manugur
-
మావోయిస్టు కొరియర్ అరెస్ట్
- రూ. 2.80 లక్షలు స్వాధీనం మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీసులు మావోయిస్టులకు కొరియర్‌గా పనిచేస్తున్నఓ వ్యక్తిని అరెస్టు చేశారు. సీఐ మొగిలి, ఎస్ఐ నరహరిలు తమ సిబ్బందితో ఈ ఉదయం వానాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేశారు. అతడిని మావోయిస్టులకు కొరియర్‌గా పనిచేస్తున్న బర్లా సురేశ్ కుమార్‌గా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి రూ. 2,80,000 నగదు, బైక్‌ను, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
కొండచిలువ కలకలం
మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు మండలం సమితిసింగారం పంచాయతీలోని జంగాలగుంప ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి ఆవరణలోని చెట్ల పొదల్లో కొండ చిలువ ప్రత్యక్షమైంది. కొండచిలువను చూసిన స్థానికలు దానిని చంపేశారు. కొండచిలువ దాడిచేసి మొత్తం 4 కోళ్లు, 2 బాతులను మింగింది. -
పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు మండలం చిన్నరాయిగూడెంలో అరుగురు అనుమానిత వ్యక్తులను పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రథం గుట్ట సమీపం నుంచి ఆటోలో వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాతోపాటు వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. గుప్త నిధుల తవ్వకాల కోసం వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.