్కు వెళ్లాడు.‘ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పండయ్యా...బోరు కొట్టి చస్తున్నాను’ అన్నాడు అసిస్టెంట్‌తో.‘ఆమధ్య బాహుబలి అనే ఒక సినిమా వచ్చింది సార్. మీకు బాగా నచ్చుద్దీ’’ సమాధానం ఇచ్చాడు అసిస్టెంట్.వెంటనే ఆ సినిమా డీవీడీ తెప్పించాడు ట్రంపు.ఆయనకు కాలకేయులు మాట్లాడే కిలికి భాష తెగ నచ్చేసింది.ట్రంపు తిక్కలోడు కదా...వెంటనే ఒక రూల్ పాస్ చేశాడు.అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులు, ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్లు, ఇంకా రకరకాల వాళ్లకు తప్పనిసరిగా కిలికి భాష వచ్చి ఉండాలి. ఈ భాష రాకుంటే ఎంత పెద్ద మొనగాడినైనా దేశంలోకి అడుగుపెట్టనివ్వను, నా దేశం నా ఇష్టం అని ప్రకటించాడు ట్రంపు.మనవాళ్లకేమో అమెరికా భూతలస్వర్గమాయే! దీంతో ఎక్కడ తమకు అమెరికాలో ఉండే అవకాశం మిస్సవుతుందేమోనని భయపడి విద్యార్థులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు...ఒక్కరనేమిటీ...సమస్త వర్గాలు కిలికి మీద పడ్డాయి. దీన్ని సొమ్ము చేసుకోవడానికి ఏ వీధిలో చూసినా పుట్టగొడుగుల్లా కోచింగ్ సెంటర్లు వెలిశాయి. ట్రంపు మూడ్ మారే వరకు ఈ ట్రెండ్ ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది’’ – యాకుబ్ పాషా -
ప్రియురాలి కోసం బిత్తిరి చర్య.. చిక్కుల్లో ప్రియుడు
సాక్షి, పుణె: ప్రేయసిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రేమించిన అమ్మాయితో గొడవ పడటంతో తను మాట్లాడటం లేదని బిత్తిరి చర్యకు పాల్పడిన ప్రియుడు చిక్కుల్లో పడ్డాడు. వివరాలు.. పుణెకు దగ్గర్లోని పింప్రి చించ్వాడ్కు చెందిన నీలేశ్ ఖేడెకర్ తన ప్రేయసితో గొడపెట్టుకున్నాడు. తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాలని అనుకున్నాడు. కానీ ఆమె అవకాశం ఇవ్వలేదు. ముంబై నుంచి చించ్వాడ్ మీదుగా పుణెకు వెళ్తుందని సమాచారం తెలుసుకున్నాడు. రాత్రికిరాత్రే తన స్నేహితుడి సహాయంతో ‘ఐయామ్ సారీ’ అంటూ ఆమె పేరు రాసిన సుమారు 300 బ్యానర్లు నగరమంతా కట్టాడు. ప్రియుడు చేసిన ప్రయత్నం ప్రేయసికి నచ్చిందో లేదో కాని మున్సిపల్, పోలీస్ శాఖలకు మాత్రం నచ్చలేదు. బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు అనుమతి లేకుండా పెట్టడం నిషేదం. దీంతో నీలేశ్‌పై చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబదించిన వార్త సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ప్రియురాలి కోసం చేసిన పని కాబట్టి క్షమించి వదిలేయాలని కొందరు కోరుతుండగా.. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే చర్యలు తీసుకోవాల్సిందిగా మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. -
రామమందిరానికి ముస్లిం సంఘాల మద్దతు!
లక్నో: అయోధ్యలో రామమందిరం నిర్మాణంకు అనుకూలంగా లక్నోలో వెలసిన బ్యానర్లు చర్చనీయాంశంగా మారాయి. రామమందిరం కట్టాలని కోరుతూ కొన్ని కొన్ని ముస్లిం సంఘాలు పెద్ద పెద్ద హోర్డింగులు, బ్యానర్లు పెట్టాయి. అయోధ్య వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ బ్యానర్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆజంఖాన్ నేతృత్వంలోని శ్రీరామ్ మందిర్ నిర్మాణ్ ముస్లిం కరసేవక్ మంచ్ అనే సంస్థ ఈ బ్యానర్లు పెట్టింది. రామమందిరానికి అనుకూలంగా బ్యానర్లు పెట్టినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆజంఖాన్ తెలిపారు. ఈ-మెయిల్స్, ఫోన్ల ద్వారా బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తనకు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. కాగా, రామమందిరం నిర్మాణంపై ఇప్పటివరకు బీజేపీ ఎటువంటి కార్యాచరణ ప్రకటించకపోవడం గమనార్హం. తాము అధికారంలోకి వస్తే రామమందిరం కడతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల్లో హామీయిచ్చారు. ఈ అంశాన్ని బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. -
సీఎం దీపానే !
► అన్నాడీఎంకే కార్యకర్తల బ్యానర్లు ► దీప, భర్త మాధవన్ లపై ఒత్తిడి ► దీప ఇంటికి తండోపతండాలుగా అభిమానులు ► నా రాజకీయ పయనాన్ని ఏశక్తి అడ్డుకోలేదు : దీప సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి రావాలని జయలలిత అన్న కుమార్తె దీపపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి ప్రతిరోజూ వేలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు వస్తూ రాజకీయాల్లోకి రావాలని బతిమాలుతున్నారు. చేతులు పట్టుకుని మరీ వేడుకుంటున్నారు. అమ్మ ఆసుపత్రి పాలయ్యే వరకు దీప ఎవరో తెలియదు. అత్తను చూడాలని అపోలో ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసినపుడు తొలిసారిగా దీప పేరు బాహ్య ప్రపంచానికి కొద్దిగా పరిచయమైంది. అమ్మ భౌతికకాయాన్ని సందర్శించేందుకు వచ్చిన దీపను అడ్డుకోవడం, ఎంతో కష్టం మీద తన అత్తకు నివాళులర్పించాల్సి వచ్చిందని మీడియా వద్ద దీప మొరపెట్టుకున్నపుడు దీప పేరు మరింత ప్రచారంలోకి వచ్చింది. జయలలిత ఆస్తికి, రాజకీయానికివారసులు ఎవరు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎవరికి అనే ప్రశ్నలు తలెత్తినపుడు శశికళతోపాటు దీప పేరు మార్మోగిపోయింది. అన్నాడీఎంకేలోని అగ్రనేతల ప్రాభవంతో శశికళ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టినా పార్టీ నేతలు, కార్యకర్తల్లో దీప ప్రభావాన్ని మాత్రం చెరిపివేయలేక పోయారు. జయ వారసురాలు దీప మాత్రమే అనే నినాదంతో చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి వేలాది మంది రావడం కొన్ని రోజులుగా కొనసాగుతోంది. దీప వారందరితో ఓపిగ్గా మాట్లాడుతూ నచ్చజెప్పి పంపుతున్నారు. దీప ఇంట్లో లేని సమయాల్లో ఆమె భర్త మాధవన్ కార్యకర్తలను కలుస్తున్నారు. తనను కలుసుకునేందుకు వచ్చే కార్యకర్తల వివరాలను నమోదు చేసేందుకు దీప తన ఇంటి ముందు ఒక రిజిస్టర్‌ను ఏర్పాటు చేశారు. గురు, శుక్రవారాల్లో తిరునెల్వేలి, తూత్తుకూడి, దిండుగల్లు, మదురై, కోయంబత్తూరు, విళుపురం, ఈరోడ్, తిరువణ్ణామలై, తిరుప్పూరు 14 జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. జనం సాధారణ సంఖ్యలో ఉన్నపుడు ఇంటి ముంగిట, ఎక్కువగా ఉన్నపుడు మిద్దెపై బాల్కనీ నుంచి రెండాకుల గుర్తులా రెండువేళ్లను చూపడం ద్వారా మరింత ఉత్సాహపరుస్తున్నారు. రాజకీయ పయనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు తన రాజకీయ పయనాన్ని ఏ శక్తులు అడ్డుకోలేవని దీప శుక్రవారం ప్రకటించారు. జయలలిత పేరు, ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని పునరుద్ఘాటించారు. రాజకీయ ప్రవేశం గ్యారంటీ అనే ధోరణిలో దీప మాట్లాడగానే కార్యకర్తలు చప్పట్లు చరుస్తూ ఆనందంతో రెచ్చిపోయారు. జయలలిత ప్రాతినిథ్యంవహించిన ఆర్కేనగర్ నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్నకు కార్యకర్తలను సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. దీప రాజకీయాలకు తన పూర్తి అండదండలు ఉంటాయని భర్త మాధవ¯ŒS తన ఇంటికి వచ్చిన మీడియాతో చెప్పడం గమనార్హం. అండగా మేమున్నామని కార్యకర్తల భరోసా రాజకీయ ప్రవేశంపై ఇన్నాళ్లూ స్పష్టం చేయని దీప శుక్రవారం తనను కలిసేందుకు వచ్చిన వారితో తన రాజకీయ పయనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పడం వారిలోని ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఎంజీఆర్ హయాం నుంచి పార్టీలో ఉన్నాం, ఎవరి గురించి మీరు భయం పెట్టుకోవద్దు, దీపను చూస్తుంటే అమ్మను చూసినట్లే ఉంది, జయలలిత వారసురాలిగా దీప మాత్రమే ఉండాలని కార్యకర్తలు భరోసా ఇచ్చారు. కొందరు మహిళా కార్యకర్తలు దీప భర్త చేతులు పట్టుకుని కన్నీరుపెట్టుకున్నారు. దీప ఇంటి ముందు కాబోయే ముఖ్యమంత్రి అనే నినాదంతో బ్యానర్లు కట్టారు. ఎంజీఆర్, జయలలిత, దీప ఫొటోలను అమ్మే అంగడి సైతం దీప ఇంటి ముందు వెలిసింది. కార్యకర్తల సందడితో ఫొటోల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. -
'మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు'
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా వెలసిన బ్యానర్లు, హోర్డింగ్స్, కటౌట్లను తక్షణమే తొలగించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అక్రమ హోర్డింగ్‌లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి అక్రమ హోర్డింగ్స్ లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. 'మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు. అనుమతులు లేకుండా వెలసిన హోర్డింగ్స్‌పై జన్మదిన శుభాకాంక్షలా?. దీనిపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి' అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. కాగా రాజకీయ పక్షాలు తమ పార్టీల నాయకులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆహ్వానాలు పలుకుతూ ఇష్టారాజ్యంగా ఎక్కడ బడితే అక్కడ బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసేస్తున్న విషయం తెలిసిందే. -
సీఎం పర్యటన పేరుతో వైఎస్ఆర్ సీపీ ఫ్లెక్సీల తొలగింపు
-
శ్రీనగర్‌లో ISIS కలకలం
-
ఫ్లెక్సీలపై వేటు
కమిషనర్ ఆదేశాలతో కదిలిన టౌన్‌ప్లానింగ్ సిబ్బంది మూడు రోజుల్లో అనుమతి లేని బ్యానర్లన్నీ తొలగించాలని నిర్ణయం అనధికారికంగా ఏర్పాటుచేస్తే చర్యలు నగర సుందరీకరణ కోసం స్పెషల్ డ్రైవ్ విజయవాడ సెంట్రల్ : పండుగలు, పుట్టిన రోజు శుభాకాంక్షలు, అభిమాన నాయకులకు స్వాగతం పలుకుతూ ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటుచేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలతో నగరంలో ప్రధానరోడ్లు, కూడళ్లలో నిండిపోయాయి. హైకోర్టు ఆదేశాలు, నగర సుందరీకరణ నేపథ్యంలో వీటిని తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండ్యన్ ఆదేశాలు జారీచేశారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మూడు రోజుల్లో నగరంలోని అనధికారిక బ్యానర్లను తొలగించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం బందరు రోడ్డులోని బ్యానర్లను తొలగించారు. ఇష్టారాజ్యంగా ఏర్పాటు నగరంలో రోడ్లపై బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు టౌన్‌ప్లానింగ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతాల్లో మాత్రమే వీటిని ఏర్పాటుచేయాలి. శుభాకాంక్షలు తెలిజేస్తూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను రెండు రోజుల్లో తొలగించాలి. సంబంధిత వ్యక్తులు తొలగించకపోతే టౌన్‌ప్లానింగ్ అధికారులే తొలగించడంతోపాటు ఇందుకు అయిన ఖర్చులను బాధ్యుల నుంచి వసూలుచేయాలి. గడిచిన రెండేళ్లలో ఫ్లెక్సీల సంస్కృతి నగరంలో బాగా పెరిగింది. ఏ చిన్న కార్యక్రమం అయినా చోటా, మోటా లీడర్లు సైతం ఫ్లెక్సీలను ఏర్పాటుచేస్తున్నారు. నెలల తరబడి వీటిని తొలగించకుండా వ్యక్తిగత ప్రచారం పొందుతున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోకపోయినా బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వీధులు, ప్రధాన రోడ్లు అనే తేడా లేకుండా నగరం ఫ్లెక్సీలమయమైంది. స్పెషల్ డ్రైవ్‌కు బీజం పడిందిలా... రెండు రోజులుగా నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండ్యన్ డివిజన్ల పర్యటన చేపట్టారు. వీధులన్నీ కలియతిరుగుతున్నారు. ఎక్కడ చూసినా బ్యానర్లు కనిపించడంపై అసహనం వ్యక్తంచేశారు. వీటి ఏర్పాటుకు అనుమతి ఇచ్చారా.. అని టౌన్‌ప్లానింగ్ అధికారులను ప్రశ్నించగా, లేదనే సమాధానం ఎదురైంది. అనధికారికంగా ఏర్పాటుచేసిన బ్యానర్లన్నింటినీ తొలగించాలని ఆదేశాలు జారీచేశారు. నిబంధలకు విరుద్ధంగా మరోసారి బ్యానర్లు ఏర్పాటుచేస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సుందరీకరణపై దృష్టి నగరం రాజధానికి కేంద్రంగా మారిన నేపథ్యంలో సుందరీకరణపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నెలల క్రితమే నగరపాలకసంస్థ అధికారులను ఆదేశించారు. ఈక్రమంలో మేయర్ కోనేరు శ్రీధర్, అప్పటి కమిషనర్ హరికిరణ్ ఏలూరు, బందరు, రైవస్ కాల్వల్లో పర్యటించారు. సుందరీకరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో ఇటీవల నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి అడ్డగోలుగా ఏర్పాటుచే సిన ఫ్లెక్సీలపై అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. స్మార్ట్‌సిటీ (ఆకర్షణీయ నగరంగా) అభివృద్ధి చేయాల్సిందిగా అధికారులకు సూచించినట్లు తెలిసింది. దీంతో నగర సుందరీకరణకు విఘాతం కల్గిస్తున్న ఫ్లెక్సీలను తొలగించాలని కమిషనర్ నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. -
పోలీస్ ‘స్వచ్ఛ్ఛభారత్’..!
{పభుత్వ గోడలు, స్తంభాలపై ఫ్లెక్సీలు, పోస్టర్లు అతికిస్తే పీడీపీపీ యాక్ట్ కింద కేసు నేటి నుంచి సెక్టార్ల వారీగా స్పెషల్ డ్రైవ్ సిటీబ్యూరో: రహదారులపై ఇక నుంచి విచ్చలవిడిగా రాతలు, ప్రకటనలు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు కనిపించవు. నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పం మేరకు ఇప్పటికే శాంతి భద్రతలో తనదైన ముద్ర వేసిన నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసేవారిపై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేశారు. అనుమతి లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు కట్టడాలపై ఎలాంటి రాతలు రాసినా, ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టినా, పోస్టర్లు అతికించినా... బాధ్యులపై ఇక నుంచి ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ టూ పబ్లిక్ ప్రాపర్టీ (పీడీపీపీ) యాక్ట్ -1984 కింద కేసులు నమోదు చేయాలని మంగళవారం అన్ని పోలీసుస్టేషన్ల అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భవనాలు, ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్లతో పాటు రోడ్లపై ఉన్న స్తంభాలకు విచ్చలవిడిగా ఇవి ఉండటంతో నగర అందం దెబ్బతింటోంది. అంతేకాకుండా ఆయా ప్రభుత్వ విభాగాల విధులకు ఇవి అడ్డంకిగా మారాయి. విద్యాసంస్థలు, వస్త్ర దుకాణాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు ఇలా పలు వర్గాల వారు ఇష్టం వచ్చినట్లు తమ ప్రకటనలను ప్లెక్సీలు, పోస్టర్లు, రాతలు రూపంలో చేసుకోవడంతో నగరంలో చెత్తాచెదారం పెరిగిపోవడంతో పాటు ఒక్కోసారి ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. రోడ్లకు అడ్డంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడం వల్ల ట్రాఫిక్ సిగ్నల్స్ వాహనదారులకు సరిగ్గా కనిపించడం లేదు. ఇక స్తంభాలపై బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడం వల్ల ట్రాన్స్‌కో సిబ్బంది కూడా పలు రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ్లెక్సీలు కట్టిన కొద్ది రోజులకు వాటి స్వరూపం మారడంతో ఆ రహదారి అందం కూడా కోల్పోతోంది. సెక్టార్ల వారీగా... ఆయా పోలీసు స్టేషన్ పరిధిని పరిగణలోకి తీసుకుని నాలుగు నుంచి ఏడు సెక్టార్ల వరకు విభజించారు. ఒక్కో సెక్టార్‌ను ఎస్ఐ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.బుధవారం నుంచి సెక్టార్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపడతారు. -
చిత్తూరు టీడీపీలో బ్యానర్ల రగడ..!
నిన్న నాని బ్యానర్లపై ఇంకు చల్లారు నేడు మేయర్ బ్యానర్ల చించివేత తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు చిత్తూరు (అర్బన్): చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బట్టబయలైంది. పైకి ఒకరినొకరు పలకరించుకున్నా లోలోపల మాత్రం ఒకరితో ఒకరికి పొసగడం లేదు. ఫలితంగా నేతలు బ్యానర్లను చించుకునే వరకు వచ్చారు. నగరంలోని ఎంజీఆర్ వీధిలో మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్‌కు సంబంధించిన ఫ్లెక్సీ బ్యానర్‌ను బుధవారం చించివేశారు. ఇది ముమ్మాటికీ పార్టీలోని తమ ప్రత్యర్థి వర్గం చేసిన పనేనంటూ మేయర్ అనుచరులు బహిరంగంగానే చెబుతున్నారు. నెల రోజుల క్రితం చిత్తూరు నగరంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పులి వర్తి నాని జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అనుచరులు నగరంలో పెద్దఎత్తున ఫెక్ల్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిని సహించలేని అదే పార్టీలోని కొందరు వ్యక్తులు గాంధీ విగ్రహం వద్ద ఉన్న నాని డిజిటల్ ఫ్లెక్సీపై ఇంకు చల్లారు. పక్కనే ఉన్న మరో బ్యానర్‌ను చించివేశారు. దీనిపై టీడీపీలోని ఇరువర్గాల నాయకుల్లో అం తర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అప్పట్లో ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినప్పటికీ పార్టీలోని పెద్దలు సర్దుబాటు చేశారు. అయితే బుధవారం కార్పొరేషన్ మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్‌కు సంబంధించి డిజిటల్ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. దీనిపై మేయర్ వర్గం గుర్రుగా ఉంది. చిత్తూరు నగరంలో ఎమ్మార్పీకే మద్యం అమ్మాలని రెండు రోజుల క్రితం ఎక్సైజ్ ఈఎస్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మద్యం విక్రయాల్లో టీడీపీ నాయకుల సిండికేట్ ఉండటంతో పార్టీలోని ఓ వర్గం వ్యక్తులు ఇలా ఫ్లెక్సీ బోర్డులను చించేశారని మేయర్ వర్గం ఆరోపిస్తోంది. దీనికి తోడు చిత్తూరు నగరంలో నిషేధిత లాటరీ టికెట్ల విక్రయాలను అరికట్టడానికి పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే మేయర్ దంపతుల ఫ్లెక్సీను చించివేయడం టీడీపీ అంతర్గత కుమ్ములాటను బహిర్గతం చేసినట్టయింది -
హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్లు పీకిపారేయండి
-
హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్లు పీకిపారేయండి
హైదరాబాద్ : హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనుమతులు లేకుండా వెలసిన బ్యానర్లు, హోర్డింగ్స్, కటౌట్లను తక్షణమే తొలగించాల్సిందేనని న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల డీజీపీలు, కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ అధికారులను ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని, ప్రభుత్వం జీవో జారీ చేసినా వాటిని అమలు చేయడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయవాది ఎంఎస్ఎన్ ప్రసాద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు ..ఈ మేరకు ఆదేశాలు ఇస్తూ విచారణను జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అలాగే ఏపీ, తెలంగాణలో ఏర్పాటు చేసిన విగ్రహాలపై సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకోవాలని రెండు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశించింది. రాజకీయ పక్షాలు తమ పార్టీల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆహ్వానాలు పలుకుతూ ఇష్టారాజ్యంగా ఎక్కడ బడితే అక్కడ బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసేస్తున్న విషయం తెలిసిందే. -
హై అలర్ట్..!
