మావోయిస్టుల బ్యానర్, కరపత్రం
విశాఖపట్నం, గూడెంకొత్తవీధి(పాడేరు): మన్యంలో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నేతలు మన్యం విడిచి వెళ్లాని డిమాండ్ చేస్తూ మండలంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టుల బ్యానర్లు కట్టి, కరపత్రాలు విడిచిపెట్టారు. ఆదివాసీ గిరిజనులను నాశనం చేసేందుకు అధికార పార్టీ నేతలు పూనుకుంటున్నారని వాటిలో పేర్కొన్నారు.ఆర్వీ నగర్, చాపగెడ్డ, చిరుబాల, అరటి చెట్ల వీధి తదితర పలు గ్రామాల్లో సోమవారం మావోయిస్టు గాలికొండ కమిటీ పేరిట పెద్ద ఎత్తున బ్యానర్లు వెలశాయి.
అడవిపై సర్వాధికారం ఆదివాసులదేనని, జీకే వీధి కాఫీ తోటలు ఆదివాసీలకే చెందుతాయని, కాఫీ తోటల జోలికి వస్తే సహించేది లేదని వాటిలో పేర్కొన్నారు, 1/70 చట్టం ప్రకారం ఆదివాసీ గిరిజనులకు కాఫీ తోటలు చెందుతాయని, కాఫీతోటలు వదిలి ఏపీఎఫ్‌డీసీ అధికారులు మైదాన ప్రాంతాలకు వెళ్లిపోవాలని బ్యానర్లు, కరపత్రాల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment