మావోయిస్టు కొరియర్ అరెస్ట్
Published Fri, May 26 2017 1:29 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM
- రూ. 2.80 లక్షలు స్వాధీనం
మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీసులు మావోయిస్టులకు కొరియర్‌గా పనిచేస్తున్నఓ వ్యక్తిని అరెస్టు చేశారు. సీఐ మొగిలి, ఎస్ఐ నరహరిలు తమ సిబ్బందితో ఈ ఉదయం వానాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేశారు. అతడిని మావోయిస్టులకు కొరియర్‌గా పనిచేస్తున్న బర్లా సురేశ్ కుమార్‌గా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి రూ. 2,80,000 నగదు, బైక్‌ను, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement