Maoist courier
-
మావోయిస్టు కొరియర్ అరెస్ట్
కొత్తగూడెం అర్బన్: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌కు కొరియర్‌గా పని చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ రాజేష్‌చంద్ర తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా నాయుడుపాలెంకు చెందిన మందా రంజిత్‌రావు ప్రస్తుతం హైదరాబాద్‌లో తన అన్నయ్య వద్ద ఉంటూ.. ఉస్మానియా యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేట్ చదువుతున్నాడు. అయితే 2014 నుంచి మావోయిస్టు హరిభూషణ్‌కు కొరియర్‌గా పని చేస్తున్నాడు. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీకి కావాల్సిన వస్తువులు, సామగ్రి (బూట్లు, చెప్పులు, బెల్టులు, ముద్రించిన విప్లవ సాహిత్య పుస్తకాలు) సమకూర్చుతున్నాడు. ఈ క్రమంలో 2018, జూన్ 8న మావోయిస్టు పార్టీకి ఆయుధ సామగ్రి (9 జిలెటిన్ స్టిక్స్, 9 డిటోనేటర్లు, 2 బాక్సుల ఎక్స్‌ప్లోజివ్ వైర్లు) తరలించే క్రమంలో ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు పంపించారు. విడుదలైన తర్వాత కూడా రంజిత్‌రావు తన పద్ధతి మార్చుకోకుండా, 20 రోజుల క్రితం మావోయిస్టు హరిభూషణ్‌ను కలసి, ఆయన పంపిన విప్లవ సాహిత్యం, ఉత్తరాలను హైదరాబాద్‌కు తీసుకెళ్లే క్రమంలో కొత్తగూడెం–ఇల్లెందు క్రాస్ రోడ్డులో శుక్రవారం పోలీసులకు పట్టుబడ్డాడు. -
ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
సాక్షి, పాల్వంచ: పేలుడు పదార్థాలతో, ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తున్న కరపత్రాలతో వెళుతున్న ముగ్గురు మావోయిస్టు పార్టీ కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టుకు అప్పగించారు. స్థానిక పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఓఎస్డీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాలు... పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఐ మడత రమేష్, ఎస్ఐ వెంకటప్పయ్య ఆధ్వర్యంలో ఈ నెల 8న పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో టేకులచెరువు గ్రామంలో మారుతి లింగయ్య ఇంటి వద్దకు వెళ్లారు. పోలీసులను చూడగానే పారిపోయేందుకు మారుతి లింగయ్య, అశ్వాపురం మండలం మామిళ్ళవాయి గ్రామానికి చెందిన మడలి ఇరమయ్య, బూర్గంపాడు రాజీవ్‌నగర్‌కు చెందిన మద్వి యెడమయ్య ప్రయత్నించారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పేలుడు పదార్ధాలు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లను స్వాధీనపర్చుకున్నారు. మావోయిస్ట్ పార్టీలో లింగయ్య చురుగ్గా పనిచేస్తున్నాడు. మావోయిస్టు పార్టీ తూర్పు గోదావరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శి ఆజాద్‌కు కొంతకాలంగా కొరియర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఖమ్మం, మహబుబాబాద్ నుంచి పేలుడు పదార్థాలను సేకరించి ఆజాద్‌కు చేరవేశాడు. 2018 మార్చిలో ఆజాద్ ఆదేశాలతో విజయవాడలో వాకీటాకీలు, సెల్ ఫోన్లు, పవర్ బ్యాంక్, యూనిఫామ్, బూట్లు, సిమ్ కార్డ్‌లు, పేలుడు పదార్థాలు సేకరించి ఇచ్చాడు. ఆజాద్‌కు ఇతడు నమ్మిన బంటు. ఆజాద్ ఆదేశాలతో గత నెల 25న అశ్వాపురం, పాల్వంచ, బూర్గంపాడు, ములకలపల్లి మండలాల్లో (ఎన్నకలు బహిష్కరించాలని రాసి ఉన్న) పోస్టర్లు వేశాడు. పేలుడు పదార్థాలు అక్రమంగా సేకరించి, మావోయిస్టులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచాడు. ఇంతలోనే పోలీసులకు దొరికిపోయాడు. క్వారీల నుంచి పేలుడు పదార్ధాల సేకరణ క్వారీల్లో బ్లాసింగ్‌కు ఉపయోగించే పేలుడు పదార్థాలను వీరు కొంత కాలంగా సేకరిస్తున్నారని ఓఎస్డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. క్వారీల్లోని సిబ్బందితో వీరు సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారి నుంచి పేలుడు పదార్థాలను రోజుకు కొంత చొప్పున పక్కదోవ పట్టించి, మావోయిస్ట్ కొరియర్లకు అమ్ముతున్నారని చెప్పారు. సమావేశంలో పాల్వంచ డీఎస్పీ మధుసూధన్ రావు, సీఐ మడత రమేష్, బూర్గంపాడు ఎస్ఐ వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ పోలీసుల అదుపులో కొరియర్?
సాక్షి, ఏటూరునాగారం: ఏజెన్సీ పోలీసుల అదుపులో మావోయిస్టు పార్టీ కోరియర్ ఉన్నట్లు సమాచారం. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో టార్గెట్లను అంతమొంతించేందుకు రెక్కి నిర్వహించే క్రమంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో యాక్షన్ టీం సంచారం కొంత కాలంగా ఉన్నట్లు పోలీసులు వాల్‌పోస్టర్ల ద్వారా బహిర్గతం చేశారు. అయితే పీఎల్జీఏ వారోత్సవాలు ఈనెల 2 నుంచి 8 వరకు జరిగే క్రమంలో మావోయిస్టు పార్టీ ఉనికి చాటుకోవడానికి కోరియర్ ద్వారా రెక్కి నిర్వహించే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. -
మన్యంలో మావోయిస్టుల బ్యానర్లు
విశాఖపట్నం, గూడెంకొత్తవీధి(పాడేరు): మన్యంలో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నేతలు మన్యం విడిచి వెళ్లాని డిమాండ్ చేస్తూ మండలంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టుల బ్యానర్లు కట్టి, కరపత్రాలు విడిచిపెట్టారు. ఆదివాసీ గిరిజనులను నాశనం చేసేందుకు అధికార పార్టీ నేతలు పూనుకుంటున్నారని వాటిలో పేర్కొన్నారు.ఆర్వీ నగర్, చాపగెడ్డ, చిరుబాల, అరటి చెట్ల వీధి తదితర పలు గ్రామాల్లో సోమవారం మావోయిస్టు గాలికొండ కమిటీ పేరిట పెద్ద ఎత్తున బ్యానర్లు వెలశాయి. అడవిపై సర్వాధికారం ఆదివాసులదేనని, జీకే వీధి కాఫీ తోటలు ఆదివాసీలకే చెందుతాయని, కాఫీ తోటల జోలికి వస్తే సహించేది లేదని వాటిలో పేర్కొన్నారు, 1/70 చట్టం ప్రకారం ఆదివాసీ గిరిజనులకు కాఫీ తోటలు చెందుతాయని, కాఫీతోటలు వదిలి ఏపీఎఫ్డీసీ అధికారులు మైదాన ప్రాంతాలకు వెళ్లిపోవాలని బ్యానర్లు, కరపత్రాల్లో పేర్కొన్నారు. -
ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కొరియర్లు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పేలుడు సామాగ్రి స్వాధీనపర్చుకున్నారు. కొత్తగూడెంలో ఎస్పీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ఈ విషయం తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు... మావోయిస్టు కొరియర్లు పేలుడు సామాగ్రితో వెళుతున్నారన్న సమాచారంతో భద్రాచలం, చర్ల ప్రాంతాల్లో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. చర్ల, భద్రాచలం వద్ద పేలుడు సామాగ్రితో వెళుతున్న ముగ్గురిని పట్టుకున్నారు. వారిని విచారించారు. తాము మావోయిస్టు కొరియర్లుగా పనిచేస్తున్నట్టు వారు చెప్పారు. చర్ల వద్ద మడివి సమ్మయ్యను, ఓయం నందను, భద్రాచలం వద్ద మిర్గం అర్జున్ను అరెస్ట్ చేశారు. మావోయిస్టు పార్టీ నాయకులైన చంద్రన్న, ఆనంద్, పాపారావు, మదన్న, హరిభూషణ్, ఇద్దమయ్య, దామోదర్ దళాలకు ఇచ్చేందుకు ఈ పేలుడు సామాగ్రిని తీసుకెళుతున్నట్టు చెప్పారు. వీరిని పూర్తిస్థాయిలో విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది. ఈ ముగ్గురి నుంచి 51 జిలెటిన్ స్టిక్స్, 130 డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్లు స్వాధీనపర్చుకున్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ సునీల్‌దత్, కొత్తగూడెం డీఎస్పీ ఎంఎస్ అలీ, బెటాలియన్ అధికారి కేసీ అహ్లవత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ఎంటీఓ సోములు, ఎస్పీ పీఆర్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టు కొరియర్ అరెస్ట్
- రూ. 2.80 లక్షలు స్వాధీనం మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీసులు మావోయిస్టులకు కొరియర్‌గా పనిచేస్తున్నఓ వ్యక్తిని అరెస్టు చేశారు. సీఐ మొగిలి, ఎస్ఐ నరహరిలు తమ సిబ్బందితో ఈ ఉదయం వానాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేశారు. అతడిని మావోయిస్టులకు కొరియర్‌గా పనిచేస్తున్న బర్లా సురేశ్ కుమార్‌గా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి రూ. 2,80,000 నగదు, బైక్‌ను, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.