భద్రాచలం/చింతూరు: మావోయిస్టు అమర వీరుల సంస్మరణ వారోత్సవా ల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పోలీసు స్టేషన్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. నేటి నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించే అమరవీరుల వారోత్సవాలు విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. గత పది రోజులుగా సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామాలతో పాటు, మండల కేంద్రాల సమీపాల్లో కూడా బ్యానర్లు కట్టి, పోస్టర్లు వేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలైంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహించేందుకు సమాయత్తమైనట్లు తెలిసింది. చింతూరు, దుమ్ముగూడెం మండలాల సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం, చింతగుప్ప ప్రాంతాల్లో ఇప్పటికే అమరవీరుల స్థూపాలను నిర్మించినట్లు తెలిసింది. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన శబరి ఏరియా కమిటీ కార్యదర్శి ముప్పు మొగిలి అలియాస్ నరేష్‌కు నివాళిగా స్థూపం నిర్మించేందుకు మావోయిస్టులు ప్రయత్నించగా, పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. సరిహద్దు గ్రామాల్లో నక్సల్స్ సంచరిస్తూ వారోత్సవాలను విజయవంతం చేయాలని ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. అమర వీరులకు నివాళులు అర్పించటంతో పాటు ఏదో ఒక సంఘటనకు పాల్పడటం ద్వారా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. రవాణా వ్యవస్థను విచ్చిన్నం చేసేందుకు వారు వ్యూహం పన్నుతున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే జరిగితే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఉన్న రవాణా వ్యవస్థపై దీని ప్రభావం పడనుంది. గత అనుభవాల దృష్ట్యా వారోత్సవాల సమయంలో మావోయిస్టులు రైలు పట్టాలను తొలగించే ప్రమాదం ఉండడంతో కేకే లైనుకు సంబంధించి విశాఖపట్నం నుంచి కిరండోల్‌కు వెళ్లే పాసింజర్ రైలుతో పాటు ఐరన్‌వోర్‌ను రవాణా చేసే గూడ్స్ రైళ్లను కూడా జగ్దల్పూర్ వరకే పరిమితం చేసే అవకాశముంది. దీంతో పాటు మావోయిస్టుల ప్రభావ ప్రాంతాలైన నారాయణ్‌పూర్, కాంకేర్, బస్తర్, బీజాపూర్, సుక్మా జిల్లాల్లో ప్రైవేటు ఆపరేటర్లు తమ బస్సులను వారం రోజులపాటు నిలిపివేయనున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్, విజయవాడ నుంచి జగ్దల్పూర్, బైలాడిల్లా వెళ్లాల్సిన ఆంధ్రా, తెలంగాణా బస్సులను చింతూరు మండల సరిహద్దు కుంట వరకే నడపనున్నట్లు తెలిసింది. అప్రమత్తమైన పోలీసులు... తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా ఏర్పడిన నేపథ్యంలో ఇటు ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో సైతం కొంతకాలంగా మావోయిస్టులు స్తబ్దుగానే ఉన్నారు. ఈ సమయంలోనే మావోయిస్టులు తమ క్యాడర్‌ను పెంచుకునేందుకు గాను ఛత్తీస్‌గఢ్‌లోని సరిహద్దు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమై కూంబింగ్‌ను ముమ్మరం చేయడంతో మరోమారు అలజడి ప్రారంభమైంది. ఈ క్రమంలోనే నారాయణ్‌పూర్, కాంకేర్, సుక్మా జిల్లాల్లో గత మూడు రోజులుగా సుమారు 15 మంది మావోయిస్టు సభ్యులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బస్తర్ ఐజీ కల్లూరి చింతూరు, భద్రాచలం పోలీసులతో సమావేశమై సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారంపై విస్తృతంగా చర్చించారు. సరిహద్దుల్లో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించినట్లు సమాచారం. టార్గెట్ నాయకులకు హెచ్చరికలు... వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్న నాయకులెవరూ ముందస్తు సమాచారం లేకుండా గ్రామాలకు వెళ్లరాదని పోలీసులు