సాక్షి, ఏటూరునాగారం: ఏజెన్సీ పోలీసుల అదుపులో మావోయిస్టు పార్టీ కోరియర్ ఉన్నట్లు సమాచారం. పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో టార్గెట్లను అంతమొంతించేందుకు రెక్కి నిర్వహించే క్రమంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో యాక్షన్ టీం సంచారం కొంత కాలంగా ఉన్నట్లు పోలీసులు వాల్‌పోస్టర్ల ద్వారా బహిర్గతం చేశారు. అయితే పీఎల్‌జీఏ వారోత్సవాలు ఈనెల 2 నుంచి 8 వరకు జరిగే క్రమంలో మావోయిస్టు పార్టీ ఉనికి చాటుకోవడానికి కోరియర్ ద్వారా రెక్కి నిర్వహించే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment