
కొండచిలువ కలకలం
మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు మండలం సమితిసింగారం పంచాయతీలోని జంగాలగుంప ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి ఆవరణలోని చెట్ల పొదల్లో కొండ చిలువ ప్రత్యక్షమైంది. కొండచిలువను చూసిన స్థానికలు దానిని చంపేశారు. కొండచిలువ దాడిచేసి మొత్తం 4 కోళ్లు, 2 బాతులను మింగింది.