ెహ చ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే వారికి నోటీసులు జారీచేశారు. కాగా, ఈ పరిణామాలు సరిహద్దు గ్రామాల్లో ఉన్న గిరిజనులపై ప్రభావం చూపుతున్నాయి. కొరియర్లపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు గిరిజన గ్రామాల్లో పర్యటించి, అనుమానితులను పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. మరో పక్క పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరించవద్దని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల నడుమ అమాయక గిరిజనులు నలిగిపోతున్నారు. వారోత్సవాల్లో ఎప్పుడేం జరుగుతుందోనని వారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. -
సిరిసిల్ల వస్త్రానికి ఎన్ని‘కళ’
సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఎన్నికల గాలితాకింది. వరుసగా ఎన్నికలు రావడంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి కళ వచ్చింది. ఇక్కడి వస్త్రోత్పత్తిదారులకు చేతినిండా పని లభిస్తోంది. రాజకీయపార్టీలు వినియోగించే బ్యానర్లు, జెండాలు, కండువాలు తయారీకి అవసరమైన గుడ్డ సిరిసిల్లలోనే ఉత్పత్తికావడంతో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గుడ్డ మన రాష్ట్రంతో పాటు జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు ఎగుమతి అవుతోంది. న్యూస్‌లైన్, సిరిసిల్ల,రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 27వేల మరమగ్గాలపై పాలిస్టర్, 7వేల మగ్గాలపై కాటన్ గుడ్డ ఉత్పత్తి అవుతోంది. పాతికవేల కుటుంబాలు వస్త్రోత్పత్తి పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. నూలు ధరలు పెరగడం, ఉత్పత్తి చేసిన గుడ్డకు గిరాకీ లేక వస్త్ర వ్యాపారులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరెంటు బిల్లులు పెరిగి విడిభాగాల రేట్లు ఎక్కువై వస్త్రోత్పత్తి గిట్టుబాటు లేని పరిస్థితి గతంలో ఎదురైంది. ఇప్పుడు గుడ్డకు కాస్త ధర పెరగడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకేసారి స్థానిక, మున్సిపల్, సార్వత్రిక న్నికలు రావడంతో వస్త్రవ్యాపారులకు కలిసొచ్చింది. సిరిసిల్లలో నిత్యం 27లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తవుతుండగా, గతంలో వస్త్ర నిల్వలు అమ్మకాల్లేక పేరుకుపోయాయి. ఎన్నికల పుణ్యమా.. అని ఇప్పుడు వస్త్ర నిల్వలన్నీ హైదరాబాద్‌లోని మార్వాడి సేట్లు కొనుగోలు చేయడంతో గుడ్డనిల్వలు లేకుండా పోయాయి. ఎన్నికల పుణ్యమా అని.. ఎన్నికలకు అవసరమైన జెండాలు, బ్యానర్లు, కండువాలు, క్యాప్‌లకు చౌకగా లభించే గుడ్డ అవసరమవుతోంది. సిరిసిల్లలో నాసిరకం గుడ్డ ఉత్పత్తవుతుండగా, జాతీయ మార్కెట్లో సిరిసిల్ల గుడ్డను ఎన్నడూలేని విధంగా ఎన్నికల సమయంలో ఎక్కువగా కొనుగోలు చేయడం పరిపాటి. దీంతో సిరిసిల్ల వస్త్రానికి గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని లభిస్తోంది. పాలిస్టర్ వస్త్రానికి డిమాండ్ ఉండడంతో కార్మికులతో యజమానులు, ఆసాములు పని చేయిస్తున్నారు. సిరిసిల్లలో 8గంటల పని విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్దేశించగా, గుడ్డకు డిమాండ్ ఉండడంతో 12 గంటలు పని చేయిస్తున్నారు. మరో మూడు నెలల వరకు కార్మికులకు పని ఉంటుందని భావిస్తున్నారు. సిరిసిల్లలో తక్కువ ధరకు గుడ్డ దొరుకుతుండగా, ఆ గుడ్డను రంగుల్లో ప్రింట్ చేసేందుకు ప్రాసెసింగ్ చేయడానికి మీటర్ రూ.10 వరకు ఖర్చవుతోంది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మిల్లుల్లో ప్రాసెసింగ్ చేయడానికి ఎక్కువ ఖర్చవుతోంది. మొత్తంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊరట లభించింది. -
‘సాఫ్ట్’గా ప్రచారం.. ముంచుకొస్తున్న ముప్పు..
అమీర్‌పేటలో శిక్షణ సంస్థల ప్రచార హోరు వీధులు కనబడకుండా బ్యానర్లు మురుగు ప్రవాహానికి అడ్డుగా కరపత్రాలు సనత్‌నగర్, న్యూస్‌లైన్: అమీర్‌పేటలో ‘సాఫ్ట్’ ప్రచారం హడలెత్తిస్తోంది. కరప్రతాలు రోడ్లను సైతం కనిపించకుండా చేసేస్తుంటే.. బ్యానర్లు వీధులను ముంచేస్తున్నాయి. చిన్న చోటు కనిపిస్తే ప్రచార కోసం సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలు వాలిపోతున్నాయి. అమీర్‌పేట్ మైత్రీవనమ్ నుంచి సత్యం థియేటర్ రోడ్డు, మైత్రీవనమ్ వెనుక ప్రాంత రహదారులను ఒక్కసారి పర్యటిస్తే ఏ వీధిలో ఉన్నామో తెలియని అయోమయంగా ఉంటుంది. రోడ్లను అపరిశుభ్రంగా మార్చడంతో పాటు వీధులను కానరాకుండా చేస్తున్న సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థల ప్రచార అస్త్రాలపై అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. మురుగు పారుదలను అడ్డుకునేలా.. అమీర్‌పేట, ఎస్ఆర్నగర్ ప్రాంతాల్లో దాదాపు మూడు వేలకు పైగా సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలు ఉండగా దాదాపు రెండు లక్షల మంది విద్యార్ధులు శిక్షణ పొందుతున్నారు. ప్రతిరోజు కొత్తగా వచ్చేవారు వేలల్లో ఉంటారు. వీరిని ఆకర్షించేందుకు ఆయా శిక్షణ సంస్థలు పోటీపడుతుంటాయి. ఈ క్రమంలో కోర్సుల వివరాలతో ముద్రించిన వేలాది కరప్రతాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎవరికి నచ్చిన రీతిలో వారు చేస్తుంటారు. ఒక్క కరపత్రాలనే గమనిస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో దాదాపు వంద మంది వరకు కేవలం పంచడానికే విధులు నిర్వర్తిస్తారు. ఈ కరపత్రాలను అక్కడికక్కడే పడేస్తుంటారు. ఇలా రోజుకు ఐదు క్వింటాళ్ల కరపత్రాలే ఇక్కడ నుంచి పారిశుద్ధ్య సిబ్బంది సేకరిస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, వర్షానికి, గాలికి కాగితాలన్నీ మురుగనీటి మ్యాన్హోల్ల్లోకి చేరి మురుగు ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. దీంతో రోడ్డుపైకి మురుగు పొంగుకు రావడం నిత్యకృత్యంగా మారింది. ఇదిలా ఉంటే స్తంభాలకు అడ్డదిడ్డంగా కడుతున్న బ్యానర్లు వాహనదారులకు అసౌకర్యంగా మారుతున్నాయి. కమిషనర్ ఆదేశాలూ బేఖాతర్.. ఇక్కడి పరిస్థితిపై గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న కృష్ణబాబు స్వయంగా పరిశీలించి సాఫ్ట్వేర్ సంస్థల ప్రచారతీరుపై మండిపడ్డారు. వీటి ప్రచార నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో ఆయన ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ పర్యటించి బ్యానర్లు, బోర్డుల తొలగింపునకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రెండు మూడు రోజులు బోర్డులను, బ్యానర్ల తొలగించిన సిబ్బంది ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో సమస్య యధాస్థితికి వచ్చింది. సాఫ్ట్వేర్ సంస్థలు ప్రచారం చేసుకోవడానికి కింది స్థాయి సిబ్బందికి, నేతల చేతులు తడుపుతుండడం వల్లే వాటిని అడ్డుకోవడం లేదనే విమర్శలూ తలెత్తుతున్నాయి. సాధారణంగా ఏదైనా బోర్డు, బ్యానర్ల ఏర్పాటుకు అధికారుల అనుమతి తప్పనిసరి. ఇదంతా ఎందుకనుకుని శిక్షణ సంస్థలు కిందిస్థాయి సిబ్బందిని, నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారని సమాచారం. దీంతో జీహెచ్ఎంసీ ఆదాయానికి సైతం గండిపడుతుండడంతో పాటు నీటిపారుదలకు అడ్డంకి సృష్టించేలా కరపత్రాలు కొట్టుకురావడంతో ముంపు సమస్య ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.